S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/08/2016 - 14:53

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ స్ట్రీట్‌కు ప్రపంచ బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌ అలీగా నామకరణం చేశారు. మూడు దశాబ్దాల పాటు పార్కిన్‌సన్‌ వ్యాధితో పోరాడిన అలీ 74 ఏళ్ల వయసులో ఈ నెల 3న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలీ అభిమానులు పెద్ద సంఖ్యలో మాడిసన్‌ స్క్వేర్‌కు చేరుకుని ఆయన పేరుతో ఉన్న ‘మహ్మద్‌ అలీ వే’ స్ట్రీట్‌ సైన్‌ బోర్డును ఏర్పాటు చేశారు.

06/08/2016 - 12:18

జకార్తా: ఇండోనేషియా ఉత్తర ప్రాంతంలోని మలుక్ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకూ సమాచారం లేదు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.4గా నమోదైందని, ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.

06/08/2016 - 08:21

వాషింగ్టన్, జూన్ 7: అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని హిల్లరీ క్లింటన్ దాదాపుగా దక్కించుకున్నారు. దీంతో 249 ఏళ్ల అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీనుంచి అభ్యర్థిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె అరుదైన రికార్డును సైతం సృష్టించబోతున్నారు.

06/08/2016 - 06:49

వాషింగ్టన్, జూన్ 7: భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం నెలకొన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రభావశీలత కలిగిన నాయకత్వాన్ని ప్రదర్శించారని వైట్‌హౌస్ ప్రశంసించింది. వాతావరణ మార్పులు నిరోధంసహా అనేక అంశాలపై నరేంద్ర మోదీ పట్టుదలగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ సమావేశం దృష్ట్యా ఆయన నాయకత్వంపై అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది.

06/08/2016 - 06:45

వాషింగ్టన్, జూన్ 7: భారత్‌లో చోరీకి గురయిన దాదాపు పది కోట్ల డాలర్ల విలువైన 200 ప్రాచీన కళాఖండాలను అమెరికా మంగళవారం భారత్‌కు తిరిగి ఇచ్చేసింది. వీటిలో కొన్ని 2వేల సంవత్సరాల నాటివి కూడా ఉన్నాయి. కాగా, ఈ కళాఖండాలను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాల్లో సాంస్కృతిక వారసత్వం ఒక బలమైన బంధమని అన్నారు. ‘సాధారణంగా ప్రపంచంలో దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుత కాలానికి చెందినవై ఉంటాయి.

06/08/2016 - 05:58

వాషింగ్టన్, జూన్ 7: భారత్-అమెరికాలు అన్ని రంగాల్లోనూ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఓవల్ హౌజ్‌లో గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము చర్చించిన అనేక అంశాలను సంయుక్త విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక పౌర అణు ఇంధన ఒప్పందం అమలు పురోగతిపై మోదీతో తాను చర్చించినట్టు ఒబామా వెల్లడించారు.

06/08/2016 - 05:51

బీజింగ్, జూన్ 7: నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చిన చైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది. 2008లో ముంబయి ఉగ్రవాద దాడి వెనుక పాక్ పాత్ర, అలాగే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నాయంటూ మొట్టమొదటిసారిగా ధ్రువీకరించింది. భారత ఆర్థిక రాజధాని ముంబయిపై 2008 నవంబర్‌లో పదిమంది లష్కరే ఉగ్రవాదులు దాడి జరిపి మారణకాండ సృష్టించడం, 166మంది ప్రాణాలు బలికొనడం తెలిసిందే.

06/07/2016 - 12:02

వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దివంగత ఇండో అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లాకు ఘనంగా నివాళులర్పించారు. కల్పన చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ. 2003లో అంతరిక్షం నుంచి కిందకు వస్తుండగా స్పేస్‌ షటిల్‌కు ప్రమాదం జరిగి ఆమె మరణించిన సంగతి తెలిసిందే.

06/07/2016 - 11:58

దోహా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ పర్యటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 23 మంది భారతీయ ఖైదీలను ఖతార్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ఖైదీలను విడుదల చేసినందుకు ఖతార్ నేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

06/07/2016 - 05:26

లాస్ ఏంజెలిస్, జూన్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. కాలిఫోర్నియాలో కీలక ప్రైమరీ ఎన్నికలకు ముందు జరిగిన రెండు ప్రైమరీల్లో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్ధి బెర్నీ శాండర్స్‌ను ఓడించారు. ప్యూర్టోరికోతో పాటు వర్జిన్ ఐలెండ్స్‌లో జరిగిన ఈ ప్రైమరీల్లో శాండర్స్‌పై హిల్లరీ ఘన విజయం సాధించారు.

Pages