S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/30/2016 - 06:47

లాస్ ఏంజిల్స్, జనవరి 29: భూమి ఒక గ్రహంగా ఏర్పడిన దాదాపు పది కోట్ల సంవత్సరాల తర్వాత భూమి, అప్పటికి ఇంకా ఒక పిండ రూపంలోనే ఉన్న ‘్థయా’ అనే మరో గ్రహం పరస్పరం ఎదురెదురుగా ఢీకొనడం కారణంగా చంద్రుడు ఏర్పడినట్లు తాజాగా జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది.

01/30/2016 - 02:00

ఆస్ట్రేలియాలో శుక్రవారం భారత క్రీడాకారులు కదం తొక్కారు. ఒకే రోజు ఏకంగా మూడు అద్భుత విజయాలతో సరికొత్త అధ్యాయం సృష్టించారు. మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టుతో మొదలైన ఈ విజయాల పరంపర చివరకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ‘మెన్ ఇన్ బ్లూ’తో ముగిసింది.

01/28/2016 - 07:28

వాషింగ్టన్, జనవరి 27: భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికా అంతటా ఘనంగా జరిగాయి. రాజధాని వాషింగ్టన్‌లోని ఎంబసీ వద్ద భారత రాయబారి అరుణ్ కె సింగ్ త్రివర్ణ పతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖ ఇండో అమెరికన్లు హాజరయ్యారు. నగరమంతా మంచుదుప్పటి పరచుకున్నా రిపబ్లిక్‌డే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

01/27/2016 - 03:01

బ్యాంకాక్/అడిలైడ్, జనవరి 26: ప్రపంచవ్యాప్తంగా భారత దౌత్య కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ముఖ్యంగా బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనీ, మయన్మార్, లావోస్, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

01/26/2016 - 00:27

ఇస్లామాబాద్, జనవరి 25: ఉగ్రవాద నిరోధన ఉత్తుత్తి మాటేనన్న తన ధోరణిని పాకిస్తాన్ మరోసారి రుజువు చేసుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడి కుట్రదారుల్ని వదిలేది లేదని మొదట్లోచెప్పిన పాక్ ఇప్పుడు మాటమార్చింది. ఈ దాడికి కుట్రదారులుగా భావిస్తున్న జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్, ఇతర అనుమానితుల్ని ఉమ్మడిగా ప్రశ్నించాలన్న భారత ప్రతిపాదనను తిరస్కరించింది.

01/25/2016 - 01:34

వాషింగ్టన్, జనవరి 24: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి భారత దేశం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముప్పునకు మరో ఉదాహరణ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. పాకిస్తాన్ తన భూభాగంనుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లన్నింటినీ సమూలంగా నిర్మూలించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.

01/25/2016 - 01:33

వాషింగ్టన్ / న్యూయార్క్, జనవరి 24: హిమపాతం గుప్పిట అమెరికా గజగజలాడిపోతోంది. దాదాపు తూర్పుతీర ప్రాంతమంతా ప్రచండ గాలులతో పాటు రికార్డు స్థాయిలో కురిసిన హిమపాతంతో అతలాకుతలమైపోయింది. ఈ సంఘటనల్లో 18మంది మరణించారు. లక్షలాదిమంది అమెరికన్లు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గత రెండు రోజులుగా ఈ హిమపాత పరిస్థితి అమెరికా ప్రభుత్వాన్ని అయోమయంలో పడేసింది.

01/25/2016 - 01:32

మనామా, జనవరి 24: మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరుచేయాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉద్ఘాటించారు. ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించేవారు చివరికి వాటికే బలి అవుతారని ఆమె హెచ్చరిస్తూ, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్, అరబ్ దేశాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు.

01/25/2016 - 01:30

వాషింగ్టన్, జనవరి 24: దక్షిణ అలాస్కాలో ఆదివారం గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఉదయం పదిన్నర గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 7.1 పాయింట్ల తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు సంభవించిన ఈ భూకంపం కేంద్రం పాత ఇలియామ్నాకు తూర్పుగా 83 కిలోమీటర్ల దూరంలో ఉందని అమెరికా జియాలజికల్ సర్వే తెలియజేసింది. భూమిలోపల 127 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని అది తెలిపింది.

01/24/2016 - 01:14

ఒటావా, జనవరి 23: కెనడా పశ్చిమ ప్రాంతంలోని ఒక పాఠశాల ఆదివారం కాల్పుల మోతతో దద్ధరిల్లింది. ఆగంతకుడు జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. కెనడాలో ఇటువంటి కాల్పులు జరగడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ దారుణంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ త్రుదెయు అన్నారు.

Pages