S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/01/2018 - 19:00

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునికి కర్మయోగ మహిమను ఆచరించవలిసిన విధానమును, దానివలన కలిగే ఫలితమును వివరించిన తీరు అర్జునునికే గాక అన్ని యుగాలకూ అద్భుత సందేశమిది . అన్నివేళలా అందరూ ఆచరింపదగినది కూడా.

07/31/2018 - 19:27

ఉపమాక అనగా ఉపమానం లేనిది (సాటిలేనిది) అని అర్థం.అటువంటి దివ్యక్షేత్రంలో కలియుగం దైవంగా భాసిల్లే తిరుమలవేంకటేశ్వరుడు తనకు తాను గా వచ్చి అక్కడ దేవేరీతో సహా కొలువై తన భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి భక్తుల కోరిక మేరకు తానే తన్ను సృజియంచుకుంటూ ఎన్నో దివ్యక్షేత్రాల్లో అనేక దివ్యరూపాల్లో వెలసి భక్తుల కోరికను తీరుస్తున్నాడు. ఆ దివ్య క్షేత్రాల్లో ఒకటి ఈ ఉపమాక.

07/30/2018 - 18:47

మానవ జన్మ ఉత్కృష్టమైందని చెబుతాము. అయితే మనిషి జీవించి వుండాలన్నా, ఆరోగ్యంగా వుండాలన్నా ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. జానెడు పొట్టలో భగవంతుడు ఒక విచిత్రమైన ఆకలిని పెట్టిమరీ పుట్టించాడు. ఈ ఆకలి బాధ భరించరానిది. ఆకలిని తీర్చుకోడానికై మానవుడు- ఎన్నో బాధలు భరించాల్సి వస్తోంది. అయితే అనాదికాలంగా భారతీయులు తాము ఆర్జించుకోవడమేగాక, తోటి వారిని కూడా ఆదుకోవటం ఒక గొప్ప సంస్కారంగా నిలిచిపోయింది.

07/29/2018 - 22:19

అరుణాచలం అరుణాచలం నిత్యమూ స్మరించినా శివసాయుజ్యాన్ని లభింపచేసేది అరుణాచలం. అరుణాచలాన్ని దర్శించినా స్మరించినా ఇంతటి పుణ్యం రావడానికి కారణం అక్కడ నివసించిన రమణులే. రమణులు అంటే వేంకట రమణ.

07/27/2018 - 20:53

సామెతలు -18:21 - ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగల వాడగును. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడ చూడుడి అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును.

07/26/2018 - 19:01

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః
మహాభారతం అనే తైలముతో జ్ఞానదీపమును వెలిగించి విప్పారిన నేత్రములతో, విశాల హృదయంతో విరాజిల్లు, మనోహర రూప సౌందర్యంతో తనరారే మహాజ్ఞానియైన వ్యాసమునీంద్రులకు నమస్సులు.

07/25/2018 - 18:37

భగవంతునికి రూపం లేదు. ఆకారమూ లేదు. కాని భక్తుడు కోరుకున్న విధంగా ఆ భగవంతుడు వ్యక్తమవుతాడు. భగవంతుని పూజించే అసలైన భక్తులు కులమతాలకు అంత విలువ ఇవ్వకపోవడానికి కారణం అదే.
ఒకసారి ముస్లిములు భారతదేశాన్ని ఏలే సమయంలో ఢిల్లీ నవాబు కుమార్తె శ్రీరంగంలోని భగవంతుడిని చూసి ఆయనపై భక్తిని పెంచుకుందట. మెల్లమెల్లగా ఆ భగవంతుడే అన్నింటికీ పెన్నిధి అనుకొన్నదా చిన్నది.

07/24/2018 - 18:30

శ్రీ వేంకటేశ్వరుని వేడుకుంటూ ఆదినుంచీ ఆశ్రయించిన భక్తాగ్రగణ్యుడు, సంక్తీర్తనాచార్యుడు అన్నమయ్య. తాళ్ళపాక కవులన్నా, శ్రీ వేంకటేశుని భక్తులన్నా అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అన్నమయ్యే. తను రచించి గానం చేసిన 32వేల సంకీర్తనల్లో పద సాహిత్యం పరవళ్ళు త్రొక్కింది. సగుణ భక్తికి నీరాజనాలనందించి, సామ్రాజ్యాధిపతిని చేసింది. తరతరాలకు తరగని పెన్నిధిగా నిల్చింది.

07/23/2018 - 18:41

అష్టాదశ పురాణాలలోని బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమున్నది. దీనిని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వివరించాడు. లలితాదేవి వైభవాన్ని పలు విధాలుగా ప్రస్తుతించారు. త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి- పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక పేర్లతో ప్రార్థనలందుకుంటున్న శ్రీ లలితాదేవి అఖిలాండకోటికి జనని. జీవకోటికి మాతృదేవత. సృష్టికి మూలమైన ఆమె అయోనిజ. స్వతంత్రాధికారిణి.

07/22/2018 - 21:07

అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం గురించి వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం చెబుతుంది.

Pages