S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/26/2016 - 06:59

లండన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్‌నుంచి వైదొలగాలని బ్రిటన్‌వాసులు రెఫరెండంలో ఓటువేయడంపైన ఇయు సైతం గుర్రుగా ఉంది. వీలయినంత త్వరగా యూరోపియన్ యూనియన్‌నుంచి తప్పుకుంటే మాకు కూడా మంచిదంటూ యూరోపియన్ కమిషన్ చ్మైన్ జీన్ క్లాడె జంకర్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయానికి విడాకుల లేఖ పంపడానికి బ్రిటన్ ప్రభుత్వానికి అక్టోబర్ వరకు సమయం ఎందుకు అవసరమో నాకు అర్థంకావడం లేదు.

06/26/2016 - 04:55

లండన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి అనుకూలంగా గురువారం జరిగిన రెఫరెండంలో తీర్పు రావడంతో షాక్ తిన్న బ్రిటన్‌వాసులు మరోసారి రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ రెఫరెండం కోరుతూ పెట్టిన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేసిన వారి సంఖ్య ఒక్క రోజులోనే పదిలక్షలు దాటేసింది.

06/26/2016 - 02:49

వాషింగ్టన్, జూన్ 25: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఇఎస్)కు గనుక ఆహ్వానిస్తే తాను భారత్ సందర్శించే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ ఒబామా ఈ విషయం చెప్పారు.

06/26/2016 - 02:28

వాషింగ్టన్, జూన్ 25: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారయిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విరాళాలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత్-అమెరికా అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేయడానికి భారతీయ రాజకీయ నేతలు, సంస్థలనుంచి హిల్లరీ క్లింటన్ భారీఎత్తున ముడుపులు అందుకున్నారని ట్రంప్ మరోసారి ఆరోపించారు.

06/25/2016 - 16:18

వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి ‘బ్రెగ్జిట్’ పేరిట బ్రిటన్ వాసులు మొగ్గు చూపడంతో ఇపుడు అమెరికాలోనూ వేర్పాటువాదాలు తెరపైకి వస్తున్నాయి. అమెరికా నుంచి టెక్సాస్ రాష్ట్రం విడిపోవాలన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ‘టెగ్జిట్’ పేరిట వేర్పాటువాద ఉద్యమం ఊపిరి పోసుకుంటోంది. బ్రెగ్జిట్ ఫలితాలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించగా ఇపుడు టెక్సాస్‌లో సరికొత్త చర్చ మొదలైంది.

06/25/2016 - 08:22

తాష్కెంట్, జూన్ 24: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షను భారత్, రష్యాలు వ్యక్తం చేశాయి. పౌర అణు ఇంధన ఒప్పందం, హైడ్రోకార్బన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని శుక్రవారం ఇక్కడ సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను సంకల్పించారు.

06/25/2016 - 06:45

లండన్, జూన్ 24: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం తన పదవికి రాజీనామా ప్రకటించారు. బ్రిటన్ రెఫరెండం ఫలితాలు 28 దేశాలు సభ్యులుగా ఉన్న యూరోయపన్ యూనియన్‌కే కాక మొత్తం ప్రపంచానికే షాక్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ దారుణంగా పతనమైనాయి.

06/25/2016 - 05:23

సియోల్, జూన్ 24: అణు సరఫరాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందేందుకు చివరి క్షణం వరకూ భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారత్ సహా అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలకు సభ్యత్వం కల్పించే ప్రసక్తి లేదని ఎన్‌ఎస్‌జి స్పష్టం చేసింది.

06/24/2016 - 18:30

లండన్‌: బ్రిటన్‌వాసులు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వేరుపడటం ఖరారైంది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ తీర్పు ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పత్రికల ముఖచిత్రాలపై బ్రెగ్జిట్‌ మార్మోగింది. ‘వి ఆర్‌ అవుట్‌’, ‘సీ ఈయూ లేటర్‌’ అంటూ ప్రత్యేక ముఖచిత్రాలతో ప్రచురించిన వార్తాపత్రికలు ఇప్పుడు బ్రిటన్‌లో ఆసక్తిగా మారాయి.

06/24/2016 - 17:29

టర్న్‌బెర్రీ: బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు అద్భుతమని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ట్రంప్‌- యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం చాలా గొప్ప విషయమని.. బ్రిటన్‌ వాసులు తమ దేశాన్ని సాధించుకున్నారని అన్నారు.

Pages