S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/03/2016 - 04:05

టొరంటో: ఓపక్క గ్రహాంతర జీవుల గురించి ఖగోళవేత్తలు అహర్నిశలు అధ్యయనం చేస్తూ, వాటి ఉనికిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ గ్రహాంతర జీవులే భూగోళాన్ని అన్ని విధాలుగా ఆవాసయోగ్యమైనదిగా ఇప్పటికే గుర్తించాయని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

03/02/2016 - 23:59

పడాంగ్: ఇండోనేసియాలోని సుమత్రా దీవిని బుధవారం పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం సునామీ హెచ్చరికలకూ దారితీయడంతో ప్రజలు బెంబేలెత్తి పోయారు. ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత దృష్ట్యా సునామీ సంభవించే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరించిన అధికారులు కొన్ని గంటల తర్వాత వాటిని ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

03/02/2016 - 07:44

బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాను కాదని అమెరికాతో చేతులు కలిపితే భారత్‌కు కష్టమేనని ఆ దేశ అధికార పత్రిక మంగళవారం వ్యాఖ్యానించింది. ఆర్థిక వృద్ధి ‘బ్రిక్స్’ సదస్సు విజయవంతం కావడానికి భారత్‌కు చైనా సాయం అవసరమని చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. ‘్భరత ప్రభుత్వం ఒక వాస్తవ దృక్పథంతో కూడిన దౌత్య విధానాన్ని పాటిస్తోంది.

03/02/2016 - 07:43

వాషింగ్టన్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు జరుపుతున్న పాక్ దర్యాప్తు బృందం త్వరలోనే భారత్ సందర్శించవచ్చని ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు అయిన సర్తాజ్ అజీజ్ చెప్పారు. అంతేకాదు, భారత్-పాకిస్తాన్‌ల మధ్య విదేశీ కార్యదర్శుల స్థాయి చర్చలు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయన్న ఆశాభావాన్ని సైతం ఆయన వ్యక్తం చేశారు.

03/02/2016 - 07:37

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికోసం జరుగుతున్న ప్రచారంలో అందరికన్నా ముందు వరసలో ఉన్న డొనాల్ట్ ట్రంప్ జాతిపిత మహాత్మాగాంధీ చేసినవిగా చెబుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరదీశాయి.

03/01/2016 - 07:59

ఉత్తమనటుడు డికాప్రియో ఉత్తమనటి బ్రీ లార్సన్ ఉత్తమ చిత్రం స్పాట్‌లైట్ అట్టహాసంగా ఆస్కార్ పురస్కారాల ప్రదానం

02/29/2016 - 08:03

కొలంబియా: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ సౌత్ కరోలినా రాష్ట్రం ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి బెర్నీ సాండర్స్‌ను చిత్తుగా ఓడించారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ ప్రదర్శనకు ముందే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆమె రేసులో ముందున్నారు.

02/29/2016 - 08:03

కొలంబియా: భారత్ అమెరికా ప్రజల ఉద్యోగాలను తన్నుకుపోతోందని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే తిరిగి ఆ ఉద్యోగాలను వెనక్కి తీసుకొస్తానని ఆయన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికాలో ‘సూపర్ ట్యూజ్‌డే’కు ముందే ‘ట్రంప్ మానియా’ కనపడుతోంది.

02/28/2016 - 05:46

బెల్‌ఫెయిర్ (అమెరికా): తుపాకీ సంస్కృతిని అణువణువునా జీర్ణించుకున్న అమెరికాలో మరో ఘోరం జరిగింది. రూరల్ వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక సాయుధుడు ఇంటిలో కాల్పులు జరిపి నలుగురిని హత్య చేశాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో తనను తాను కాల్చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

02/28/2016 - 05:44

వాషింగ్టన్: సిరియాలో నరమేథం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై పోరాటాన్ని సాగించడం ‘కష్టతరం’గా ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. అయినప్పటికీ అత్యంత కరడుగట్టిన ఆ ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని, ఇందుకోసం సిరియాలో కొనసాగుతున్న సంఘర్షణకు తెరదించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ‘ఐసిస్ ఉగ్రవాదులపై పోరాటాన్ని సాగించడం కష్టతరంగా ఉంది.

Pages