S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/22/2019 - 18:55

‘మఠం’ అంటే నిత్యపూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, స్తోత్ర పారాయణలు కాదు.. మానవసేవలో తరించాలన్నదే ఆయన ఆకాంక్ష. మతం, కులం, రాజకీయాలకు అతీతంగా మానవత్వం మూర్త్భీవించిన పరిపూర్ణ వ్యక్తిగా ఆయన జనం గుండెల్లో నిలిచారు. ‘కాయక’ (శారీరక శ్రమ), ‘దాసోహ’ (సమర్పణా భావం) అనే రెండు సద్గుణాలను ఆచరించి ఆయన తన జీవితాన్ని పునీతం చేసుకున్నారు.

01/21/2019 - 18:54

‘‘కుండను చూస్తున్న వ్యక్తి తాను కుండకన్నా వేరుగా భావించినట్లే శరీరాన్ని చూసి దానికన్నా నేను వేరు అనే భావన కలిగి ఉండాలి’’ అని తత్వవేత్త అష్టావక్రుడు చెప్పాడు. ఇదే సత్యాన్ని వశిష్ఠుడు తన విశిష్టమైన యోగం ద్వారా శ్రీరామునికి అందించాడు. ఈజ్ఞాన పరంపర ఉపనిషత్తుల ద్వారా యోగ శాస్త్రం ద్వారా, తత్త్వశాస్త్రం ద్వారా లోకానికి అందింపబడింది.

01/20/2019 - 22:25

ఏ ముని బాలకునివలె కామనారహితుడై సర్వక్రియారంభములయందు చరించునో అటువంటి పరిశుద్ధ స్వరూపునకు కర్మ చేయబడుచున్నది అయినప్పటికీ లోపము కలుగదు.
ఎవడు చూచుచు, వినుచు, తాకుచు, వాసన చూచుచు, తినుచు సమస్త భావములయందును సముడై ఆశారహితుడో వాడే ధన్యుడు, ఆత్మజ్ఞుడు.
ఎల్లప్పుడు ఆకాశమువలె సంకల్పరహితుడగు ధీరుడగు జ్ఞానికి సంసారము ఎక్కడ? దాని యొక్క భావము ఎక్కడ? సాధనములైన యజ్ఞాదులు ఎక్కడ?

01/18/2019 - 19:18

121. అహంకారము ఎట్లును అడగునట్లు నీకు కాన్పింపని యెడల ‘దాసోహం’ అను రూపమున దానిని నిలిచి యుండనిమ్ము. ‘‘నేను భగవంతుని కింకరుడను, నేను వాని భక్తుడను’’ అను అంకారమువలన నంతగా భయపడవలసినది లేదు. మిఠాయిలు అజీర్ణవాతమును గలిగింపవచ్చును, కాని కలకండ అట్టిది కాదు. భక్తుని ‘దాసోహం’ అను నహంకారమును పసివాని ‘నేను’ అను నహంకారమును -పుల్లతో నీటిపై గీచిన గీతవంటివి, అది ఎంతో సేపుండవు.

01/17/2019 - 19:10

114.పేరుప్రతిష్ఠలకై దేవులాడు వారు భ్రాంతిలో పడి కొట్టుకొనుచున్నారు. విధాతయే లేక సర్వేశ్వరుడే సమస్తము నియమించుచున్నాడనియు, అన్నిటికిని అతడే కర్త అనియు గమనింపజాలరు. వారు పాపము! ‘‘సర్వేశ్వరా! అన్నిటికిని నీవే కర్తవు, నీవే నియామకుడవు’’ అని బుద్ధిమంతుడు భావించును. పామరులును భ్రాంతిమతులను ‘నేను, నేను’ అని ప్రలాపింతురు.
పక్వాహంకారము - అపక్వాహంకారము

01/16/2019 - 18:22

అసలు బట్టలులేవని అనరు. నిద్రాబల పరాజిత అయిన స్ర్తి ప్రక్కదాని బట్టను కూడా తానే పైన వేసికొందట.
ఇపుడు రెండు చీరలున్నదానిని స్వామి చూస్తున్నాడట. ఇలాంటి సంస్కారంతో అలాంటి స్వరూపాల్ని చూస్తూన్న స్వామి-
జగామ మహతీం చింతాం ధర్మ సాధ్వస వంకితః

01/14/2019 - 18:39

అన్ని పండుగలలో ‘సంక్రాంతి’ అతి ముఖ్యమైనది. దీనిని ‘పెద్ద పండుగ’, ‘పెద్దల పండుగ’ అని అంటారు. పెద్దలను స్మరించుకొని, వారికి తర్పణములు, పిండ ప్రదానములు జరిపే రోజు సంక్రాంతి. సం, క్రాంతి- అను రెండు సంస్కృత పదముల కలయికతో ఏర్పడేది సంక్రాంతి. ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే పరివర్తనము. మనిషిలో మంచి పరివర్తనము కలిగించడమే ‘సంక్రాంతి’ పరమార్థము.

01/13/2019 - 23:22

భోగాలను ఇచ్చే పండుగ భోగి. నిఘంటువుల అఠ్థం చూసినపుడు భోగి శబ్దానికి తొలినాడు, పండుగ అనే అర్థాలు కనబడుతాయ. ఈ భోగి పండుగ పొద్దునే్న అరిష్ట నివారణ కోసం భోగిమంటలు వేస్తారు. వాటిలో పాతవి, పనికిరానివయిన వస్తువులు వేసి, ఆ పీడ విరగడైనట్లు భావిస్తారు.

01/11/2019 - 19:11

స్వేచ్ఛ చిన్న చిన్న ముక్కలుగా రాదు. అలాగే, బానిసత్వం చిన్న చిన్న ముక్కలుగా పోదు. గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు.
స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయటపడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.

01/10/2019 - 19:38

నన్ను చూడగానే అనుగ్రహ సూచకమైన కంఠ స్వరముతో ‘‘ఓహో! ఠాకూరు! క్షేమమా!’’ అని పలుకరించెను. వాని వాలకమును కనిపట్టి నాతో నున్న హృదయునితో నిట్లంటిని: ‘‘హృదయా! చూడుము, వీనికేదియో సంపద చేజిక్కియుండును. వీని వాలకమున నెట్టి మార్పు గలిగినదో చూచితివా?’’ హృదయుడు పక పకనవ్వసాగెను.
93.్ధనము నీకు బువ్వను మాత్రమే ఈయగలదు. ధన సంపాదనమే నీ పరమావధి యనుకొనుము.

Pages