S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/07/2016 - 05:18

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా (జెయుడి) ఉగ్రవాద సంస్థ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్‌పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అతను హెచ్చరించాడు.

06/07/2016 - 05:16

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్‌తో సుహృద్భావ చర్చల ప్రక్రియ క్రమంగా మూసుకుపోతోందని, ఇందుకు ఎలాంటి సానుకూలత లేదంటూ భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. భారత్‌తో చర్చలు జరపాలని తామెంత మాత్రం పాకులాడటం లేదని, చివరి క్షణంలో ఏదో సాకుతో తప్పించుకుంటున్నది ఆ దేశమేనని స్పష్టం చేశారు.

06/07/2016 - 04:46

న్యూఢిల్లీ, జూన్ 6: డెన్మార్క్‌కు చెందిన 52 సంవత్సరాల మహిళపై రెండేళ్ల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ మహిళను కత్తితో బెదిరించి, కిడ్నాప్ చేసి వీరు అత్యాచారానికి పాల్పడ్డారని కోర్టు ధ్రువీకరించింది. నిందితులు ఐదుగురిపై నమోదైన ఆరోపణలను నిర్ధారిస్తున్నామని అదనపు సెషన్స్ న్యాయమూర్తి రమేష్ కుమార్ వెల్లడించారు.

06/07/2016 - 04:45

జెనీవా, జూన్ 6: అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత్ చేసిన దౌత్య ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జి కీలక సమావేశం జరుగనున్న తరుణంలో భారత్ సోమవారం స్విట్జర్లాండ్ మద్దతు సంపాదించగలిగింది. భారతీయులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కూడబెట్టిన నల్లధనాన్ని వెలికితీయడంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.

06/06/2016 - 08:19

వాషింగ్టన్, జూన్ 5: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జరుపుతున్న పర్యటన ఇరు దేశాల మధ్య భద్రతా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, అలాగే గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏమేరకు వృద్ధిచెందింది అనే దానిపైన సరైన అవకాహన కల్పిస్తుందని అమెరికా విదేశాంగ విభాగం పేర్కొంది.

06/06/2016 - 07:38

దోహా, జూన్ 5: భారత్, ఖతార్‌ల మధ్య ఆదివారం ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మనీ లాండరింగ్ (హవాలా), ఉగ్రవాద సంస్థలకు నిధులను అదుపు చేయడానికి ఆర్థిక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన ఒప్పందం, అలాగే ఖతార్‌నుంచి వౌలిక సదుపాయాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఒప్పందం కూడా వీటిలో ఉన్నాయి.

06/06/2016 - 07:38

దోహా, జూన్ 5: హవాలా లావాదేవీలు, ఉగ్రవాద నిధులను అదుపు చేయడానికి ఇంటెలిజన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఖతార్‌లు ఆదివారం అంగీకరించాయి. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, దానికి మద్దతు ఇచ్చే శక్తులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు పేర్కొంటూ, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే, దాన్ని తమ విధానాకి ఒక పావుగా ఉపయోగించుకునే శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి.

06/06/2016 - 06:39

దోహా, జూన్ 5: భారత్‌లో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి అలవాటు పడ్డ ఎందరి నోళ్లనో కట్టేశానని..ఆ విధంగా ఎన్నో సమస్యలూ ఎదుర్కొన్నానని చెప్పారు.

06/05/2016 - 07:02

దోహా, జూన్ 4: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్‌లో పర్యటిస్తున్న క్రమంలో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల ప్రగతిని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా శనివారం ఇక్కడకు చేరుకున్న మోదీ.. ఆదివారం ఖతార్ అధినాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా హైడ్రోకార్బన్ రంగంలో ఖతార్ సాయాన్ని మోదీ కోరనున్నారు.

06/05/2016 - 06:27

సింగపూర్, జూన్ 4: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, బలప్రయోగం, ఇతర ముప్పులనుంచి ఎదుర్కోవడానికి ఒక ప్రాంతీయ భద్రతా వ్యవస్థ అవసరమని భారత్ అభిప్రాయ పడింది. శనివారం ఇక్కడ 15వ షంగ్రీ-లా సదస్సునుద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ పిలుపునిచ్చారు.

Pages