S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/05/2019 - 22:23

వాషింగ్టన్, జూన్ 5: సౌదీ అరేబియాకు అణు సాంకేతిక సహకారాన్ని అందించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్య తరువాత అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెమోక్రటిక్ సెనేటర్ ఒకరు వెల్లడించారు. 2017 తరువాత అమెరికా తీసుకున్న రెండో కీలక నిర్ణయం ఇది. విదేశీ వ్యవహారాల విభాగం కమిటీ సభ్యుడు టిమ్ కైనే స్పష్టం చేశారు.

06/05/2019 - 03:32

లండన్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఆహ్వానం పలుకుతున్న బ్రిటన్ ప్రధాని థెరిసా మే, ఆమె భర్త పిలిప్. సెంట్రల్ లండన్‌లోని టెన్‌డౌన్ స్ట్రీట్ వెలుపలి దృశ్యం ఇది.

06/05/2019 - 03:26

న్యూయార్క్, జూన్ 4: అభం-శుభం తెలియని ఓ తొమ్మిదేళ్ళ చిన్నారి గొంతు నులిమి చంపేసిన ఓ భారతీయ మహిళకు అమెరికా కోర్టు 22 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించింది. బాత్‌రూంలోని బాత్ టబ్‌లో ఆ మహిళ సవతి బిడ్డ గొంతు నులిమి హత్య చేసిన నేరాన్ని తాము ఊహించలేకపోతున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. అత్యంత హృదయవిదారకరమైన ఈ ఘటనతో చలించిన న్యాయమూర్తి ఆ కిరాతక సవతి తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష విధించారు.

06/02/2019 - 23:14

లండన్: యోగా సాధనతో కండరాలు మరింత బలపడడంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. పెద్దవారిలో యోగా సాధనతో జరిగే పరిణామాలపై ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అధ్యయనాల్లో ఈ విషయం తేటతెల్లమైంది. యోగా చేసిన వారికి చేయని వారిలో కలిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించారు.

06/02/2019 - 22:33

వాషింగ్టన్, జూన్ 2: అమెరికాలో విద్య, ఉద్యోగం కోసం యువత ఎంతగానో అర్రులు చాస్తుంది. అయితే, ఇపుడు అగ్రరాజ్యం వీసా పొందాలనుకుంటే అంత ఈజీ కాదు. అమెరికా వీసా పొందాలనుకునేవారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఆశనిపాతం లాంటిదే. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు ఎవరైనా అక్కడ కొత్తగా రూపొందించిన కఠిన నిబంధనలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందే.

06/02/2019 - 22:33

లండన్, జూన్ 2: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రెగ్జిట్) ఒప్పందంలోని పలు అంశాలకు వ్యతిరేకంగా బ్రిటన్ ముందుకు సాగాలని, ఒప్పందంలో భాగంగా అంగీకరించిన 39 బిలియన్ పౌండ్లు (45 బిలియన్ యూరోలు, 50 బిలియన్ డాలర్లు) చెల్లించడానికి నిరాకరించాలని ఆ దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.

06/02/2019 - 22:28

ఇస్లామాబాద్, జూన్ 2: ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథులకు ఘోర అవమానం ఎదురైంది. మితిమీరిన భద్రత పేరిట పాకిస్తాన్ సెక్యూరిటీ అధికారులు చేసిన నిర్వాకం వల్ల ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథులు ఇబ్బందులు పడడంతోపాటు మరికొంతమంది మధ్యలోనే వెళ్లిపోయారు.

06/02/2019 - 22:26

కొలంబో, జూన్ 2: లంక అధ్యక్షుడు సిరిసేనపై సస్పెండైన పోలీస్ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈస్టర్ వేడుకల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 258 మరణించడానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనదే పూర్తి బాధ్యత అని సుప్రీంకోర్టుకు సమర్పించిన 20 పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య సమాచార పరంగా తీవ్రమైన గ్యాప్ ఉందని ఐజీ పుజిత్ జయసుందర పేర్కొన్నారు.

06/02/2019 - 03:25

వాషింగ్టన్, జూన్ 1: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వర్జీనియా బీచ్‌లో గల ఒక ప్రభుత్వ భవన సముదాయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

06/02/2019 - 03:21

వాషింగ్టన్, జూన్ 1: భారత్‌కు అభివృద్ధి చెందుతున్న దేశంగా కల్పిస్తున్న ప్రయోజనాలను అమెరికా ఉపసంహరించుకుంది. భారత్‌కు అభివృద్ధి చెందుతున్న లబ్ధిదారుగా ఇచ్చిన హోదాను జూన్ అయిదో తేదీ నుంచి ఉపసంహరించుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

Pages