S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/10/2018 - 21:16

భారతీయ ప్రాచీన సంస్కృతికి, హైందవ సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రైమూర్త్య నిలయమై, వరదాయినియై, భక్తి ముక్తి ప్రదాయినియై, పరమ పావనియైన పవిత్ర గోదావరినదీ తీరాన వెలసి, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుని, హిందూ ముస్లిం మత సామరస్యానికి అనాదిగా ప్రతీకగా, దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా రాష్ట్రంలో వాసికెక్క

05/14/2018 - 21:06

‘మన జన్మను మనమే ఎన్నుకుని వచ్చాం’! మన జీవితాలకు మనమే బాధ్యులం. మరెవ్వరూ కాదు. మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూమిమీదకు వచ్చాం- మన తల్లిదండ్రులవల్ల రాలేదు. ఎవరి జీవన ప్రణాళికలు వారివే. అయితే కుటుంబ నేపథ్యంలో ‘తల్లి - తండ్రి- మిగిలిన కుటుంబ సభ్యులు- భార్య- భర్త- పిల్లలు’- ఈ బాధ్యతలు ఉంటాయి, అంతే! అదే జీవితం కాదు.

05/10/2018 - 21:20

రాజ్యఫాలకుడైన చక్రవర్తికి అనారోగ్యం ఎక్కువైంది. ప్రజలను కన్నతండ్రిలా పాలించే రాజుగారు మరణశయ్యపై ఉన్నారన్న వార్తతో ప్రజలు దుఃఖిస్తున్నారు. చక్రవర్తిపై అత్యంత అభిమానం, గౌరవం గల మంత్రి, ఎలాగైనా చక్రవర్తిని బ్రతికించుకోవాలనే ఆశతో దేశ, విదేశాలనుండి గొప్ప గొప్ప వైద్యులను పిలిపించాడు. అందరూ చేతులెత్తేశారు. ‘రోజులు మాత్రమే గడుస్తాయన్నారు’.

05/01/2018 - 21:08

అజ్ఞానం వధలిపెట్టినవాళ్లు జ్ఞానులు అవుతారు. మూఢత్వం వదలివేసి పరమాత్మవైపు అడుగులు వేసేవారు ‘ముముక్షువు’లు అవుతారు. ఆశ, మోహం, భౌతిక సుఖాభిలాష, అహంకారం- ఇవన్నీ మోక్ష సాధనకు ప్రతిబంధకాలు. ఉదాహరణకు పైవాటిలో ‘ఆశ’నే తీసుకుందాం. ఆశ మనిషికి స్వార్థబుద్ధిని కలిగిస్తుంది. స్వార్థం చివరకు ‘నాది’ అనే అహంకారం రూపంలోకి మారుతుంది. నాది, నేను అన్న చోట భగవంతుడికి స్థానం లేదు.

04/30/2018 - 21:40

‘‘ఏమంఢీ! నీ కొడుకు నా కొడుకు కలిసి మన కొడుకును కొడుతున్నారు’’- ఇది పాశ్చాత్యులను ఉద్దేశించి ఏర్పడ్డ హాస్య సన్నివేశం. నిజమే! వాళ్ళ దేశాల్లో ఒక స్ర్తి తన భాగస్వామితో ఏడు ఏళ్లు కలిసి ఉండదు. ఓ పురుషుడు తన భాగస్వామితో ఏడు ఏళ్లు కలిసి సహజీవనం చేయడు. ఎవ్వరూ ఏడేళ్ళు ఓ చోట స్థిరంగా ఉండరు. ఎవ్వరూ ఏడేళ్ళు ఓ ఉద్యోగం చేయరు. భార్యాభర్తలు అని వారు పిలుచుకోవడంకన్నా ‘భాగస్వామి’ అనే పిలుచుకొంటారు.

04/29/2018 - 22:38

వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఏ తిథినాడు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం కల్గుతుందనే విశేషాల గురించి భూదేవికి వివరించాడు.

04/26/2018 - 23:42

‘‘మనం క్రొత్తగా ఏ శక్తినీ సృష్టించలేము. కాని దిశానిర్దేశం చేయగలం. మన ఆధీనంలోని మహత్తర శక్తులను నియంత్రించడం నేర్చుకోవాలి. సంకల్ప శక్తితో వాటిని తుచ్ఛమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి’’ అంటారు స్వామి వివేకానంద.

04/25/2018 - 21:12

ఫ్రస్థానత్రయంలాగానే త్రైతభావంలో దేవుడు- జీవుడు- ప్రకృతి ప్రధానమైనవి. పరమాత్మ సమస్త సృష్టికి మూలస్వరూపం. ఆయన నిరాకారుడు. నిరంజనుడు, సర్వవ్యాపకుడు, దేవాధిదేవుడు- ఆయనే పరబ్రహ్మ- పరమాత్మ.

04/24/2018 - 21:20

భగవంతుడంటే ఒక విశ్వాసం- ఒక ధైర్యం- ఒక ఆలంబన- ఒక పునాది- ఒక ఓదార్పు- ఒక ప్రేమ- ఒక స్నేహం- ఒక ధర్మం- ఒక సత్యం! భగవంతుడంటే అంతర్గత శక్తి- ఆత్మస్థితి! దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆయనకు ఏ అభ్యంతరం లేదు. సర్వసాక్షి! కృష్ణుడు - యెహోవా- అల్లాహ్ అంతా ఒకటే!
మన ప్రత్యక్ష దైవాలు ఏడు! కదిలే దైవాలు మూడు!

04/22/2018 - 21:54

భక్తి అనేది ‘భజ్’ అనే ధాతువునుండి పుట్టింది. భజ్ అంటే సేవాయాం అన్నారు. సేవించడం భక్తి అన్నమాట. అది ప్రేమగా మారి పరిపూర్ణమయ్యింది. ధనంపై ప్రేమ ఉంటే ‘లోభము’ అని, స్ర్తిలపై ప్రేమ వుంటే ‘మోహం’ అని, మనకంటే చిన్నలపై ప్రేమ ఉంటే ‘వాత్సల్యం’ అని, పెద్దలపై ప్రేమ వుంటే ‘గౌరవ’మని, భగవంతునిపై గల ప్రేమ ‘్భక్తి’ అని పెద్దలు చెప్పడం జరిగింది.

Pages