S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/24/2016 - 08:41

ఫోనిక్స్: అమెరికా అధ్యక్ష పదవికోసం ప్రధాన పార్టీలయిన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మిగతా ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు బుధవారం అత్యంత కీలకమైన ఆరిజోనా రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి మరో అడ్డంకిని అధిగమించారు. అయితే ఉటా రాష్ట్రంలో మాత్రం ఆ ఇద్దరూ తమ ప్రధాన ప్రత్యర్థుల చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.

03/24/2016 - 08:34

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం జరిగిన మారణకాండను ప్రపంచ దేశాల నేతలు ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రతిన బూనారు. బెల్జియంకు సంఘీభావం సూచకంగా పారిస్‌లోని ఈఫిల్ టవర్ మొదలుకొని బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ దాకా ప్రపంచ ఫ్రఖ్యాత కట్టడాలన్నిటినీ ఆ దేశ జాతీయ పతాకంలోని నలుపు, పసుపు, ఎరుపు రంగు విద్యుద్దీపాలను వెలిగించారు.

03/24/2016 - 08:32

ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు జీవనాడిగా అభివర్ణిస్తూ, దీనిపై భారత్‌తో దీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తమ దేశం కోరుకుంటోందని చెప్పారు. పాకిస్తాన్ శాంతికాముక దేశమని, ఇతర దేవాలతో ముఖ్యంగా పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలనే తాము కోరుకుంటున్నామని బుధవారం ఇక్కడ పాకిస్తాన్ డే పరేడ్‌నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన చెప్పారు.

03/24/2016 - 08:29

ఐక్యరాజ్య సమితి: ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో నవజాత శిశువులపై ప్రభావం చూపిస్తున్న ప్రాణాంతకమైన జికా వైరస్‌పై పోరాడే వ్యాక్సీన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులు కొనసాగుతున్న అయిదు దేశాల్లో భారత్ కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్ చెప్పారు.

03/23/2016 - 14:14

బ్రస్సెల్స్‌: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ విమానాశ్రయంలో దాడులకు పాల్పడిన వారిలో ఇద్దరు సోదరులు ఉన్నారని తెలుస్తోంది.ఖలీద్‌, బ్రహిమ్‌ ఇల్‌ బక్రోయి అనే ఇద్దరు సోదరులు ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని, మూడో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని మీడియా తెలిపింది. ముగ్గురు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఇందులో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

03/23/2016 - 06:43

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ మంగళవారం ఉదయం వరస బాంబుదాడులతో దద్దరిల్లింది. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో జంట బాంబు పేలుళ్ల తర్వాత నగరంలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో కనీసం 34 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఐరోపా దేశాలను టార్గెట్‌గా చేసుకుని జరిపిన ఈ తాజా దాడితో ఐరోపా దేశాలన్నిటిలోను భద్రతను కట్టుదిట్టం చేశారు.

03/22/2016 - 18:00

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం ఎయిర్ పోర్టు, మెట్రో రైల్వే స్టేషన్‌లో వరుస బాంబు పేలుళ్లలో కనీసం 26 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ పోర్టులో రెండుసార్లు బాంబులు పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగానే ఉందని వారు తెలిపారు. ఇది ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని బెల్జియం పోలీసులు అనుమానిస్తున్నారు.

03/22/2016 - 15:53

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలోని ఎయిర్ పోర్టు, మెట్రో రైల్వేస్టేషన్లలో వరుస బాంబు పేలుళ్లతో విధ్వంసం నెలకొంది. పేలుళ్ల ధాటికి పలువురు మరణించారని, చాలామంది గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. అన్ని మెట్రో స్టేషన్లను, ఎయిర్‌పోర్టును, సిటీ మ్యూజియంను వెంటనే మూసివేశారు. ఈ ఘటనలో భారతీయులెవరూ మరణించలేదని అక్కడి భారత రాయబార కార్యాలయం సిబ్బంది తెలిపారు.

03/21/2016 - 07:05

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ నుంచి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల చికాగోలో ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన ఆందోళనకారులు తాజాగా న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించడంతో పాటు అరిజోనా రాష్ట్ర నైరుతి ప్రాంతంలోని ఒక ప్రధాన రహదారిని దిగ్బంధించి ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

03/21/2016 - 07:02

దుబాయి: రష్యాలో శనివారం కూలిపోయిన తమ విమానంలో ఉన్న మొత్తం 62 మంది ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి 20 వేల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఫ్లై దుబాయి ఎయిర్‌లైన్స్ ఆదివారం ప్రకటించింది.

Pages