S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/29/2016 - 05:30

పోర్ట్ మోరెస్బీ(పీఎన్జీ), ఏప్రిల్ 28: దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి నేపథ్యంలో సముద్రమార్గంలో ఉద్రిక్తతలు, శత్రుత్వాలు కూడదని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం పిలుపునిచ్చారు.

04/29/2016 - 04:44

వాషింగ్టన్, ఏప్రిల్ 28: పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విమానాలను అది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కాక భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందేమోనన్న భయాలు వ్యక్తం చేశారు.

04/28/2016 - 17:51

దిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి బహిష్కరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ యుకె హైకమిషన్‌కు లేఖ రాసింది. లండన్‌లోని భారత హైకమిషన్ కూడా ఇదే రకమైన విజ్ఞప్తితో అక్కడి బ్రిటన్ అధికారులకు లేఖ రాసింది.

04/27/2016 - 05:51

వాషింగ్టన్, ఏప్రిల్ 26: అమెరికా అధ్యక్ష పదవికి పార్టీల అభ్యర్థిత్వ రేసు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ పోల్ సర్వే రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ కంటే, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ మూడుశాతం ఆధిక్యంతో ముందుకు సాగుతున్నట్లు తేల్చింది. జార్జివాషింగ్టన్ యూనివర్సిటీ బాటిల్‌గ్రౌండ్ నిర్వహించిన పోల్ సర్వేలో హిల్లరీ 46శాతం, ట్రంప్ 43శాతం మంది మద్దతుతో కొనసాగుతున్నారు.

04/27/2016 - 05:44

లండన్, ఏప్రిల్ 26: బ్రిటన్‌లో ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన బిగ్‌బెన్(క్లాక్‌టవర్) మూగబోతోంది. 315 అడుగుల ఎతె్తైన ఈ క్లాక్ టవర్‌ను 1856లో పూర్తిచేశారు. 2009 నాటికే నూట ఏభై ఏళ్లు పూర్తిచేసుకున్న బిగ్‌బెన్‌ను అధికారికంగా ఎలిజబెత్ టవర్‌గా నామకరణ చేశారు.

04/26/2016 - 17:04

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) వ్యవస్థాపకుడు అమానుల్లా ఖాన్ (82) ఊపిరితిత్తుల వ్యాధితో మంగళవారం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన అల్లుడు సజ్జద్ తెలిపారు. 1977లో కొంతమంది న్యాయవాదులతో కలిసి జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) స్థాపించారు. ఇండియా, పాకిస్థాన్ నుంచి కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించాలని ఆయన కోరుకున్నారు.

04/26/2016 - 14:42

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్‌పీ త్యాగికి వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భారీగా ముడుపులు అందినట్లు ఇటలీ కోర్టు నిర్ధారించింది. భారతీయ అధికారులకు దాదాపు 15 మిలియన్ డాలర్లు ముడుపులు అందినట్లు రుజువైందని స్పష్టం చేసింది. 2010 నాటి అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై విచారణ జరిపి ఇటలీ కోర్టు తీర్పును ఇచ్చింది.

04/26/2016 - 05:16

వాషింగ్టన్, ఏప్రిల్ 25: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి సంబంధించి ప్రైమరీలు తుది దశకు చేరుకుంటున్న దశలో రిపబ్లికన్ పార్టీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో రియల్ ఎస్టేట్ టైకూన్, రేసులో ప్రధానంగా ముందున్న డొనాల్డ్ ట్రంప్‌ను నిలువరించలేని ఆయన ప్రత్యర్థులు టెడ్ క్రూజ్, జాన్ కసిచ్‌లు చేతులు కలిపారు.

04/26/2016 - 01:57

లోయర్ శాక్సోనీ(జర్మనీ), ఏప్రిల్ 25: ప్రపంచానికి బలమైన ఐక్యమైన ఐరోపా సమాజం అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఐరోపా సమాజం గత శతాబ్దంలోని యుద్ధాలు, మారణకాండలతో పోలిస్తే ఈ శతాబ్దపు సామరస్యం, సౌభ్రాతృత్వం గొప్పవని ఆయన అన్నారు.

04/25/2016 - 08:40

లండన్, ఏప్రిల్ 24: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగితే ప్రపంచంపై దాని ప్రభావం తగ్గుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. బ్రిటన్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి పదేళ్లు పట్టవచ్చని కూడా ఆయన హెచ్చరించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనకు వచ్చిన ఒబామా చివరి రోజయిన ఆదివారం బిబిసికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు.

Pages