S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/30/2019 - 20:18

పునస్సమాగమం చెందిన నలదమంతులు చంద్రుడు రోహిణీ కలిసినట్లు ఉండటం చూచి తల్లిదండ్రులు, సఖులూ, అందరూ ఆనందాన్ని పొందారు.
భీమమహారాజు కుండిన నగరంలో అష్టశోభనాలు, దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశాడు.

08/29/2019 - 19:33

నీ రాకకోసమే నిన్ను వెదకటానికై ప్రీతితో అన్ని దిక్కులకూ బ్రాహ్మణులను పంపించడమూ, నా కథను ఎన్నోచోట్ల చెప్పించడమూ జరిగింది. ఆ బ్రాహ్మణులలో ‘పర్ణాదుడు’అనే బ్రాహ్మణ పండితుడు కోసల రాజ్యానికి వచ్చి ఋతుపర్ణ మహారాజును కలిశాడు. సభలో నా కథను వినిపించాడు. ఆ బ్రాహ్మణుడు మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరంగా వచ్చిన మాటనుబట్టి నిన్ను గుర్తించాను. మిమ్ములను రక్షించుటకై నాకు తోచినదే ఈ ఊహ! ఈ ఉపాయం!

08/28/2019 - 19:06

దమయంతి చెప్పగానే విన్న తల్లి భీమరాజు అనుమతితో దమయంతి దగ్గరకే బాహుకుని రప్పించింది.
దమయంతిని చూడగానే నలునకు దుఃఖం శోకాలు ఆవరించాయి. కుల స్ర్తియైన దమయంతి అప్పుడు ఆ స్థితిలోఉన్న నలుని చూచి తీవ్రమైన శోకాన్ని పొందింది.

08/27/2019 - 19:30

దమయంతి పాత్ర చిత్రణ మిక్కిలి హృదయంగమమైనది. దమయంతి అతిలోక సుందరి. సౌందర్యంతోపాటు సౌశీల్యం ఆమెలో పెనవేసుకొనిపోయింది. సౌందర్య సౌశీల్యాలేగాక ఆమె తెలివితేటలు నిరుపమానాలు. నలుడు జూదమాడుతుండగానే ఆమె భర్త ఓటమిని ఊహించింది. వెంటనే తన పిల్లలను తన తల్లిదండ్రులవద్దకు విదర్భకు పంపింది. నలుని జూదం ఆపటానికై పౌరులను వెంటబెట్టుకొని వచ్చి ప్రయత్నించింది.

08/26/2019 - 20:06

ఋతుపర్ణుడికోసం అనేక విధాలైన భోజన పదార్థాలను తయారుచేస్తుంటాడు. బాహుకుడు కుండలవైపు చూడగానే అవన్నీ నీటితో నిండిపోతాయి. తరువాత అతడు ఆ నీటితో మాంసాన్ని కడుగుతాడు.
అతడు గడ్డితోకూడిన పిడికిలిని సూర్యునివైపు చూపి వీచితే అచట నిప్పు ఉద్భవించి అతడి వంట పూర్తయ్యేవరకు కట్టెలతో నిమిత్తం లేకుండా ఆరిపోకుండా అట్లే మండుతూ ఉంటుంది. ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యపడ్డాను.

08/25/2019 - 22:17

‘‘బాహుకా! ఒక స్ర్తికి సంబంధించిన మాటలను చెపుతూ ఇంతకుముందు ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరానికి వచ్చాడు. అక్కడ అతడు ‘‘అడవిలో అలనాడు కనికరం లేకుండా తనమీదనే ప్రాణాలు పెట్టుకొని తనతోపాటు అడవికి వచ్చిన ప్రియ అర్థాంగిని విడిచి వెళ్ళిపోయావుగదా? అనురాగంగల ప్రేయసిని నేను నిద్రిస్తున్న సమయాన ఒక వంచకునివలె నార చీరెను సగం చింపుకొని నన్ను అరణ్యంలో విడిచి ఎక్కడికి వెళ్ళావు?

08/23/2019 - 19:32

శ్రావణ కృష్ణ పక్ష అష్టమి ‘‘కృష్ణాష్టమి’’ పర్వదినం. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భ పర్వమగుటచే దీనిని ‘‘జన్మాష్టమి’’ అని, కృష్ణుడు బాల్యంలో గోకులమున పెరిగినందున ‘‘గోకులాష్టమి’’ అని, ‘‘కృష్ణ జయంతి’’, ‘‘శ్రీజయంతి’’ అని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈనాడు జరిపే పూజా పునస్కారాలను కృష్ణాష్టమీ వ్రతం, కృష్ణ జయంతీ వ్రతం, కృష్ణ జన్మాష్టమీ వ్రతమని పిలుస్తారు.

,
08/22/2019 - 19:22

అర్థరాత్రి
చిక్కని చీకటి
కంసుని కారాగారం
చల్లని మలయమారుతాలు
కావలిగాండ్ర గాఢనిద్ర
దేవకీదేవి , వసుదేవుల కళ్లల్లో
అనిర్వచనీయమైన ఆనందాశ్రువులు
అంతలో
చల్లని వెనె్నలలాంటి ప్రకాశం, దివ్యమైన, పరిమళమైన సుగంధం అంతటా వ్యాపించింది.
చిరుజల్లులవలె పుష్పవాన, దేవకీదేవి గర్భం పండింది. పండంటి బిడ్డ అనుకొని కళ్లు తెరిచింది.

08/21/2019 - 18:59

‘‘కేశినీ! నీవు ఒక పనిచెయ్యాలి. ఋతుపర్ణుడు అయోధ్యకు రాజు. అతడితోపాటు వచ్చిన వార్‌ష్ణేయుని సూతపుత్రుని నేను గుర్తించాను. అయితే ఆ రథంప్రక్కన పొట్టి చేతులతో, వికృత రూపంతో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ రథసారథి ఎవరో తెలుసుకో! అతడు ఎవడై ఉండవచ్చునో తెలుసుకో! వాడి పట్ల నా హృదయం సంతోషం పొందుచున్నది. కేశినీ! ఆ పురుషుని చెంతకేగి, ఏమాత్రం తొందరపాటు లేకుండా మృదువుగా క్షేమసమాచారాలను అడిగి తెలుసుకో!

08/20/2019 - 19:25

వర్షాకాల మందలి మేఘ గర్జనలవలె గంభీరంగా వినిపిస్తున్న నలుని రథఘోషను దమయంతి కూడా విన్నది. ఆ మహాధ్వనిని విన్న దమయంతి ఆశ్చర్యాన్ని పొందింది. నలుడు గతంలో తన గుర్రాలను పూన్చి రథాన్ని నడుపుతున్నప్పుడు వచ్చిన రథ ఘోషతో సమానమైన రథ ఘోషను విన్నది. తన మనస్సులో

Pages