S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/17/2016 - 20:58

వాషింగ్టన్, ఏప్రిల్ 16: ఇటీవలి వీసా ఫీజు పెంపు విషయంలోతాము చట్టానికి కట్టుబడక తప్పదని అమెరికా ప్రభుత్వం భారత్‌కు స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల హెచ్- 1బి, ఎల్-1 వీసాలకు చెందిన కొన్ని కేటగిరీల వీసా ఫీజులను భారీగా పెంచిన విషయం తెలిసిందే.

04/17/2016 - 02:23

కుమమోటో (జపాన్) ఏప్రిల్ 16: దక్షిణ జపాన్‌లోని సుమమోటో ప్రాం తంలో 24 గంటల్లో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలకు కనీసం 35 మంది చనిపోగా, వందలాది మంది సజీవ సమాధి అయి ఉంటారని భయపడుతున్నారు. శక్తివంతమైన భూప్రకంపనల తాకిడికి వేల టన్నుల బురద మట్టి ఒక్కసారిగా పునాదుల కిందినుంచి కదిలి పోవడంతోవందలాది భవనాలు, రోడ్లు, రైలు మార్గాలు కొట్టుకు పోయాయి.

04/17/2016 - 02:19

వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీల ఆదాయం 2015లో 4 లక్షల డాలర్ల పైగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

04/16/2016 - 12:43

జపాన్ : రెండు రోజులుగా సంభవిస్తున్న వరుస భూ ప్రకంపనలతో జపాన్ చిగురుటాకులా వణుకుతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున మరోసారి పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.6గా నమోదైంది. రెండు రోజుల్లో దాదాపు 30 మంది మరణించగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోగా, భారీ భవనాలు బీటలు వారాయి. రోడ్లపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి.

04/15/2016 - 03:34

వాషింగ్టన్, ఏప్రిల్ 14: వినూత్నమైన ఆలోచనల ద్వారా ప్రపంచ మానవాళికి మరింత మెరుగ్గా సేవ చేయడానికి తోడ్పడిన అమెరికాలోని ఇద్దరు భారతీయ బాల సైంటిస్టులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పొగడ్తలతో ముంచెత్తారు. కాలిఫోర్నియాకు చెందిన మాయా వర్మ, మేరీలాండ్‌కు చెందిన అనరుధ్ గణేశన్ వివిధ సైన్స్ పోటీల్లో విజేతలుగా నిలవడం ద్వారా ఈ ఏడాది జరిగే ఆరవ వైట్‌హౌస్ సైన్స్ ఫెయిర్‌కు అర్హత సాధించారు.

04/15/2016 - 02:11

గరిడేపల్లి, ఏప్రిల్ 14: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పోటు భగత్‌కుమార్ దేశంలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక యూరోపియన్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఎడిటోరియల్ బోర్డులో మెంటర్‌గా ఎంపికయ్యారు.

04/15/2016 - 00:40

వాషింగ్టన్, ఏప్రిల్ 14: హెచ్ 1బి, ఎల్-1 వీసాల ఫీజులను గణనీయంగా పెంచడం వివక్షాపూరితమని, భారత ఐటి కంపెనీలను లక్ష్యంగా చేసుకునే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి, రాయబారి మైకేల్ ఫ్రోమన్‌తో జరిపిన చర్చల సందర్భంగా జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

04/14/2016 - 07:21

న్యూయార్క్, ఏప్రిల్ 13: కీలకమైన న్యూయార్క్ ప్రైమరీకి ఈ నెల 19న ఎన్నికలు జరగనుండగా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ప్రధాన పక్షాల్లో అందరికన్నా ముందున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లకు ఓ తీపి వార్త అందింది. దాదాపు నెల రోజుల క్రితం ఎన్నికలు జరిగిన మిస్సోరి ప్రైమరీ ఎన్నికల్లో ఈ ఇద్దరూ గెలుపొందినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు.

04/14/2016 - 07:20

వాషింగ్టన్, ఏప్రిల్ 13: అమెరికాలో వర్క్‌వీసాల కోసం భారత్ నుంచి అనూహ్యమైన రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏప్రిల్ మొదటి వారంలో కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే హెచ్-1బి వీసాల కోసం 2.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా నైపుణ్యం గల ఉద్యోగార్థులకు 2017 జనరల్ కేటగిరీలో ఇచ్చే వర్క్ వీసాల పరిమితి 65వేలు కాగా..

04/13/2016 - 07:20

వాషింగ్టన్, ఏప్రిల్ 12: అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత రిపబ్లికన్ పార్టీ అనుసరించిన వలసవాద వ్యతిరేక వైఖరి ప్రవాస భారతీయులు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గేలా చేసిందని అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ‘దేశీస్ డివైడెడ్: ది పొలిటికల్ లైవ్స్ ఆఫ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్’ పుస్తక రచయిత సంజయ్ మిశ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.

Pages