S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/30/2018 - 22:28

భేషజాలవల్ల మానవత్వం నశిస్తుందని, ఎక్కువ తక్కువ భేదభావాలను విడనాడాలని చెబుతుండే వారు. బాబా ఆత్మానుసంధానంగా మునిగి ఉంటే కొందరు భక్తులు శ్రావ్యంగా, సుతిమెత్తగా వాయిద్యాలను మ్రోగించేవారు. ఇంకొందరు అర్ఘ్యపాద్యాలను సమర్పించేవారు. మరికొందరు బాబాకు చందనం, అత్తరు పూసి, ఆ అలంకారంలో బాబాను చూసి మురిసిపోయేవారు. తాంబూలాలు సమర్పించేవారు. నైవేద్యాలుపెట్టి భక్తితో బాబాకు చేతులు జోడించేవారు.

09/26/2018 - 18:42

మానవత్వాన్ని పవిత్రమైన దివ్యత్వములో ప్రవేశింపజేయడానికి చేసే ప్రయత్నంలో తమ యొక్క కామతత్వాన్నీ, క్రోధతత్వాన్నీ, తమ యొక్క విజృంభణమునూ కొంతవరకు అణచుకునే ప్రయత్నంగావించాలి. మన యొక్క తలను పవిత్రమైన భావాలతో, సుకృతమైన శీలంతో, దివ్యమైన జ్ఞానంతో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగాక ప్రపంచంలో జరిగే నానా లౌకికమైన మలిన విషయాలను, రోత పుట్టే పాత గుణాలనూ నింపుకోరాదు.

09/25/2018 - 18:27

తన భక్తుడు ఫలానాచోట ఆపద బారినపడ్డాడని, రక్షించటానికే అలాచేశానని బాబా అక్కడున్నవారికి చెప్పేవారు. వారికి అంతా ఆశ్చర్యంగానే ఉండేది. కొద్దిసేపటికి నిజంగానే సదరు భక్తుడు వచ్చి తను బాబా దయతో ఆపద నుంచి బయటపడినట్టు చెప్పేవారు. కూర్చున్నచోటనుంచే అంతా నడపటం, నడిపించటం బాబా లీలావిలాసం.

09/24/2018 - 18:26

పోయే ప్రాణాన్ని నిలిపిన సంజీవని ఊదీ. బాబా ఊదీ ఎటువంటి విపత్కర పరిస్థితినుంచైనా పరిష్కరించి భక్తులకు అభీష్టసిద్ధిని కలుగచేస్తుంది. బాబా ధునినుంచి పుట్టిన ఊదీకి సాధ్యంకానిదేదీ లేదు. విశ్వాసం ఉంచాలే కానీ అది ఊపిరిపోస్తుంది. బాబా ప్రసాదించే ఊదీ మహిమాన్వితమైనది. అది కష్టాలనుంచి గట్టెక్కిస్తుంది. ఇబ్బందులనుంచి బయటపడవేస్తుంది. బాబా సంతోషంగా ఉన్నపుడు పాటలు పాడేవారు. అందులో ఊదీ పాట ఒకటి.

09/21/2018 - 19:58

అక్కడ స్ర్తిని మరీ చులకనగా ఒక బల్లలా, ఒక కుర్చీలా కేవలం ఏదో ఒక వస్తువులాంటి ఆస్తిలా పరిగణిస్తారే కానీ, ప్రాణమున్న జీవిగా చూడరు. అందుకే చైనాలో భర్త తన భార్యను చంపినా అక్కడి చట్టాలు అతనిని శిక్షించవు. ఎందుకంటే, అక్కడ స్ర్తి కేవలం ఒక వస్తువు లాంటిది. ఆమెను ఏమిచేసినా, చివరకు ఆమెను చంపినా అక్కడి చట్టాల దృష్టిలో అది నేరం కాదు. వ్యక్తిగత ఆస్తుల ప్రవేశంతో స్ర్తికూడా ఒక వ్యక్తిగత ఆస్తిగా తయారైంది.

09/20/2018 - 20:26

త్యాగానికి, మహోన్నత సనాతన సాంప్రదాయానికి, మత సామరస్యానికి ప్రతీక మొహర్రం వేడుక. ధర్మసంస్థాపన లక్ష్యంగా, నమ్మిన సిద్ధాంతాల కోసం పలువురు ప్రాణాలర్పించిన మాసం మొహర్రం.

09/19/2018 - 19:23

బాబా జీవితం వెలుపల, లోపల అత్యంత మధురం. బాబా నడిచినా, మాట్లాడినా. తిన్నా, ఏ పని చేసినా మధురమే! బాబా జీవితం మూర్త్భీవించిన ఆనందం. తన భక్తుల ఆనందయోగానికి బాబా పలు ఉపదేశాలు చేశారు. చక్కని నీతులు బోధించారు. వాటిని చదివి, ఆచరిస్తే ముక్తి, మోక్షం కలుగుతాయి.

09/18/2018 - 18:56

చివరకు జ్యోతిషం, గ్రహదోషాలు వంటి వాటిని కూడా బాబా మూఢనమ్మకాలుగా భావించారు. తన భక్తులను వాటి జోలికి పోనివ్వలేదు. అందుకే యోగీశ్వరుల పరంపరలో సాయిబాబా విశిష్టమైన వారు. కొందరు మిడిమిడి జ్ఞానంతో మహిమలు ప్రదర్శించబోయినా వారిని వారించి దారిలోపెట్టారు. మహిమలకంటే మానవత్వాన్ని ప్రదర్శించటమే ఉత్తమమని బోధించేవారు. బాబా భక్తజన బాంధవుడు. భక్త సులభుడు, పిలిస్తే పలికే దైవం. బాబాకు దేహాభిమానం లేదు.

09/17/2018 - 18:44

ఒకసారి షిర్డీకి చెందిన పెద్దమనిషి ఒకరు సాయంత్రం వేళ మసీదు వద్దకు వెళ్లాడు. ఎక్కడా బాబా కనిపించలేదు. తేరిపార చూడగా, మనిషి అవయవాలు మసీదు నాలుగు మూలలా విసిరేసినట్టు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా గమనించి బాబా అవయవాలే అని గుర్తించాడు. బాబాను ఎవరో ఖూనీ చేశారని ఆ పెద్దమనిషి భయపడిపోయాడు. ఈ విషయాన్ని మొదట చూసి ఫిర్యాదు చేసింది తానే కాబట్టి మొదట తననే అనుమానిస్తారన్న భయం వేసింది.

09/16/2018 - 21:54

బాబా ఒక్కోసారి ఆహార పదార్థాలను శిష్యులను రుచి చూడమని చెప్పి వారిని ఈ విషయంలో పరీక్షించేవారు. బాబా చేతివంట, బాబా స్వయంగా వడ్డించగా తిన్నవారు ధన్యులు. బాబా వంట పాత్రలోని ప్రతి మెతుకు తిన్నవారికి ఎంతో సత్తువను కలుగజేసేది. అది రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారం. మహాప్రసాదం. అది సదా శుభదాయకమైనది. పవిత్రమైనది.
***

Pages