S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/29/2016 - 13:04

సైప్రస్: ఈజిఫ్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణీకుల విమానం అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తుండగా మంగళవారం హైజాక్ అయింది. దీన్ని సైప్రస్‌లోని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా కిందకు దింపారని, ఇందులో సుమారు ఎనభై మంది ప్రయాణిస్తున్నారని సమాచారం. దీన్ని ఎవరు హైజాక్ చేశారో, హైజాకర్ల డిమాండ్లు ఏమిటో ఇంకా తెలియరాలేదు.

03/29/2016 - 03:02

లాహోర్, మార్చి 28: ఈస్టర్ పండుగ సందర్భంగా లాహోర్ పార్కులో ఆత్మాహుతి దాడికి తమ పనేనని పాకిస్తాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. క్రైస్తవుల లక్ష్యంగానే తాము దాడికి పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ వెల్లడించింది. ఆదివారం పొద్దుపోయాక జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందినవారి సంఖ్య 72కి చేరుకుంది.

03/28/2016 - 14:21

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని పార్లమెంటు భవనంపై సోమవారం ఉదయం మిలిటెంట్లు వైమానిక దాడులు జరిపారు. దీంతో భవనం ప్రాంగణంలో విపరీతమైన పొగ ఆవరించింది. ఈ భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావల్సిఉంది.

03/28/2016 - 14:20

అల్జీర్స్: అల్జీరియాలో సోమవారం ఉదయం ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలిపోగా 12 మంది సిబ్బంది మరణించారు. ఈ ఉదంతంపై ఆర్మీ అధికారులు విచారణ ప్రారంభించారు.

03/28/2016 - 05:33

ప్యోంగ్‌యాంగ్, మార్చి 27: తమ దేశంపై దాడికి కుట్ర పన్నినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్యున్-హై క్షమాపణ చెప్పకపోయినా, తమ నాయకత్వంపై దాడి చేయడానికి పథకాలు వేస్తున్న వారిని బహిరంగంగా ఉరి తీయక పోయినా దక్షిణ కొరియా అధ్యక్ష భవనంపై మిలిటరీ దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఏటా జరిగే విధంగానే ఇప్పుడు కూడా దక్షిణ కొరియా, అమెరికా సైన్యాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి.

03/28/2016 - 05:26

న్యూయార్క్, మార్చి 27: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికానే తలమానికం అనే రీతిలో విదేశాంగ విధానం చేపడతానని అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వస్తే అనేక విధాలుగా మార్పులు తీసుకొస్తానని వెల్లడించారు. అసలు చైనా ఇంతగా అభివృద్ధి చెందిందంటే అందుకు అమెరికా నుంచి తరలించిన నిధులే కారణమని ట్రంప్ వెల్లడించారు.

03/28/2016 - 05:24

వాషింగ్టన్, మార్చి 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ముందున్న విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (68)కు అలాస్కా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

03/28/2016 - 05:18

వాషింగ్టన్, మార్చి 27: మన పాలపుంతలోనూ, దాని సమీపంలోని రోదసీలోనూ నిబిడీకృతమైన అద్భుతాలకు కొదవలేదు. శోధించే కొద్దీ కొత్త నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మన పాలపుంత సమీపంలో వాయువుతో నిండిన దాదాపు శనిగ్రహ లక్షణాలు కలిగిన ఓ భారీ గ్రహాన్ని ఖగోళవేత్తలు కనిపెట్టారు.

03/28/2016 - 04:54

ఐక్యరాజ్య సమితి, మార్చి 27: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం మానవ హక్కులు, బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించి ఏర్పాటు చేసిన తమ వర్కింగ్ గ్రూపునకు సలహాదారుగా భారతీయుడైన సూర్య దేవను నియమించింది.

Pages