S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

11/06/2018 - 01:33

సోమవారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో
సమావేశమైన దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జోంగ్- సూక్

11/06/2018 - 01:31

వాషింగ్టన్, నవంబర్ 5: వివాదాస్పద వలస విధానాలతో సంచలనం సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడికి ఆయన నిర్ణయాలు ఈ మధ్యంతర ఎన్నికల్లో విజయం చేకూరుస్తాయా? లేక ఆయన పాలనా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికల్లో 12మంది వరకు ఇండియన్ అమెరికన్లు పోటీలో ఉన్నారు.

11/06/2018 - 01:30

కొలంబో, నవంబర్ 5: పార్లమెంట్ విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తే ప్రధాని అవుతాడని, మహీంద్ర రాజపక్సే ఇక్కడ విశ్వాస పరీక్షలో విజయం సాధించే వరకు అతడిని ప్రధానిగా గుర్తించనని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్య స్పష్టం చేశారు.

11/06/2018 - 01:30

దుబాయ్, నవంబర్ 5: ఆసియా ఖండానికి చెందిన దంపతులు దుబాయ్‌లోని ఓ దుకాణంలో విలువైన వజ్రాన్ని అపహరించి దేశం విడిచి పారిపోతుండగా అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పోలీసులకు భారత్‌లో పట్టుబడ్డారు. నాటకీయంగా చోటుచేసుకున్న ఈ పరిణామాల్లో చోరీకి గురైన వజ్రం విలువ 300,00 దిర్హామ్‌లు ( 81వేల అమెరికన్ డాలర్లు).

11/06/2018 - 00:41

వాషింగ్టన్, నవంబర్ 5: ఇరాన్‌కు కష్టకాలం ప్రారంభమైంది. న్యూక్లియర్ ఒప్పందం నుంచి తొలగించిన తర్వాత ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. అయితే భారత్, చైనా, జపాన్ సహా ఎనిమిది దేశాలకు ఈ ఆంక్షలు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.

11/04/2018 - 23:31

హరారే, నవంబర్ 4: భారతదేశం సంస్కృతి, ప్రాచీన నాగరికతలో యోగా భాగమని ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ ఇండియన్ ఎంబసీ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో యోగా సెంటర్‌ను నిర్మిస్తారు. ఆఫ్రికాఖండంలో మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు శుక్రవారం చేరుకున్నారు.

11/04/2018 - 23:21

లీమాఖోంగ్ (మణిపూర్) నవంబర్ 4: వేర్పాటు సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉండటం, వారి డిమాండ్లు విభిన్నమైనవి కావడం వల్ల మణిపూర్ రాష్ట్రంలో ఈ సమస్యను త్వరగా పరిష్కరించడం అంత సులభం కాదని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.

11/03/2018 - 23:23

ఐక్యరాజ్యసమితి, నవంబర్ 3: మానవ హక్కుల అంశాలు రాజకీయంగా మారాయని, ఇది మంచి పరిణామం కాదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస మానవ హక్కుల మండలి పనితీరు సంక్లిష్టంగా మారిందని భారత్ పేర్కొంది. విదేశాంగ విధానంలో మానవ హక్కులను రాజకీయ కోణంగా చూడడం సరికాదని భారత్ ఉప శాశ్వత ప్రతినిధి తన్మయ లాల్ అన్నారు. మానవ హక్కుల మండలి ఎన్నో తీర్మానాలు చేస్తోందన్నారు. ఈ నిర్ణయాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.

11/04/2018 - 05:05

వాషింగ్టన్, నవంబర్ 3: అమెరికా విధించిన ఆంక్షలు నవంబర్ 5వ తేదీ నుంచి ఇరాన్‌ను భారీగా దెబ్బతీస్తాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌లోని ‘దుష్ట ప్రభుత్వాని’కి వ్యతిరేకంగా ఇంత కఠినమయిన ఆంక్షలు ఇదివరకెప్పుడూ విధించలేదని ఆయన పేర్కొన్నారు.

11/03/2018 - 23:16

వాషింగ్టన్, నవంబర్ 3: తనపై జరిగిన లైంగిక దాడిపై మాజీ సంపాదకుడు ఎంజే అక్బర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నార నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్‌పీఆర్) ఎడిటర్ పల్లవి గొగోయ్ ఆరోపించారు. ఎంజే అక్బర్ వల్ల తనకు జరిగిన అన్యాయంపై వాషింగ్టన్ పోస్టులో చెప్పినవన్నీ వాస్తవాలేనని, వాటికి తాను కట్టుబడి ఉన్నానని శనివారం ఆమె స్పష్టం చేశారు.

Pages