S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/25/2016 - 08:48

వాషింగ్టన్, మే 24: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే తన రియల్ ఎస్టేట్ కంపెనీల్లాగానే దేశాన్ని కూడా దివాలా తీయిస్తాడని ఆయన ప్రత్యర్థి డెమొక్రాట్ల తరపున అభ్యర్థిగా ఎంపికయ్యేందుకు దూసుకుపోతున్న హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ నామినీ అయిన ట్రంప్ ఆర్థిక విధానం తక్కువ వేతనాలు.. తక్కువ ఉద్యోగాలు, ఎక్కువ అప్పులు కలిసిన ఓ వంటకం అని ఆమె వ్యాఖ్యానించారు.

05/25/2016 - 07:02

న్యూయార్క్, మే 24: రాజద్రోహం, నేరపూరిత పరువు నష్టం వంటి అస్పష్ట పదాలతో రూపొందించిన కొన్ని చట్టాలు భారత్‌లో భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను నిర్మూలించేందుకు వినియోగిస్తున్నారని మానవ హక్కుల రక్షణ సంస్థ (హ్యూమన్ రైట్స్ వాచ్ - హెచ్‌ఆర్‌డబ్ల్యు) తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ చట్టాలను శాంతియుతంగా భావ వ్యక్తీకరణ చేయటాన్ని నేరంగా చేసేందుకు వాడుతున్నారని విమర్శించింది.

05/25/2016 - 07:01

బీజింగ్, మే 24: ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకుంటూ..విభేదాలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవడమే చైనాతో భారత మైత్రిలో కీలకాంశమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. నాలుగు రోజుల చైనా పర్యటనకు వచ్చిన రాష్టప్రతి గ్వాంగ్‌ఝులో భారత సంతతిని ఉద్దేశించి మాట్లాడారు.చైనాతో సహకారాన్ని విస్తరించుకునేందుకే భారత్ ప్రయత్నించింది తప్ప విభేదాలను పెంచుకోలేదని గుర్తు చేశారు.

05/24/2016 - 18:13

దిల్లీ: నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం చైనాకు బయలుదేరారు. ఆయన తొలుత చైనాలోని పారిశ్రామిక ప్రాంతమైన గ్వంగ్స్యూకు చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులను కలుస్తారు. బుధవారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడిని కలుసుకుంటారు. ప్రణబ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

05/24/2016 - 13:33

వాషింగ్టన్: అమెరికాలోని హనాపెపే ద్వీపంలో మంగళవారం ఉదయం రన్ వే పైనుంచి ఎగిరిన వెంటనే ఓ విమానంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలెట్‌తో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.

05/24/2016 - 01:27

టెహ్రాన్, మే 23: ఉగ్రవాదం, అతివాదంపై కలసికట్టుగా పోరాడాలని భారత్, ఇరాన్ నిశ్చయించుకున్నాయి. అవసరమైన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆ దేశ అధ్యక్షుడు హుస్సేన్ రౌహానీతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు.

05/24/2016 - 01:23

బీరుట్, మే 23: సిరియాలోని జబ్లెహ్, టార్టస్ నగరాలపై సోమవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో 120 మందికిపైగా మృతి చెందారు. జబ్లెహ్ నగరంపై జరిపిన దాడుల్లో 73 మంది, టార్టస్ నగరంపై జరిపిన దాడుల్లో 48 మంది మృతి చెందారు.

05/24/2016 - 01:16

బీజింగ్/న్యూఢిల్లీ, మే 23: దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదాలపై భారత్‌తో ద్వైపాక్షిక చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు ప్రణబ్ ముఖర్జీ చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలపై చైనా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

05/24/2016 - 01:14

బ్యాంకాక్, మే 23: థాయిలాండ్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఎగిసిపడిన మంటల వల్ల 18 మంది బాలికలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర థాయిలాండ్‌లోని కొండ ప్రాంత గిరిజనులకోసం ఏర్పాటు చేసిన ఈ పాఠశాల వసతిగృహంలో ఆదివారం రాత్రి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని పోలీసులు సోమవారం చెప్పారు.

05/23/2016 - 18:19

చియాగ్‌రాయ్: ఉత్తర థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్ వద్ద ఓ బాలికల పాఠశాలలో సోమవారం ఉదయం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. అక్కడే హాస్టల్ భవనంలోనూ మంటలు చెలరేగడంతో 18 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాలికలను ఈ ప్రమాదం నుంచి రక్షించగలిగారు. మూడు గంటల సేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Pages