S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/14/2018 - 19:17

వామన్ తాత్యా అనే కుమ్మరి బాబాకు రోజూ రెండు కాల్చని పచ్చి కుండల్ని ఇచ్చేవాడు. బాబా బావి నుంచి నీళ్లు తోడి ఆ కుండల్లో నింపి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు నీళ్లు పోసేవారు. సాయంకాలం వేళలో ఆ పచ్చి కుండల్ని వేపచెట్టు మొదట్లో బోర్లించేవారు. పచ్చికుండలు కావటంవల్ల అవి వెంటనే విరిగి ముక్కలయ్యేవి. మూడేళ్లలో బాబా కృషివల్ల అక్కడ చక్కని పూలతోట వెలసింది. ప్రస్తుతం ఆ స్థలంలోనే బాబా సమాధి మందిరం ఉంది.

09/12/2018 - 19:06

త్రిగుణాత్మక స్వరూపుడు, త్రైమూర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతావనిలో ఆది దైవ స్వరూపంగా ఉపాసించ బడుతున్నాడు. ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపుడైన విఘ్నేశ్వరుని ‘గుణేశుడు’ అని అభివర్ణించగా, కాలక్రమేణ ‘గణేశుడు’ అయినాడు. గాణాపత్య సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ సమ్మేళనం.

09/11/2018 - 18:47

సాయి జీవనమే సాయితత్త్వం. సాయితత్త్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని ఒంటబట్టించుకుంటే బతుకు ఆనందనందనమవుతుంది. జీవితం ధన్యమవుతుంది. నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులు, చిక్కులకు ఏకైక పరిష్కారం సాయితత్వమే. ఎవరికీ అర్థం కానిదేదీ బాబా చెప్పలేదు. అర్థంకానిదేదీ చెప్పటానికి కూడా కనీసం ప్రయత్నించలేదు. బాబా చెప్పింది సత్యమార్గం. ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోమన్నారు.

09/10/2018 - 20:08

మహా విష్ణువు అంశావతారుడు బలరాముడు. శ్రీహరి అంశతో జన్మించిన బలరాముడు హలధారియై, రైతుజన బాంధవునిగా భావించి, పూజించ బడుతున్నాడు. హలం చేతబూనిన హాలికుడే రైతు కనుక, నాగలితో నేలను తవ్వగా పుట్టిన నాగావళీ నది బలరాముని వరదాయిని అని ప్రజల విశ్వాసం. బలరాముని మరో ఆయుధం రోకలి. రోకలిని కూడా వివాహాది శుభ కార్యాలయాలలో గృహ జీవనంలో శుభాశుభాలకు వినియోగిస్తారు.

09/07/2018 - 19:10

భిన్న సంస్కృతులు, భాషలు, ధర్మాలు, ప్రజల కేంద్రస్థానమై, అఖండ మరియు అవిభాజ్యమైన సంస్కృతికి మూలాధారమైన భారతావని ప్రాచీన కాలంనుండీ వ్యవసాయ ప్రధాన దేశం కావడం, గ్రామీణులలో అధిక సంఖ్యాకులు రైతులే కావడం, ఎడ్లు మరియు నాగళ్ళతో విడదీయరాని బంధం, అనుబంధాన్ని ఏర్పరచుకున్న రైతు, వాటికి కృతజ్ఞతను ప్రకటించే వారసత్వ ఆచార క్రమంలో ఏటా శ్రావణ మాస ముగింపు దినమైన అమావాస్యను ‘పోలాల అమావాస్య’గా పండగ జరుపుకోవడం అనాదిగా

09/06/2018 - 19:29

సాత్విక గుణ ప్రధానమైన మనిషియందు, అహింస, అస్తేయం, అసత్యమాడకుండుట, వ్యభిచరించకుండుట, కోపం లేకపోవడం, గురుసేవ, శారీరక మానసిక శౌచం సంతోషం ఋజువర్తనం, తననుతాను కీర్తించుకోకుండుట, వేద శాస్త్రాలపై విశ్వాసం కలిగి వుండటం వంటి మంచి లక్షణాలుంటాయి. ఇక రాజసవృత్తి గల వ్యక్తి అన్నిటికి తానే కర్త భోక్త. తనవల్లనే అంతా జరుగుతోందని, వాచాలత్వం, దురభిమానం కలిగి వుంటాడు.

09/05/2018 - 18:36

ఏ కార్యం సిద్ధించాలన్నా, నెరవేరాలన్నా‘సాధన’ అవసరమంటారు. ఏ కళలో రాణించాలన్నా సాధన అవసరం. సంగీతం, నాట్యంలో రాణించాలంటే సాధనతో ముడిపడి వుంటుంది.
కళలే కాకుండా జ్ఞానానికి, భగవంతునిమీద భక్తి అన్నిటికీ సాధన అవసరం. సాధనతోనే ప్రతిదీ సాధ్యం. భగవంతుని సాన్నిధ్యానికి దగ్గరవడానికి, జ్ఞానానికి నవవిధభక్తులు సాధనాలు సోపానాలైతే ఆ సోపానాలు ఎక్కడానికి సాధనే కావాలి.

09/04/2018 - 19:14

మూడు గుణముల ఏకత్వమే తపస్సు. మూడు గుణముల ఏకత్వం అనగా శారీరిక, వాచిక, మానసికముల సమన్వయమైన పరివర్తన. వాటి ప్రభావమే తపస్సు. త్రిగుణముల ఏకత్వాన్ని, త్రిగుణముల త్రిపుటి యొక్క సంపూర్ణత్వాన్ని అనుభవించినటువంటి మనిషి మహాత్ముడు.
రజోగుణ, తమోగుణముల ఏకత్వాన్ని నిర్మూలనం చేసి , ఇంద్రియముల దోషములను నిర్మూలనము చేసి, మూడు గుణముల ఏకత్వాన్ని అనుభవించే పరిస్థితికే తపస్సు అని పేరు.

09/03/2018 - 19:31

మానవునిలో నియంత్రణాశక్తి అవసరం. మనస్సును నియంత్రణలో ఉంచితే ప్రశాంత హృదయం సిద్ధించి ఇంద్రియములను జయించడానికి దోహదకారి అవుతుంది. యోగం అనగాకలయిక. జీవ బ్రహ్మైక్యం . యోగసిద్ధి కలవానికి మట్టిగడ్డరాయి, బంగారం మొదలైన వాటిని సమానంగా చూసే అలవాటు వుంటుంది. అదే ఆత్మజ్ఞానము. వేరు వేరుగా వున్న సమస్త ప్రాణులందు ఏకమై నాశనరహితమై అవిభక్తమై ఉండే ఆత్మవస్తువును చూడడానికి సాత్త్విక జ్ఞానం అవసరం.

09/02/2018 - 22:20

శ్రావణ కృష్ణ పక్ష అష్టమి ‘‘కృష్ణాష్టమి’’ పర్వదినం. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భ పర్వమగుటచే దీనిని ‘‘జన్మాష్టమి’’ అని, కృష్ణుడు బాల్యంలో గోకులమున పెరిగినందున ‘‘గోకులాష్టమి’’ అని, ‘‘కృష్ణ జయంతి’’, ‘‘శ్రీజయంతి’’ అని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈనాడు జరిపే పూజా పునస్కారాలను కృష్ణాష్టమీ వ్రతం, కృష్ణ జయంతీ వ్రతం, కృష్ణ జన్మాష్టమీ వ్రతమని పిలుస్తారు.

Pages