S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/15/2018 - 22:34

దేవీ భాగవతంలో నారాయణమూర్తి భక్తుడైన నారద మహర్షికి సరస్వతీదేవి చరితమును చక్కగా తెలియజేశాడు. గణేశుని జనని, దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి-సావిత్రి దేవీమణులు సృష్టికి ప్రకృతులని చెప్పారు. వీరి ప్రభావములు- పూజలు అద్భుతములు. వీరి చరిత్రలు ప్రఖ్యాతములు.

10/14/2018 - 22:38

అందుకే అలాంటి వారెవరూ ఎప్పటికీ అసలైన ధార్మికులు కారు, కాలేరు.

10/12/2018 - 18:49

ఆరురోజులలో ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు చివరిగా తన చెవులకు చెవుడు వచ్చేలా చేసుకున్నాడు. ఆరోజునుంచి ఆయన ఏదీ వినలేదు. అలాగే ఆయన గురించి ఇంతవరకు మనకు ఏదీ తెలియలేదు. ఈ విషయాలు ఏ పవిత్ర గ్రంథాలలోనూ ఉండవు. ఇవన్నీ నా వ్యక్తిగత అనుభవంతో స్వయంగా అనే్వషించి తెలుసుకున్న విషయాలు. అందుకే వాటిని ప్రామాణికంగా చెప్పగలుగుతున్నాను.

10/11/2018 - 18:39

ఆ గీతంలో రవీంద్రనాధ్ ఠాగూర్ ఇలా అన్నారు- ‘‘నాకు గుర్తున్నంతవరకు, అనేక జన్మల నుంచి, ఇంకా చెప్పాలంటే, అస్తిత్వ ప్రారంభం నుంచి నేను ‘దేవుణ్ణి చూడాలి’ అనే కోరితో అనే్వషిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి ఆయన ఎంతో దూరంలో వున్న నక్షత్రం ప్రక్కనే కనిపించేవాడు. ఆయన కనిపించగానే నేను ఆనందంతో నాట్యం చేసేవాడిని. నాకు తెలుసు, నేను వెళ్ళలేనంత దూరంలో ఆయన ఉన్నారని.

10/10/2018 - 18:36

ప్రాచీన ఆర్ష విద్య, సభ్యతా సంస్కృతులకు, సనాతన సంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి ఉన్న భారతావనిలో ప్రతి జీవిలో దైవాన్ని దర్శించి, పూజించడం సదాచారంగా వస్తున్నది. అందులోభాగంగానే పంచ మహా భూతాలలో ఒకటిదైన నీటికి ప్రాధాన్యత ఇస్తూ, జీవనదులను ఆరాధించడం పరంపరానుగతంగా వస్తున్నది. పుష్కరం అంటే 12ఏళ్ళు. 12ఏళ్ళకు ఒకసారి ఒక నదికి పుష్కరం రావడం జరుగుతుంది.

10/09/2018 - 19:09

బాలారామ్ సోదరులైన బాబుల్జీ, వామనరావు శిరిడీ వెళ్లారు. వారు బాబాను దర్శించుకుని సంతోషించారు. బాబా సమక్షంలో తమకు కలిగిన ఆనందాన్ని, మనశ్శాంతిని ఇతరులతో వర్ణించి చెప్పేవారు. అదే విషయాన్ని తమ సోదరుడైన బాలారామ్‌కు కూడా చెప్పారు. దాంతో బాలారామ్‌కు బాబాను చూడాలనే ఆత్రం పెరిగింది. ఒకసారి అందరితో కలిసి శిరిడీ ప్రయాణమయ్యారు.

10/08/2018 - 18:57

రుద్రాక్ష అనేది ఒక రకమైన చెట్టు జాతి యొక్క విత్తనం. సహజంగా ఎతె్తైన పర్వతాలలో ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలలో కొన్ని ఉన్నాయి. కానీ నాణ్యత కలవి ఎతె్తైన హిమాలయ ప్రాంతంలోనే లభిస్తాయి ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత. ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన కదలికఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు.

10/04/2018 - 18:59

వారి మాటలు విన్న డయోజినెస్ వారితో ‘‘నేను మిమ్మల్మి చంపేస్తానని భయపడకండి. నేను అలాంటి పని ఎప్పుడూ చెయ్యను. మీరు నన్ను వేలంలో బానిసగా అమ్మాలనుకుంటున్నారు కదా!’’ అన్నాడు. ఆ నలుగురు దొంగలు కాస్త భయపడుతూనే ‘‘అవును. మేము చాలా కష్టాల్లో ఉన్న దరిద్రులం. మీరు ఒప్పుకుంటే వేలంలో మిమ్మల్ని చాలా ఎక్కువ ధరకు అమ్ముకుంటాం’’ అన్నారు.

10/03/2018 - 19:41

వారు కుర్రవాడిని బాబా ఎదుట కూర్చోబెట్టారు. బాబా కురుపుమీద తన చేతిని తిప్పారు. ప్రేమాదాస్పద చూపుల్ని బాలునిపై ప్రసరించారు. ఊదీ రాసిన పిమ్మట కొద్దిరోజులకు కురుపు తగ్గిపోయింది. ఇది తెలిసి కుర్రవాడి మేనమామ అయిన డాక్టరు బొంబాయి వెళ్తూ మార్గమధ్యంలో ఆగి బాబాను చూడాలనుకున్నాడు. కానీ, మాలేగాంలోను, మన్మాడులోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పటంతో శిరిడీ వెళ్లటం మానుకున్నాడు.

10/01/2018 - 18:43

బాబా రూపం సత్, చిత్‌ల సంగమ స్వరూపం. సదానందకరం. బాబా దర్శన మాత్రంతోనే మనో చాంచల్యాలు, మనో వైకల్యాలు, మనో మాలిన్యాలు పటాపంచలైపోతాయి. దుర్మార్గులు సన్మార్గులుగా మారతారు. మనసులోని చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దుష్టబుద్ధులు అంతరించిపోతాయి. బాబా ముఖారవిందం శుద్ధ చైతన్యానందానికి ప్రతిబంధం. బాబా మోములోని దివ్యకాంతి అజ్ఞానపు చీకట్లను తొలగించి గొప్ప శాంతిని కలిగిస్తుంది.

Pages