S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/09/2016 - 00:27

కాబూల్, మే 8: అఫ్గాన్‌లోని ఒక హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 73 మంది మరణించగా, దాదాపు యాభై మంది కాలిన గాయాలతో బయటపడ్డారు. రెండు బస్సుల్లో దాదాపు 125 మంది ఉన్నట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్‌ను బస్సులు ఢీకొనడంతో, మూడు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి. అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు సమీపంలోని ఘజినీ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో మృతి చెందిన 73 మందిలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు.

05/08/2016 - 03:43

లండన్, మే 7: లండన్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఒక ముస్లిం మేయర్‌గా ఎన్నికై అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్ (45), అధికార పార్టీకి చెందిన ఓ బిలియనీర్ కుమారుడైన జాక్ గోల్డ్‌స్మిత్ (41)ను భారీ మెజారిటీతో ఓడించి తన సత్తా చాటుకున్నాడు. సాదిక్ ఖాన్ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక బస్సు డ్రైవర్.

05/08/2016 - 03:37

వాషింగ్టన్, మే 7: అంగారక గ్రహ వాతావరణంలో ఆక్సిజన్ (ప్రాణ వాయువు) అణువులు ఉన్నాయని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. గత 40 ఏళ్లలో ఇటువంటి ఆవిష్కరణ జరగడం ఇదే తొలిసారి. మీసోస్పియర్‌గా పిలిచే అంగారక గ్రహ వాతావరణంలోని ఎగువ దొంతర (లేయర్)లో ఈ అణువులు ఉన్నాయని, అంగారకుడి నుంచి ఇతర వాయువులు బయటపడి అక్కడి వాతావరణంపై ప్రభావం చూపేందుకు ఇవి దోహదపడుతున్నాయని శాస్తవ్రేత్తలు గుర్తించారు.

05/08/2016 - 03:29

వాషింగ్టన్, మే 7: అమెరికా అధ్యక్ష పదవికోసం సాగే పోటీ వినోదాత్మక కార్యక్రమమో, రియాల్టీ షోనో కాదని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమని తేలిన తరువాత ఆయన గురించి ఒబామా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి.

05/07/2016 - 14:59

సిరియా: తిరుగుబాటు చేసిన ఖైదీలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా అయిదుగురు ఖైదీలు మరణించిన సంఘటన సిరియాలోని హమా జైలులో జరిగింది. ఉగ్రవాదులకు అనుకూలంగా ఖైదీలు నినాదాలు చేయడంతో గొడవ మొదలైంది. సుమారు 800 మంది ఖైదీలు తిరుగుబాటు చేయగా వారిపై తొలుత పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా ఫలితం లేనందున కాల్పులు జరిపారు.

05/06/2016 - 05:00

వాషింగ్టన్, మే 5: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అయినట్లుగా భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ముస్లిం వ్యతిరేక వైఖరిని మరోసారి ప్రకటించారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని, అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారందరినీ తిప్పి పంపాలని ఆయన పునరుద్ఘాటించారు.

05/04/2016 - 06:50

వాషింగ్టన్, మే 3: అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్యే పోటీ దాదాపు ఖాయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కీలక రాష్టమ్రైన ఇండియానా ప్రైమరీల ఓటింగ్ మంగళవారం ప్రారంభం కావడంతో వచ్చే నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే ప్రధాన అభ్యర్థులుగా డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు పోటీ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తాజా సర్వేలు అంచనా వేశాయి.

05/04/2016 - 06:50

వాషింగ్టన్, మే 3: ఎఫ్-16 యుద్ధ విమానాల కొనుగోలుకు తాము ఎలాంటి నిధులను సమకూర్చలేమని, అందువల్ల మొత్తం సొమ్ము ఇచ్చి వాటిని కొనుగోలు చేయాలని అమెరికా పాకిస్తాన్‌కు స్పష్టం చేయడంతో ఈ విమానాల కొనుగోలు సందిగ్ధంలో పడింది. మరోవైపు అమెరికా గనుక నిధులను సమకూర్చని పక్షంలో తాము ఆ విమానాలను వేరే దేశంనుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని పాక్ పరోక్షంగా బెదిరించింది.

05/04/2016 - 06:46

హేగ్, మే 3: మెరైన్ల కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇటలీకి చుక్కెదురైంది. నేరం జరిగింది భారత పరిధిలోనేనని సుప్రీంకోర్టు గనుక నిర్ధారిస్తే హత్యా నేరం ఎదుర్కొంటున్న మెరైన్ సాల్వటోర్ గిరోన్ ఆ దేశానికి అప్పగించాల్సిందేనని ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వ కోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

05/03/2016 - 02:52

రోమ్, మే 2: ఢిల్లీలో నాలుగేళ్లకు పైగా కాలం నుంచి నిర్బంధంలో ఉన్న ఇటలీ నావికుడిని భారత్ విడుదల చేయాలని, అతన్ని స్వదేశానికి వెళ్లనివ్వాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆర్బిట్రేషన్ కోర్టు ప్రాథమికంగా తీర్పు ఇచ్చిందని ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అయితే ఈ కేసు విచారణ ఆర్బిట్రేషన్ కోర్టులో కొనసాగుతుందని పేర్కొంది.

Pages