S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/03/2016 - 02:40

లండన్, మే 2: భారతీయ సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాది సిద్ధార్థ ధర్ కొత్త జిహాదీ జాన్ (సీనియర్ కమాండర్)గా వ్యవహరిస్తున్నట్లు మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి. నిహాద్ బరాకత్ అనే యువతిని సిద్ధార్థ అపహరించుకుపోయి ఐసిస్‌లో సెక్స్ బానిసగా మార్చినట్లు ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది.

05/03/2016 - 02:34

వాషింగ్టన్, మే 2: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చి ఐదేళ్లు గడుస్తుండటంతో అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) చీఫ్ జాన్ బ్రెన్నన్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థపై దృష్టి కేంద్రీకరించారు.

05/03/2016 - 02:33

వాషింగ్టన్, మే 2: భారత్‌లో మత సహన పరిస్థితులు క్షీణించాయని,మత స్వేచ్ఛ ఉల్లంఘనలూ పెరిగిపోయాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛ అధ్యయన నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. వివిధ మతాలకు చెందిన ప్రజలను చులకన చేస్తూ అధికారులు, మత నాయకులు చేసే ప్రకటనలు కట్టడి చేయాలని భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ విజ్ఞప్తి చేసింది.

05/02/2016 - 06:47

అక్లాండ్, మే 1: అసమ్మతి లేకపోతే పార్లమెంటు వ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం ఉండదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఇక్కడ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ సహా అనేక కీలక అంశాలపై విస్తృతంగా పోటాపోటీగా చర్చ జరిగినప్పుడే అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని భారత్, న్యూజిలాండ్ వ్యాపార మండలి సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు.

05/02/2016 - 06:47

వాషింగ్టన్, మే 1: ‘ఒబామా ఔట్’.. ఈ మాట ఎవరో అన్నది కాదు.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తనపై తానే పేల్చుకున్న జోక్ ఇది. వైట్‌హౌస్‌లో ఆదివారం జరిగిన ‘బ్లాక్‌టై’ కార్యక్రమంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, జర్నలిస్టులు, తన తరువాతి అధ్యక్షపదవిని ఆశిస్తున్న హిల్లరీ, డొనాల్డ్ ట్రంప్‌లపైనా సరదా కామెంట్లు చేశారు.

05/01/2016 - 06:11

ఆక్లాండ్, ఏప్రిల్ 30: భారత్, న్యూజిలాండ్ మధ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. భారత్ అనుసరిస్తున్న ‘లుక్ ఈస్ట్’ విధానం ఇప్పుడు ‘లుక్ యాక్ట్’గా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ప్రణబ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

04/30/2016 - 07:22

లండన్, ఏప్రిల్ 29: దేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్‌కు తిరిగివచ్చేది లేదని తేల్చిచెప్పేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను దేశం విడిచిరావల్సి వచ్చిందని ఆయన చెప్పారు. పాస్‌పోర్టు రద్దుచేయడం లేదా అరెస్టు చేయడం ద్వారా తన నుంచి బాకీ ఎలా వసూలు చేయగలరని ఆయన ప్రశ్నించారు.

04/30/2016 - 07:18

న్యూయార్క్, ఏప్రిల్ 29: భారత్‌తో సం బంధాలను మెరుగుపర్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, అయితే భారత్ మాత్రం కేవలం ఉగ్రవాదంపై మాట్లాడడానికే ఆసక్తి కనబరుస్తోందని, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబందాల మెరుగుకు అది ఎంతమాత్రం తోడ్పడజాలదని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీ అన్నారు.

04/30/2016 - 06:40

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అమెరికా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి జరుపుకునే కృషికి మరింత జవసత్వాలను అందిస్తుందని అధికార, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు ముక్తంఠంతో అభిప్రాయ పడ్డారు.

04/30/2016 - 06:38

పోర్ట్ మోరెస్‌బి, ఏప్రిల్ 29: అసహనం, తీవ్రవాదం జాడ్యాలతో సతమతమవుతున్న ప్రపంచానికి నేటికీ మహాత్మాగాంధీ బోధనల ఆవశ్యకత ఎంతయినా ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవం వంటి నిజమైన విలువలు నేటికీ అనుసరణీయమని ఆయన అంతర్జాతీయ సమాజానికి గుర్తుచేశారు.

Pages