S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/26/2019 - 01:33

వాషింగ్టన్, జనవరి 25: అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతుండటంతో దేశంలో ప్రతిష్టంభన రోజురోజుకు పెరిగిపోతోంది. అధికార, విపక్షాలు దీనిపై పట్టుబడుతూ ఎవరూ మెట్టుదిగకపోవడంతో కనుచూపుమేర పరిష్కారం కన్పించడం లేదు.

01/25/2019 - 22:59

వాషింగ్టన్ , జనవరి 25: తమ దేశ విస్కీపై భారత్‌తో అత్యధికంగా 150 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్‌సన్‌లను భారత్‌కు ఎగుమతి చేసిన సందర్భంగా తాను రెండు నిమిషాలపాటు సంబంధిత అధికారులతో మాట్లాడి, సుంకంలో ఊరట కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

01/25/2019 - 01:53

దావోస్, జనవరి 24: వ్యక్తిగత గోప్యత అన్నది మానవహక్కుగా ఉంటున్న నేపథ్యంలో ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏ 1)ను మనం పూర్తి స్థాయిలో ఉపకరించే ముందు దానికి కొన్ని నియమాలను ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల చెప్పారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన చర్యలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

01/25/2019 - 01:42

ఐరాస, జనవరి 24: కరవు కాటకాలను ఎదుర్కోవడంతో భారతదేశం అత్యంత ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్య సమితి సదస్సు స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతికూల ధోరణులను ఎదుర్కొనేందుకు భారతదేశం తీసుకుంటున్న చర్యలను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని హితవుపలికింది.

01/25/2019 - 01:39

దావోస్, జనవరి 24: వాతావరణంలో సంభవించే తీవ్రమార్పుల కారణంగా ప్రపంచానికి ఏర్పడే ముప్పును ఎదుర్కోవడంలో సంయుక్తంగా పోరాడే విషయంలో వివిధ దేశనేతల్లో చిత్తశుద్ధి తగ్గుతూ వస్తోందని, చాలామంది దీనిపై అనాసక్తిగా ఉన్నారని, ఇది ప్రమాదకర ధోరణి అని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియా గుటెర్సస్ హెచ్చరించారు.

01/24/2019 - 04:08

కరాచీ కోర్టుకు బుధవారం హాజరైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ. కోట్లాది డాలర్లు విలువ చేసే
మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న జర్దారీకి, మరో ముద్దాయిగా ఉన్న ఆయన సోదరికి
కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది.

01/24/2019 - 04:00

బీరుట్, జనవరి 23: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉన్న ఒక గ్రామాన్ని ఎస్‌డిఎఫ్ నేతృత్వంలోని ఖుర్దీష్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం కాలిపట్‌లోని సరిహద్దును దాటిన ఈ దళాలు ఐఎస్ ఆధీనంలో ఉన్న అతి ముఖ్యమైన రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

01/23/2019 - 02:12

లండన్, జనవరి 22: ఈవీఎంలను హ్యాకింగ్ చేసి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని లండన్‌లో భారత సైబర్ నిపుణుడు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రజాస్వామ్య మనుగడకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మంగళవారం డిమాండ్ చేశారు.

01/23/2019 - 02:10

కరాచీ, జనవరి 22: పాకిస్తాన్‌లోని బలూచీస్తాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆయుల్ ట్యాంకర్, ప్రయాణికుల బస్సును ఢీకొన్న దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. లాస్‌బెలా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 40 మంది ప్యాసింజర్లతో బస్సు కరాచీ నుంచి పంజ్‌గూర్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆయుల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్‌లో మంటలు లేచాయి.

01/22/2019 - 02:44

వాషింగ్టన్, జనవరి 21: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన రెండేళ్ల కాలంలో డొనాల్డ్ ట్రంప్ చారిత్రక ఫలితాలు సాధించారని వైట్‌హౌస్ ప్రకటించింది. జనవరి 20 నాటికి ట్రంప్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలను వివరించింది.

Pages