S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/14/2019 - 22:30

అంబేద్కర్ దళితుల విమోచనానికి ప్రవచించిన సిద్ధాంతాలు నేడు విశ్వవ్యాప్తంగా ఆచరించడం జరుగుతున్నది. ప్రపంచంలో ఏ మూలలోనైనా సరే అణగారిన వర్గాలవారున్నారంటే వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు అంబేద్కర్ సిద్ధాంతాల వైపు ఎదురుచూడ్డం జరుగుతున్నది. అంబేద్కర్ మహాశయుడు జీవించి ఉంటే ఈ పరిణామంపట్ల ఆయన ఎంతగా ఆనందించి ఉండేవారో!
జపాన్‌లో ‘బురకుల’ అణచివేత

04/12/2019 - 19:18

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వ కాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించిన ఏకైక మహానుభావులు కీర్తి శేషులు వావివిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. రామాయాణాన్ని చదివితే చాలు మనిషి ఎలా జీవించాలో ధర్మాన్ని ఎందుకు ఆచరించాలో మనిషితనం మనిషిలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుస్తుంది.

04/10/2019 - 19:20

విహంగ మార్గము, (2) మర్కట మార్కము, (3) పిపీలికా మార్గమునని సాధన మూడు విధములు.
1) పక్షివచ్చి పండు పొడుచును. బహుశః ఆ పోటుతో పండు పడిపోవును, ఇక నది పక్షికి దక్కదు. అటులనే అతి తీవ్రముగా సాధనలు సాగింప యత్నించువారు కొందఱుందురు. ఆ తీవ్రతయే తఱచు వారి ప్రయత్నములను భగ్నము చేయుచుండును.

04/09/2019 - 19:40

మనస్సును పట్టి తిన్నగా నిలిపియుంచునంత కాలము సన్మార్గమున చక్కగనే నడచును, ప్రయోజనకారిగనే యుండును. కాని నీ జాగరూకత రవంత కొఱవడినంతనే అది సన్మార్గము వీడి పెడత్రోవనుబట్టును.

04/08/2019 - 22:27

కాని క్రొత్తగా వ్యవసాయమునకు దిగిన వర్తకుడు ఒక్క ఋతువు అనావృష్టి సంభవించినంతనే దిగులుపడి, ‘మనకిది అచ్చిరాలే’దని ఆ వ్యవసాయమును కట్టిపెట్టును. అదే తీరున జీవితకాలమంతయు సాధనచేసి తుదకు భగవంతుని గనజాలకున్నను నిజమైన భక్తుడు నిరుత్సాహము చెందడు.

04/08/2019 - 22:12

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థనముత్తమమ్

04/08/2019 - 22:23

నరుడు సంసార తాపత్రయమున మునిగియున్నంతవఱకు వానికి చేయు ధర్మోపదేశములు వ్యర్థములు. కొంత కాలము విషయానుభవమును పొందనిండు. విషయములందలి రాగము కొంతవఱకు తగ్గిన పిమ్మట ధర్మోపదేశములు ఫలించు సమయము వచ్చును. అంతవఱకు వానికి చేయి నుపదేశములన్నియు వ్యర్థములే.

04/05/2019 - 18:55

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్యనామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవత్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంఠోక్తిగా చెపుతున్నది. ఈ ఉగాది రోజునే సృష్టి ప్రారంభింపబడి, ఆయా దేవతలకు సంబంధిత పనులను బ్రహ్మ అప్పగించినట్లు పురాణ కథనం.

04/04/2019 - 19:40

అటులనే సంసారియు వివేక వైరాగ్యములను రెక్కలతో మాయాజాలమును భేదించుకొని వెలువడగలడు.
556. దేవాలయమగు హృదయముయొక్క తాళము తీయవలయుననిన చెవి వెనుకకు త్రిప్పవలయును. అనగా భగవంతుని ప్రాపించుటకై (రాగద్వేషములను విడిచి) వివేక వైరాగ్యముల నవలంబింపవలయును.

04/03/2019 - 19:36

సమస్తమైన కోరికలను ఈడేర్చుకొనవలయును, లేదా వానినన్నింటిని పరిత్యజింపవలయును. కాని కోరికల నన్నిటిని ఈడేర్చుకొనుట యసంభవము. ఏలన ఒక కోరికను తృప్తినొందించుకొన బ్రయత్నించితిమో లేదో, మరియొకటి తలచూపుచుండును. కావున సంతుష్టిచేతను జ్ఞానముచేతను కోరికల నడచివేయుటయే దొడ్డబుద్ధి!

Pages