S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/11/2018 - 20:54

భారతీయ సంగీత, ఆధ్యాత్మిక రంగాలకు మకుటంలేని మహారాజు శ్రీ త్యాగరాజు. సంగీత సాహిత్యాలకు ఒజ్జిబంతి శ్రీ త్యాగరాజు. సంగీత సాహిత్యాలతోపాటు భరతమునికి ధీటుగా భారతావనిలో వనె్నకెక్కినవారు ‘సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయబ్రహ్మ’ పుంభావ సరస్వతికి ప్రతిరూపంగా అవతరించినవారు హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు.

02/09/2018 - 21:07

పుణ్యభూమి యైన మన భారతదేశంలో ప్రతితిథీ ప్రతివారమూ మహనీయమైనదే. ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క దైవాన్ని పూజించడం సంప్రదాయం. మహావిష్ణువు అత్యంత ప్రీతిదాయకమైన తిథి ‘ఏకాదశి’ఈ ‘ఏకాదశి’ మరీ మహత్తరమైంది. ఆరోజున ఉపవాసం ఉండడం, మహావిష్ణువు పూజించడం లాంటివాటిని ఆచరించిస్తే అటు ఆరోగ్యసంపద ఇటు ఆధ్యాత్మిక సంపద ఒనగూడుతాయి అంటారు. సంవత్సరానికి 24ఏకాదశులున్నా ఒక్కొ ఏకాదశి ఒక్కో మహాత్య్మానికి ప్రత్యేకతను పొందింది.

02/08/2018 - 22:10

కుమ్మరి ఇంట్లో ప్రవేశించిన పాండవులు, ద్రౌపది శయనించి ఉండటాన్ని చూస్తాడు దృష్టద్యుమ్నుడు. అలా పరుండిన పాండవులు సేనాధికారుల గురించీ, దివ్యాస్త్రాల గురించి, రథాలు, ఏనుగులు, ఖడ్గాలు మొదలగువాటి గురించి మాట్లాడుకొనటం వింటాడు. వారలా మాట్లాడుకొనటం పాంచాలి కూడా విన్నది. పాండవులు మాట్లాడుకొన్న విషయాలను వినిన దృష్టద్యుమ్నుడు అక్కడనుండి బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళాడు. ద్రుపదుడు విచారంతో ఉన్నాడు.

02/07/2018 - 21:08

ద్రౌపది సమేతులై కుమ్మరి ఇంటికి వెళుచున్న భీమార్జులను, తండ్రి ఆజ్ఞ మేరకు దృష్టద్యుమ్నుడు వారి వెనుక నుండి వారిని అనుసరించాడు. భీమార్జునులకు తెలియకుండా సేవకులను అంతా నియమించాడు.
దృష్టద్యుమ్నుడు భార్గవుని ఇంటి వద్ద అజ్ఞాతంగా ఉన్నాడు. పాండవుల గురించి గోప్యంగా వివరాలను సేకరిస్తున్నాడు.
సాయం సమయం అయింది. భీమార్జున నకుల సహదేవులు భిక్షాటనం కోసమై బయలుదేరి వెళ్ళారు.

02/06/2018 - 22:01

ఇటువంటి సేవ మనకెందైనా గలుగునా
పటుతరమైన రాఘవ ప్రభు సన్నిథి నే గాక
తేటకస్తురి నుదట - నీటు గులుకు చుండ
హాటకాంబరుడైన శ్రీ- హరి సభయందునె గాక
ఆడుచు నాదమున - బాడుచు నెదుటను
వేడుచు నామది - గూడి యుండుటె చాలు
వాసిగ భద్రశైల - వాసుని దాసాను
దాసుడౌ నరసింహ - దాసావనుని గనకున్న
దాసుడే నరసింహ - దాసావనుని గనకున్నా....

02/05/2018 - 21:10

అయితే కుంతీదేవి తెచ్చిన భిక్ష ఏమిటో తెలియక ఎప్పటిలాగే భావించి.. ‘‘దానిని మీ అయిదుగురూ ఉపయోగించండి’’ అని కొడుకులను ఆజ్ఞాపించింది.
తరువాత ద్రౌపదిని చూచి సిగ్గుపడి అధర్మానికి భయపడి ధర్మరాజుతో ఏమి చేయాలని ఆవేదన పడింది.

02/04/2018 - 20:53

రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం మానవజాతికి మనశ్శాంతిని ప్రసాదించే గుళికలు. వీటిలోని పాత్రలు ధర్మమార్గంలో వెళ్లడానికి దారిచూపుతాయి. ఎల్లప్పుడు వీటిని మననం చేసుకుంటూండాలి అంటారు పెద్దలు. ద్వాపరయుగంలో హరిహరులు శ్రీకృష్ణబలరాములుగా అవతారాలెత్తారు. ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించ బద్ద కంకణుడైతే, బలరాముడు అన్యాయాన్ని భూస్థాపితం చేయ నడుంకట్టాడు.

02/02/2018 - 23:00

ధనుర్వేదం అభ్యసించిన గొప్ప వీరులైన దుర్యోధన శల్య మొదలైనవారు ఎంత ప్రయత్నించినా ఎక్కుబెట్టలేని ఆ ధనుస్సును విష్ణు ప్రభావుడైన అర్జునుడు అలవాటైన ధనుస్సును సంధించినట్లుగా దానిని సులభంగా ఎక్కుబెట్టగలిగాడు.
ప్రజలు, రాజులు అందరూ ఆశ్చర్యపడుతుండగా ఐదు బాణాలతో ఆ మత్స్య యంత్రాన్ని ఒక్క క్షణంలోనే పడగొట్టాడు.
ద్రౌపదిని గెలుచుకున్నాడు

Pages