S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/16/2016 - 07:36

న్యూయార్క్, జూన్ 15: ఒర్లాండో నైట్ గే క్లబ్‌పై విచక్షణ లేకుండా కాల్పులకు తెగబడి 50మంది ప్రాణాలను బలిగొన్న ఒమర్ మతిన్ భార్య క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. మతిన్ ఆయుధాలు కొనుగోలు చేసినప్పుడు అతని భార్య నూర్ జాహి సల్మాన్ కూడా ఉన్నట్లు ఎఫ్‌బిఐ విచారణలో తేలింది. అంతేకాకుండా కాల్పుల దురాగతానికి పాల్పడటానికి ముందు మతిన్‌తోపాటు సల్మాన్ కూడా ఒకసారి గే క్లబ్‌కు వెళ్లి వచ్చింది.

06/15/2016 - 08:09

వాషింగ్టన్, జూన్ 14: అమెరికాలో వలస చట్టం ఘోరంగా విఫలమైందని, దీనిద్వారానే దేశంలోకి ఇస్లామిక్ తీవ్రవాదం దేశంలోకి దిగుమతి అవుతోందని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘దేశంలోకి ఇస్లామిక్ తీవ్రవాదం ఎలా వస్తోందనే దానిపై మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి.

06/15/2016 - 08:08

వాషింగ్టన్, జూన్ 14: అమెరికా చరిత్రలో అతిపెద్ద కాల్పుల ఘటన జరిగి 50మంది ప్రాణాలను బలిగొన్న ఓర్లాండో నైట్ గే క్లబ్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం సందర్శించనున్నారు. మృతులకు ఆయన నివాళులు అర్పిస్తారు. ఫ్లోరిడా ప్రజలకు ఆయన తన సంఘీభావాన్ని ప్రకటిస్తారు. వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఓర్లాండో ఘటనతో ఒబామా విస్కాన్‌సన్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు.

06/15/2016 - 08:07

అక్రా, జూన్ 14: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అఫ్రికాకు చెందిన ఘనా, ఐవరీ కోస్ట్, నమీబియా దేశాల్లో తొలిసారిగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన ముగిసిన కొద్దిరోజులకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలను సందర్శించనున్నారు.

06/15/2016 - 08:06

బీజింగ్, జూన్ 14: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడంవల్ల తమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా దీనివల్ల పాకిస్తాన్‌ను కూడా రెచ్చగొట్టినట్టు అవుతుందని స్పష్టం చేసింది.

06/15/2016 - 04:22

అంకారా, జూన్ 14: అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర అల్ బాగ్దాదీ అమెరికా వైమానిక దాడుల్లో హతుడైనట్టు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికాలోని ఓర్లాండోలో 50మంది గేలను హతమార్చడం వెనుక తమ హస్తం ఉందంటూ ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో, దాని అధినేతే హతం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కథనాలు నిజమైతే ఐసిస్‌కు చావుదెబ్బేనని భావిస్తున్నారు.

06/14/2016 - 06:30

ఇస్లామాబాద్, జూన్ 13: అణు సరఫరాదారుల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వానికి సంబంధించి భారత్‌కన్నా తనకే బలమైన అర్హతలున్నాయని దాయాది దేశం పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది.

06/14/2016 - 05:38

హైదరాబాద్, జూన్ 13: శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం లండన్ వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం రద్దయింది. దీంతో లండన్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇటీవల శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోపే సాంకేతిక లోపంతో వెనుదిరిగి ల్యాండ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.

06/14/2016 - 02:56

ఆక్రా, జూన్ 13: ఉగ్రవాదం అనేది ఎల్లలు లేకుండా ప్రపంచమంతా విస్తరించిన మహమ్మారి అని పేర్కొంటూ నాగరిక ప్రపంచం సమష్టి కృషితో ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించి తీరాలని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఘనా దేశానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల పర్యటనకోసం ఇక్కడికి వచ్చారు. భారత రాష్టప్రతి ఘనా దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

06/14/2016 - 02:54

ఓర్లాండో (అమెరికా) జూన్ 13: ఆదివారం సాయంత్రం, గే నైట్ క్లబ్‌లో వీకెండ్ హంగామా. అంతా తాగుతూ, తూగుతూ, తుళ్లుతూ మైకం కైపెక్కి మైమరచి ఉన్న సమయం. సరిగ్గా అదే టైంలో ఏఆర్-15 గన్‌తో 29 ఏళ్ల ముస్లిం అమెరికన్ ఒమర్ మాటిన్ క్లబ్‌లోకి ప్రవేశించాడు. క్లబ్‌లోకి వచ్చీ రావటంతోనే మారణకాండకు ఒడిగట్టిన తీరు అమెరికా దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ముందుగా అక్కడున్న పోలీసును కాల్చేశాడు..

Pages