S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/13/2016 - 12:21

ఖాట్మండు, ఏప్రిల్ 12: నేపాల్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. 31 మంది గాయపడ్డారు. ఖోతంగ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 300 మీటర్లలోతైన లోయలో పడిపోయింది. బర్ఖేతర్ గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న లోయలోకి పల్టీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 24మంది మృతి చెందారు.

04/12/2016 - 14:14

దిల్లీ: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మంగళవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మధ్యాహ్నం విందు అనంతరం వారు అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కును సందర్శించేందుకు వెళతారు. ఈనెల 16న ఆగ్రా వద్ద తాజ్‌మహల్‌ను విలియం దంపతులు సందర్శిస్తారు.

04/12/2016 - 04:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: కరడుగట్టిన ఉగ్రవాది, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జెఇఎం) అధినేత వౌలానా మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోమవారం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

04/12/2016 - 04:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఉక్రెయిన్‌లో ఇద్దరు భారతీయ మెడికోలు దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు భారతీయ విద్యార్థులపై స్థానికులు కొందరు కత్తులతో దాడి దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. ముజాఫర్‌నగ్‌కు చెందిన ప్రణవ్ శాండిల్య, ఘజియాబాద్‌కు చెందిన అంకుర్ సింగ్ మృతి చెందారని ఆయన తెలిపారు.

04/12/2016 - 04:29

ముంబయి, ఏప్రిల్ 11: దక్షిణ భారత దేశంలోని ప్రసిద్ధ వంటకాల్లో ఒకటైన దోశపై బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ ముచ్చటపడ్డారు. స్వహస్తాలతో దోశలు వేసుకుని వాటిని ఆరగించారు. ముంబయిలో సోమవారం టెక్ రాకెట్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వారు ఈ సరదా తీర్చుకున్నారు.

04/12/2016 - 04:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత్‌పై దాడికి ఐఎస్‌ఐఎస్, కెనడాకు చెందిన సిక్కు మిలిటెంట్ సంస్థ చేతులు కలిపినట్టు తెలిసింది. రెండు సంస్థలూ దేశరాజధాని ఢిల్లీపై పెద్దఎత్తున దాడి చేయాలని వ్యూహరచన చేసినట్టు వెల్లడైంది. సిక్కు మిలిటెంట్ సంస్థ కెనడాలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.

04/11/2016 - 16:27

దిల్లీ: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ సోమవారం ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. పలురంగాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.

04/11/2016 - 16:26

తైవాన్: తైవాన్‌లో సోమవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. రిక్టర్ స్టేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైంది.

04/11/2016 - 07:49

లండన్, ఏప్రిల్ 10: పనామా పత్రాలు యునైటెడ్ కింగ్‌డం ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను మరింతగా ఇరకాటంలో పడేశాయి. ఈ వ్యవహారంలో తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు తన పన్నుల వివరాలను వెల్లడించిన ఆయన మరిన్ని సమస్యల్ని కొనితెచ్చుకున్నట్టయింది. యుకె ప్రధానిగా తన పదవికే ముప్పు తెచ్చే ఈ వివాదం నుంచి బయట పడేందుకు తన ఆదాయం పన్ను రికార్లును ఆయన అనూహ్య రీతిలో విడుదల ఇందుకు కారణమైంది.

04/11/2016 - 07:19

న్యూయార్క్, ఏప్రిల్ 10: ఐక్యరాజ్య సమితి 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు బహిరంగ చర్చల్లో పాల్గొని సభ్య దేశాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.

Pages