S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/01/2018 - 20:46

వానకు తడవని వారు వేమన పద్యం విననివారు ఎవరూ ఉండరు. లోకంలో ఉన్నవారందరి గురించి చిన్న చిన్న పద్యాల్లో ఆటవెలదుల్లో తేటగీతుల్లో విడమర్చి చెప్పినవాడు వేమన. వేమన మీద ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. అల్పపదాలతో అనల్పమైన భావనను కూర్చి చెప్పాడు. వేమన ముందు కాలంలో మహాభోగిగా ఉన్నాడు. తర్వాతి కాలంలో యోగిగా మారాడు. దేశ సంచారిగా ప్రజలకు దగ్గరయ్యాడు. వారి స్థితిగతులను తెలుసుకొన్నాడు.

01/31/2018 - 21:13

ప్రతిరోజు భగవంతుడు గురించి, ఆయన లీలలు, మహిమలు, భగవత్త్వం గురించి, ఆధ్యాత్మికానికి సంబంధించి అనేక విషయాల్ని ప్రతిరోజు పాఠకులకు అందించాలనే ఆలోచన రావడం దైవ నిర్ణయం. దైవ ప్రసాదమే. ఏది జరిగినా ఇంకేం జరుగుతున్నా, ప్రతిదీ దైవ నిర్ణయం అని అనుకోవడం, అనుకోగల్గడం ప్రసాదాలన్నింటిలో మహాప్రసాదం.

01/28/2018 - 21:01

ఎవరైనా చాలా కష్టాలు పడుతుంటే సీతమ్మ తల్లిలాగా కష్టాలు పడుతున్నారు అంటారు. సీతమ్మ రాముని భార్య. దశరథుని కోడలు. అయోధ్య మహానగారనికి మహారాణి. జనకుని ముద్దుల కూతురు. కాలు కిందపెడితే కంది పోతుందేమో అన్నంత అపురూపంగా గారాబంగా జనకుడు సీతమ్మను పెంచాడు. కోరి పరాక్రమ వంతుడు దశరథుని ప్రాణసమానుడు అయన శ్రీరాముని పిలిచి శివధనుస్సును ఎక్కు పెట్టడం అన్న పరీక్ష పెట్టి మరీ అల్లుడిని చేసుకొన్నాడు.

01/22/2018 - 23:50

శ్రీపంచమి సందర్భంగా ..
*
సరస్వతీ నమస్త్భ్యుం వందే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
మాఘ శుద్ధ పంచమిని శ్రీపంచమి, సరస్వతి జయంతి, మదన పంచమి, వసంత పంచమి అంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. శాస్త్రం, విజ్ఞానం, చదువు, కళలు, సృజనాత్మకత, వాక్కులకు సంకేతంగా సరస్వతిని పూజిస్తాము.

01/22/2018 - 23:48

విష్ణువు కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, అతిథి కశ్యపుల కొడుకు సూర్యుడు. సూర్యుణ్ణే ఆదిత్యుడు అంటారు. కశ్యప మహర్షికి అదితి- దితి ఇద్దరు భార్యలు. అదితికి దేవతలు, దితికి దైత్యులు జన్మించారు. అధికారం కోసం ఇరువురి మధ్య వైరం వచ్చింది. దేవతలకు ప్రాణ సంకటం వచ్చింది. ఇది గమనించి అదితి కశ్యపులు సూర్యశక్తిని ఉపాసించారు. సూర్యుడు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమన్నాడు.

01/14/2018 - 18:50

భారతీయులు జరుపుకొనే పండుగలలో ముఖ్యమైనది.. పెద్దపండుగగా చెప్పు కునేది ‘సంక్రాంతి’ ఇదే ‘పెద్దల పండుగ’ కూడా...
పెద్దలను స్మరించుకొని, వారికి తర్పణములు, పిండ ప్రదానములు జరిపే రోజు సంక్రాంతి. సం, క్రాంతి- అను రెండు సంస్కృత పదముల కలయికతో ఏర్పడేది సంక్రాంతి. ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే పరివర్తనము. మనిషిలో మంచి పరివర్తనము కలిగించడమే ‘సంక్రాంతి’ పరమార్థము.

01/07/2018 - 22:58

కలియుగములో పాండ్య మండలము నందలి శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ భట్టనాథులు పష్పోద్యానమున తులసీవనమును పెంచుటకై భూమిని తవ్వునప్పుడు భూదేవి చిన్న శిశువుగా ఆవిర్భవించింది. ఆ శిశువును చూచిన నిస్సంతువగు భట్టనాథులు ఆమె భగవానుడు తనకు ప్రసాదించిన సంతానముగా భావించి ఆమెకు ‘‘కోదై’’ అని పేరు పెట్టాడు.

12/31/2017 - 20:57

ప్రకృతిలో భాగమైన మానవుడు తన జీవన పథం కూడా ప్రకృతికి అనుగుణంగా ఉంటాలనే కృతజతాభావనతో ఉంటాడు. మానవుని ఉనికిని ఒక పవిత్ర అంశంగా ఈ పుడమిపై స్థిరపరిచినాడు. సృష్టి, స్థితి,లయమనే అపూర్వ విషయాలను తన ఏకాగ్రచిత్తంతో అనంతమైన మనో ప్రపంచంలో శోధించి సాధించారు మన ఋషులు. హిందూ ధర్మం సర్వజనీనము, మానవ శ్రేయస్సుకు మూలం ఒక్క సనాతన ధర్మమే. ప్రకృతి నుండి మానవుని ఆవిర్భావ మనే విశ్వాసమే బహు దేవతారాధనకు దారితీసింది.

12/24/2017 - 23:53

పరాశరభట్టరు అను భాగతోత్తముడు ‘‘నీళాదేవి వక్షస్థలముపై పరున్న శ్రీకృష్ణుని లేపి, వేదములందు చెప్పబడిన అతని మహత్త్వమును చెప్పి ఆత్మ పరతంత్ర భావన బోధించి , తాను ధరించి విడిచినపూల మాలలో బంధించి పారవశ్యము చెందిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరిస్తున్నాను’’ అని చెప్పిన శ్లోకాన్ని చదివి గోదాదేవి రచించి పాడిన తిరుప్పావై రచించిన పాశురాలను అనుసంధానిస్తూ నేటి జనులు గోదాదేవి రంగనాథులను పూజిస్తారు.

12/17/2017 - 22:54

దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్చిదే వనే్ద॥

Pages