S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/22/2016 - 05:31

న్యూయార్క్, ఏప్రిల్ 21: టైమ్స్ మ్యాగిజైన్ అంత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్‌లకు చోటు దక్కింది. అలాగే వంద మంది ప్రభావవంతుల జాబితాలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ పేర్లు చోటుచేసుకున్నాయి. టైమ్స్ వార్షిక జాబితా గురువారం విడుదల చేసింది.

04/21/2016 - 09:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. 63 ఏళ్ల రాచరికపు దర్పం ఆమెది. అయినా ఆమెకు ఇప్పటి వరకు ఎలాంటి పాస్‌పోర్ట్ లేదు. ఆమె ముఖమే ఆమెకు పాస్‌పోర్ట్. తిరుగులేని బ్రిటిష్ రాచరికపు దర్పంతో.. పాస్‌పోర్ట్ లేకుండానే ఆమె 117 దేశాలు పర్యటించి వచ్చింది.

04/21/2016 - 09:01

న్యూయార్క్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్ష పదవికి ప్రధాన పార్టీలయిన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో అందరికన్నా ముందు న్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు అత్యంత కీలకమైన తమ సొంత రాష్ట్రం న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా రేసులో ఫ్రంట్ రన్నర్లుగా తమ స్థానాలను పదిలం చేసుకోవడమే కాకుండా పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి మరింత చేరువైనారు.

04/20/2016 - 06:42

కాబూల్, ఏప్రిల్ 19: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశ రాజధాని కాబూల్ నడిబొడ్డున ట్రక్కు బాంబుతో మంగళవారం భీకర దాడికి తెగబడి నరమేథాన్ని సృష్టించారు. ఈ దాడిలో దాదాపు 28 మంది ప్రజలు మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకర పోరాటం మొదలైంది.

04/20/2016 - 06:38

వాషింగ్టన్, ఏప్రిల్ 19: అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రాట్ల తరపున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా అమెరికన్ భారతీయులు ఒక గ్రూపును ప్రారంభించారు. హిల్లరీకి మద్దతుగా జాతీయ స్థాయిలో స్వచ్ఛంద కార్యకర్తల సంస్థగా ఇండియన్ అమెరికన్స్ ఫర్ హిల్లరీ(ఐఏఎఫ్‌హెచ్) పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. వాషింగ్టన్ డీసీ లోని మేరీలాండ్‌లో ఏప్రిల్ 24న సంస్థ లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు.

04/19/2016 - 01:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బ్రిటిష్ పాలకులు కోహినూర్ వజ్రాన్ని మననుంచి బలవంతంగా తీసుకోలేదని, దొంగిలించలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు చెప్పింది. పంజాబ్ పాలకులు ఈ వజ్రాన్ని ఈస్టిండియా కంపనీకి ఇచ్చారని తెలిపింది.

04/19/2016 - 01:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18:ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నియామకంపై కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అమితాబ్‌కు ఇతర దేశాల్లోని షిప్పింగ్ కంపెనీలతో సంబంధం ఉందంటూ పనామా పత్రాల్లో వెల్లడి కావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఆరోపణల నుంచి అమితాబ్ బయట పడే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

04/18/2016 - 07:37

టెహరాన్, ఏప్రిల్ 17: భారత్, ఇరాన్‌ల మధ్య అనుబంధం కొత్త పుంతలు తొక్కబోతోందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంకోసం ఇరాన్ పర్యటనకు వచ్చిన సుష్మా ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవాద్ జరీఫ్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

04/18/2016 - 08:27

మషికి (జపాన్), ఏప్రిల్ 17: కేవలం 24 గంటల వ్యవధి.. రెండు భూకంపాలు.. చూస్తుండగానే ఇళ్లూ, రోడ్లూ, వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి.. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రకంపనలకు భవనాలు పేకమేడల్లా కూలిపోవటం అందరికీ తెలిసిందే.

04/18/2016 - 05:11

క్విటో, ఏప్రిల్ 17: లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ను పెను భూకంపం కుదిపేసింది. దేశ వాయవ్య తీరానికి 27కిలోమీటర్ల దూరంలో భూకంపం మూల కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైన ఈ భూకంప తాకిడికి కనీసం 233మంది దుర్మరణం చెందారు. నాలుగు వందలమందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు, వంతెనలు నేలపట్టమయ్యాయి.

Pages