S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/06/2016 - 07:59

రిక్‌జావిక్, ఏప్రిల్ 5:పనామా పత్రాల ప్రకంపనలకు తొలి వికెట్ పడింది. లక్షలాది డాలర్ల మొత్తాన్ని అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐస్‌లాండ్ ప్రధాని సిగ్‌ముందర్ డేవిడ్ రాజీనామా చేశారు.

04/06/2016 - 07:57

వాషింగ్టన్, ఏప్రిల్ 5: అమెరికా పాకిస్తాన్‌కు సుమారు 17 కోట్ల డాలర్ల విలువైన తొమ్మిది ఎహెచ్-1జడ్ వైపర్ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించబోతోంది. అమెరికా కాంగ్రెస్‌లోని పలువురు సభ్యులు, భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ పాక్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించడానికి ఒబామా ప్రభుత్వం నిర్ణయించిన కొద్ది వారాలకే ఇప్పుడు ఈ హెలికాప్టర్లను విక్రయంచబోతుండడం గమనార్హం.

04/05/2016 - 02:28

రియాద్, ఏప్రిల్ 4: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సౌదీ అరేబియా తీసుకున్న చర్యలను, ఉగ్రవాద వ్యతిరేక పోరులో 34 ముస్లిం దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చి శక్తివంతమైన ఇస్లామిక్ సైనిక కూటమిని ఏర్పాటు చేసిన తీరును సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.

04/05/2016 - 01:40

ప్యారిస్, ఏప్రిల్ 4: మరో నల్లధన సునామీ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. గతంలో వికీ లీక్స్ సృష్టించిన ప్రకంపనలను మించిన స్థాయిలోనే దేశాధినేతలు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, సెలబ్రిటీల సహా అనేక మందికి నల్లధన మసి అంటిందటూ పనామా పత్రాలు కలకలం రేపుతున్నాయి. తమతమ దేశాల్లో తామే సర్వం అయినా సొంత సొమ్మునే కొల్లగొట్టి పన్నుల ఎగవేత స్వర్గ్ధామాల్లో బూటకపు కంపెనీలు పెట్టారు.

04/04/2016 - 12:33

కరాచీ: పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు రావడంతో 57 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోగా పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరద ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికారులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించారు.

04/03/2016 - 03:07

రియాద్, ఏప్రిల్ 2: చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆ దేశానికి చేరుకున్నారు. భద్రత, ఉగ్రవాదంపై పోరాటం తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు పలు ఒప్పందాలను కుదుర్చుకుని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు నిశ్చయించుకోవడంతో మోదీ తొలిసారి సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు.

04/03/2016 - 03:03

వాషింగ్టన్, ఏప్రిల్ 2: వాషింగ్టన్‌లో జరుగుతున్న అణు భద్రత శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు రక్షణ సహకారం, మేక్ ఇన్ ఇండియా, ఇతర కీలకమైన అంశాలపై చర్చించారు.

04/03/2016 - 02:54

వాషింగ్టన్, ఏప్రిల్ 2: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ప్రధాన కుట్రదారు మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి ఆంక్షల జాబితాలో ఉంచాలన్న తమ దరఖాస్తుపై చైనా సాంకేతిక అభ్యంతరాలను చూపించి అడ్డుకోవడం తమకు తీవ్ర నిరాశ కలిగించినట్లు భారత్ పేర్కొంటూ, ఈ చర్య అసమగ్రమైనదని అభిప్రాయ పడింది.

04/03/2016 - 01:56

వాషింగ్టన్, ఏప్రిల్ 2: అణు భద్రత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అణు స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంతో పాటు అణు ఉగ్రవాదాన్ని తిప్పి కొట్టే టెక్నాలజీని ఏర్పాటు చేయడం లాంటివి ఈ చర్యల్లో ఉన్నాయి. 50కి పైగా దేశాల నేతలు హాజరయిన అణు భద్రతపై జరుగుతున్న శిఖరాగ్ర సమావేశం రెండో రోజయిన శుక్రవారం నాడు మోదీ ఈ ప్రకటన చేశారు.

04/02/2016 - 03:47

యాంగోన్, ఏప్రిల్ 1: ఆంగ్‌సాన్ సూకీని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలన్న ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ వ్యతిరేకమని మయన్మార్ ఎంపీ లు అభ్యంతరం చెప్పడంతో అర్ధ శతాబ్దానికి పైగా సైనిక పాలనలో మగ్గిన దేశంలో దేశంలో జా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు కూడా కాకముందే సైన్యంతో ఘర్షణ మొదలైనట్లయింది.

Pages