S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/23/2019 - 19:29

ప్రతి భక్తుడును భగవానుని గూర్చి ప్రత్యేకమగు భావనను గలిగియుండవచ్చును. తదనుగుణమగు రూపమును పూజించుచుండవచ్చును. కొందరికి భగవంతుడు ప్రభువు, కొందరికి తండ్రి, కొందరికి తల్లి, కొందరికి ప్రాణసఖుడు, కొందరికి ప్రాణనాధుడు, మరికొందరికి విధేయుడగు సుతుడునై యొప్పుచుండును.

04/22/2019 - 22:36

అపుడెంతయు ప్రశాంతచిత్తుడై యుండును. మునుపటిగోల అంతయు పూర్తిగా అంతరించును. ప్రేమ పూరిత హృదయుడై, మనసార భక్తుడు ప్రార్థించినంతనే భగవానుడిక ప్రత్యక్షమగుటకు ఒక నిముసమైనను జాగుచేయజాలడు.
భక్తుడు: భగవంతుడు
భగవంతుడు ఎందుచే కాన్పింపడు?

04/22/2019 - 19:44

సృష్టి ఆవిర్భావానికి మూలకారణమైన జ్యోతిర్మయుడైన పరమాత్మ నుండి ఉద్భవించిన కాలాన్ని, శక్తిని ఆధారంగా చేసుకొని శ్రీసిద్ధకుంజికా మహాకాల విశ్వరూపాన్ని శ్రీ మహాకాల మందిరంలోప్రతిష్టింప చేశారు.
తాను ఏ రూపాన్ని తన అంతరంగమందు దర్శించారో ఆ రూపాన్ని సమాజానికి దర్శింపజేయాలనే తపనతో లోక కళ్యాణార్థం బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతిగారు జ్యోతిర్మయ మహాపీఠంలో శ్రీమహాకాల మందిరాన్ని స్థాపించారు.

04/19/2019 - 19:40

‘మానాయన! మా తండ్రి!’ యనుచు, ఆత్రముతో బిడ్డనికడ కేగి వాని నెత్తుకొనును.’’
630. ఎవని పరితాపము తీవ్రమై యుండునో, ఏకాగ్రత గాఢమై యుండునో, ఆతడు త్వరితముగా భగవంతుని గాంచగల్గును.
631. భగవంతుని గాంచనైతినని మూడు దినములు తీవ్ర పరితాపము పొందనిండు. నరు డీ కలియుగమున భగవదనుగ్రహము పొందగల్గును.

04/18/2019 - 19:57

విశ్వంభరాయ దేవాయ దేవాయ భక్త ప్రియకరాయచ
భక్తి ప్రియాయ దేవాయ నామ ప్రియాయతే నమః
దత్తాత్రేయుని పూజించాలి. స్తుతించాలి. దత్తాత్రేయుడు సద్గురువు. చీకటిలో అజ్ఞానంలో కూరుకుని పోయన జీవులకు జ్ఞానామృతాన్నిచ్చిన సద్గురు వరేణ్యుడు దత్తాత్రేయుడు.

04/17/2019 - 20:06

భగవత్ప్రేమ యెంత గాఢముగా నుండవలయునో తెలియునా? పతివ్రతకు భర్తపైనుండు ప్రేమ, లోభికి తాను కూడబెట్టుకొనిన ధనముపైనుండు మక్కువ, లోకులకు ఐహిత విషయములందుండు రాగము- ఇవి ముప్పిరిగొనినంత తీవ్రముగా నీ హృదయము భగవంతునికై పరితపించునపుడు నీకు భగవత్సాక్షాత్కారము కాగలదు.

04/22/2019 - 22:39

612. ధ్యానమున తీక్ష్ణమైన ఏకాగ్రత గలుగునపుడు అన్యమేదియు గానబడదు, వినబడదు. బాహ్యస్పర్శలుగాని, విషయానుభవములుగాని లేకుండును. శరీరముపై పాము ప్రాకుచున్నను అపుడు తెలియరాదు, ధ్యాతకుగాని, పామునకు గాని ఆ విషయమైన ఎఱుకయే లేకుండును.
613. ధ్యాననిష్ఠలో నుండ పక్షులు తన తలపై గూండ్లుకట్టుకొనినను ఏ విధమైన బాహ్యస్ఫురణము లేకుండునట్టివాడే ధ్యానసిద్ధుడు. ధ్యానమున బరిపూర్ణుడు.

04/16/2019 - 22:35

నమ్మకంతో దేనినైనా సాధించవచ్చు. విశ్వాసం తో కొండనైనా ఎక్కగలము. ఆకాశములోను విహరించవచ్చు. మొట్టమొదట మనిషికుండాల్సింది నమ్మకమే. ఈ విశ్వాసము అనేది ఒక్కోక్కరికి ఒక్కోదానిపై ఉంటుంది. సాధారణంగా భక్తులందరికీ భగవంతునిపైన అపార మైన విశ్వాసము, నమ్మకము ఉంటాయి. ఆ నమ్మకంతోనే మనుష్యులు భగవంతుడిని సాక్షాత్కరింపచేసుకొంటారు. తమతో మాట్లాడేటట్లు తాము చెప్పింది భగవంతుడు వినేట్టుగా కూడా పరిస్థితులను మార్చుకుంటారు.

04/16/2019 - 20:01

తెలంగాణలో నెలకొనిఉన్న శ్రీరామబంటు ఆంజనేయుడి ఆలయాల్లో మద్దిమడుగులోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం అత్యంత ముఖ్యమైంది. ప్రసిద్ధమైంది. ఈ ఆలయం అడవిబిడ్డలైన గిరిజనుల ఆలనాపాలనలో కొనసాగుతోంది. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అడవిలోని పచ్చటి చెట్లు, ప్రకృతి మధ్య ఓలలాడుతోంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరు అనే గ్రామం ఉంది.

04/14/2019 - 22:42

కాని నీటికొఱకై ఇట్టి శ్రమనెంత మాత్రము పడనక్కఱలేని యదృష్టవంతులు కొందఱుందురు. ఎట్లన, వానలువచ్చి వారి పొలమునంతయు చక్కగా నింపును. మాయాబంధమునుండి విముక్తిపొందుటకై ఇంచుమించుగా అందఱును దీక్షతో సాధన చేయవలసియేయున్నారు. కాని కృపాసిద్ధులకీ శ్రమయంతయు అనావశ్యకము. భగవత్కృపచేతనే వారు ముక్తులగుదురు. కాని వీరి సంఖ్య అత్యల్పము!
ఏకాగ్రత: ధ్యానము
594. జపతమములను సదా ఆచరించుచుండవలయును.

Pages