S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

07/08/2019 - 01:07

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదయింది. అంతకు ముందు రోజే సంభవించిన భారీ భూకంపంతో అతలాకుతలమయిన ప్రజలను ఈ తాజా భూకంపం మరింత దెబ్బతీసింది. సహాయక సిబ్బంది, భద్రతా బలగాలు శనివారం తెల్లవారు జామున భూకంప కేంద్రం ఉన్న ప్రాంతానికి వెళ్లాయి.

07/05/2019 - 01:21

లాహోర్, జూలై 4: ముంబయి దాడులకు సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌పై ఉచ్చుబిగుసుకుంటోంది. హఫీజ్‌తోపాటు 12 మంది అతడి అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు బలవంతపువసూళ్లు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డ సరుూ ద్, అతడి అనుచరులపై పాకిస్తాన్ అధికారులు కేసు నమోదు చేసిన మర్నాడే పంజాబ్ పోలీసులు ఈ ప్రకటన చేయడం గమనార్హం.

07/05/2019 - 01:17

న్యూయార్క్, జూలై 4: ‘మీలో ఎవరైనా గంటల తరబడి కూర్చొని టీవీ చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీకు హృద్రోగ సంబంధ వ్యాధులు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం పొంచి ఉంది’. ఉద్యోగంలో ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్న వారి కన్నా గంటల తరబడి అదే పనిగా టీవీ చూస్తున్న వారిలోనే గుండె సంబంధ వ్యాధులు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది.

07/04/2019 - 03:49

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై దాడి చేసిన సంఘటనలో స్థానిక కోర్టు 9 మందికి మరణ శిక్ష విధించింది. అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న షేక్ హసీనాపై 25 ఏళ్ల క్రితం జరిగిన దాడి కేసులో బుధవారం తీర్పు వెలువడింది. 1994 సెప్టెంబర్ 23న ఆమె ప్రయాణిస్తున్న రైలు బోగిపై కొంతమంది దాడి చేశారు. ఈ సంఘటనలో ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

07/04/2019 - 04:47

లండన్: తనపై ఉన్నవన్నీ అక్రమ కేసులేనని లిక్కర్ కింగ్ విజయ్ మాల్య అన్నారు. భారత్‌లో సుమారు 9 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి, లండన్ పారిపోయిన మాల్యను తమ కు అప్పగించాలని భారత ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నది. దీనిపై బ్రిటీషు కోర్టు స్పందిస్తూ మాల్య భారత్‌కు వెళ్ళాల్సిందేనని తీర్పునిచ్చింది.

07/03/2019 - 23:14

జెరూసలెం, జూలై 3: జెరూసలెంలోని ఒక లిక్కర్ కంపెనీ బాటిళ్లపై పూజ్య బాపూ జీ మహాత్మా గాంధీ బొమ్మను ముద్రించడం వివాదాస్పదం కావడంతో ఎట్టకేలకు యాజమాన్యం దిగివచ్చింది. మద్యం బాటిళ్లపై గాంధీ బొమ్మ ముద్రించడం తప్పేనని ఒప్పుకుని ఇందుకు భారత్‌కు క్షమాపణలు చెప్పింది.

07/03/2019 - 23:23

వాషింగ్టన్/ఇస్లామాబాద్, జూలై 3: పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఉగ్రవాద సంస్ధేనని అమెరికా ప్రకటించింది. ఇటీవల గ్వాదర్ పోర్టు సిటీలో ఐదు నక్షత్రాల హోటల్‌పై బీఎల్‌ఏ దాడి చేసిన సంగతి తెలిసిందే. 2006 సంవత్సరంలో పాకిస్థాన్ ప్రభుత్వం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని నిషేధించింది. బిఎల్‌ఏను నిషేధించాల్సిందిగా పాక్ ప్రభుత్వం ఇదివరకే అమెరికాను కోరింది.

07/03/2019 - 22:39

చిత్రం...ఇటీవలే మరమ్మతులను పూర్తి చేసుకున్న హేగ్‌లోని డచ్ రాజకుటుంబం అధికార నివాసం హూరుూస్ టెన్ బోచ్

07/03/2019 - 22:33

చిత్రం...బీజింగ్‌లోని లేట్ ఆల్ ఆఫ్ పీపుల్‌లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బల్గేరియా అధ్యక్షుడు రూమెన్ రడేవ్, ఇతర ఉన్నత అధికారులు

07/03/2019 - 22:31

దుబాయ్, జూలై 3: ఆవిష్కరణలకు అతి పెద్ద కేంద్రంగా ఆవిర్భవించేందుకు దుబాయ్ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఇందుకు అనుగుణంగా భారత్‌లోని పారిశ్రామికవేత్తల వైపు ఇపుడు దృష్టి సారిస్తోంది. ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు తమ దేశంలో స్టార్టప్‌లు ప్రారంభించాలని కోరింది.

Pages