S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/23/2015 - 06:09

కొన్ని దశాబ్దాలుగా అంతూపొంతూ లేకుండా ఉన్న భారత్, బంగ్లా భూ బదలాయింపు ఒప్పందం సాకారమైంది. 1974లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తమతమ దేశాల పరిధిలో ఉన్న ఎన్‌క్లేవ్‌లను రెండు దేశాలు బదిలీ చేసుకున్నాయి. బంగ్లాలో భారత్‌కు సంబంధించి 111 ఎన్‌క్లేవ్‌లు అలాగే భారత్‌లో బంగ్లాకు సంబంధించి 51 ఎన్‌క్లేవ్‌లు పరస్పరం మార్చుకోవడంతో ఈ జటిల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది.

12/23/2015 - 06:22

ఉగ్రవాదాన్ని పరోక్షంగా బలపరుస్తూ భారత్‌లో అశాంతికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ శాంతి చర్చలకు సంసిద్ధమైంది. కాశ్మీర్ సహా అనేక అంశాలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ ఉగ్రవాదాన్ని అజెండా పెట్టుకున్న పాక్ నాయకత్వం శాంతి ప్రాధాన్యతను గుర్తించింది. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కుదిరింది.

12/23/2015 - 06:10

ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన విదేశీ పర్యటనలు భారత్‌తో అనేక దేశాలకు సన్నిహిత సంబంధాలను పాదుగొల్పడమే కాకుండా వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ఊతాన్నిచ్చాయి. ముందుగా పొరుగు దేశాలతో పర్యటనలకు శ్రీకారం చుట్టిన మోదీ అమెరికా, యుకె, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, కెనడా, చైనా, ఐర్లాండ్ తదితర దేశాల్లో విస్తృతంగానే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాంతీయంగానూ అంతర్జాతీయంగానూ వాదనను బలంగానే వినిపించారు.

12/23/2015 - 06:11

ఉగ్రవాదాన్ని పరోక్షంగా బలపరుస్తూ భారత్‌లో అశాంతికి ఆజ్యం పోసిన పాకిస్తాన్ శాంతి చర్చలకు సంసిద్ధమైంది. కాశ్మీర్ సహా అనేక అంశాలను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ ఉగ్రవాదాన్ని అజెండా పెట్టుకున్న పాక్ నాయకత్వం శాంతి ప్రాధాన్యతను గుర్తించింది. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ఒప్పందం కుదిరింది.

12/23/2015 - 06:15

మైన్మార్‌లో జరిగిన చారిత్ర ఎన్నికలు సైనిక పాలనకు స్వస్తిచెప్పి ప్రజాస్వామ్య పాలనా విధానానికి తెరతీశాయి. ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలోనే గడిపిన అంగ్‌సాన్ సూకీ సారధ్యంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ ఘన విజయం సాధించి దేశ గతినే మార్చేసింది. సైనిక పాలకులు సైతం ఊహించనంత స్థాయిలో ఎన్‌ఎల్‌డికి ప్రజలు పట్టం గట్టారు.

12/23/2015 - 06:16

నవంబర్ 13న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌పై జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో 130 మంది మరణించారు. ఏకకాలంలో అనేకచోట్ల జరిగిన ఈ దాడులు ప్రపంచ దేశాలను కదిలించాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్టుగా దర్యాప్తులో నిగ్గుతేల్చారు. ఈ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధ్భేరీ మోగించాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామంటూ ప్రతిన చేశాయి.

12/23/2015 - 06:07

అత్యంత భయానక రీతిలో నేపాల్‌ను పెను భూకంపం కుదిపేసింది. ఖాట్మండు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లోని భవనాలు, చారిత్రక కట్టడాలు, ఆలయాలు నేలమట్టమయ్యాయి. వందలాదిగా ప్రాణనష్టం జరిగింది. నెలల తరబడి ప్రజలు దిక్కూమొక్కూలేని స్థితిలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా అనేక దేశాలు నేపాల్‌కు చేయూతను అందించాయి. అన్ని విధాలుగా ఆ దేశాన్ని ఆదుకున్నాయి.
రాజకీయ పార్టీల చారిత్రక ఒప్పందం

12/22/2015 - 07:01

ఎత్తయిన అలలు ఢీకొనడంతో మునిగిన నౌక
సెంట్రల్ ఇండోనేసియాలో ప్రమాదం

12/22/2015 - 07:00

మిస్ యూనివర్స్ పోటీలో పెద్ద పొరపాటు
తరువాత సవరించుకున్న అతిథి స్టీవ్ హార్వే

12/22/2015 - 06:08

మిస్ యూనివర్స్ కిరీటంతో చిర్నవ్వులు చిందిస్తున్న మిస్ ఫిలిప్పీన్స్ పియా అలెండో (కుడివైపు). తొలుత విశ్వసుందరిగా మిస్ కొలంబియా అరిండా గుటిర్రెడ్జ్ ఎన్నికైనట్టు నిర్వాహకులు పొరపాటున ప్రకటించటంతో మాజీ విశ్వసుందరి పౌలినా వేగ అభినందనల పూలగుత్తి అందించి కిరీటాన్ని కూడా అందించింది. వెంటనే తప్పు తెలుసుకుని అసలు విజేత మిస్ ఫిలిప్పీనే్సనని ప్రకటించటం కార్యక్రమంలో కొసమెరుపు.

Pages