S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/25/2018 - 18:37

భగవంతునికి రూపం లేదు. ఆకారమూ లేదు. కాని భక్తుడు కోరుకున్న విధంగా ఆ భగవంతుడు వ్యక్తమవుతాడు. భగవంతుని పూజించే అసలైన భక్తులు కులమతాలకు అంత విలువ ఇవ్వకపోవడానికి కారణం అదే.
ఒకసారి ముస్లిములు భారతదేశాన్ని ఏలే సమయంలో ఢిల్లీ నవాబు కుమార్తె శ్రీరంగంలోని భగవంతుడిని చూసి ఆయనపై భక్తిని పెంచుకుందట. మెల్లమెల్లగా ఆ భగవంతుడే అన్నింటికీ పెన్నిధి అనుకొన్నదా చిన్నది.

07/24/2018 - 18:30

శ్రీ వేంకటేశ్వరుని వేడుకుంటూ ఆదినుంచీ ఆశ్రయించిన భక్తాగ్రగణ్యుడు, సంక్తీర్తనాచార్యుడు అన్నమయ్య. తాళ్ళపాక కవులన్నా, శ్రీ వేంకటేశుని భక్తులన్నా అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అన్నమయ్యే. తను రచించి గానం చేసిన 32వేల సంకీర్తనల్లో పద సాహిత్యం పరవళ్ళు త్రొక్కింది. సగుణ భక్తికి నీరాజనాలనందించి, సామ్రాజ్యాధిపతిని చేసింది. తరతరాలకు తరగని పెన్నిధిగా నిల్చింది.

07/23/2018 - 18:41

అష్టాదశ పురాణాలలోని బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమున్నది. దీనిని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వివరించాడు. లలితాదేవి వైభవాన్ని పలు విధాలుగా ప్రస్తుతించారు. త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి- పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక పేర్లతో ప్రార్థనలందుకుంటున్న శ్రీ లలితాదేవి అఖిలాండకోటికి జనని. జీవకోటికి మాతృదేవత. సృష్టికి మూలమైన ఆమె అయోనిజ. స్వతంత్రాధికారిణి.

07/22/2018 - 21:07

అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం గురించి వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం చెబుతుంది.

07/20/2018 - 18:49

సామెతలు -19:5 - ‘అబద్ధములాడువాడు తప్పించుకొనడు’

07/19/2018 - 19:05

అమ్మలగన్న అమ్మ ఆషాఢమాసంలో ప్రతివీధిలోను ప్రతి గ్రామంలోను కొలువై తన కన్న బిడ్డలతో పూజలందుకొంటుంది. ఆ పూజలందుకోవడంలో ఆతల్లి ఆనందిస్తుంది. తన బిడ్డలకు సంతోషాన్నిస్తుంది. ఆ తల్లికి పూజలందించుకునే పండుగే తెలంగాణలో బోనాలుగా ప్రసిద్ది చెందింది.

07/18/2018 - 19:33

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఎల్లెడలా అమ్మఆరాధనలు కనులపండుగగా కనిపిస్తాయ. అందులోను తెలంగాణ లో అమ్మ ఆరాధనలు జాతర్లుగాను, ఉత్తససాలుగా మరింత వేడుకగా జరుగుతుంటాయ. ఆషాఢమాసం ఆదివారం నాడు ఏ తల్లి దేవాలయం చూసినా బోనాలెత్తుకు వచ్చే ఆడపడచ లు వారి వెంట పోతురాజులు, వారి వెంట ఫలహారపు పండ్లు తండోపతండాలుగా వస్తుంటాయ.

07/17/2018 - 18:49

మహాభారతంలో కౌరవ పక్షాన వున్నవారిలో ఎందరో విజ్ఞులున్నారు. అట్టివారిలో మనం ప్రత్యేకంగా పేర్కొనదగిన ఒక పాత్ర సంజయుడి పాత్ర. సమ్యక్ యోజుయతీతి సంజయః అని సంస్కృత వ్యాఖ్యానం. అనగా చక్కగాఆలోచన చేయగల సమర్థుడు, సమయోచిత బుద్ధికలవాడని అర్థం. భారతంలోని సంజయుడు అన్ని విధాలా సార్థక నామధేయుడు.

07/15/2018 - 22:03

విశ్వశాంతికి ప్రపంచంలోని మహానుభావులు నిరంతరం కృషి చేస్తున్నారు. సమాజం శాంతియుతంగా ఉంటే ప్రజల జీవనం సాఫీగా కొనసాగుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల ప్రజలైనా, పేదరికంతో ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనీస్తాన్ లాంటి దేశాల్లోని ప్రజలైనా ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించేందుకే ఇష్టపడతారు.

07/09/2018 - 22:01

భారతీయ సాంప్రదాయంలో ఉదయాన్ని నిద్రలేవగానే మున్ముందుగా భూమాతకు వందన మాచరించి, కన్నతల్లి పాదాలకు నమస్కరించి, గోశాలలో ఉన్న గోమాత పృష్ఠ భాగాన్ని కనులకద్దుకుని భక్తిని ప్రకటించడం విధిగా పేర్కొనడం జరిగింది. పలు పుణ్యక్షేత్రాల్లో సుప్రభాత సేవా కాలంలో గోమాతను స్వామివారి సన్నిధిలోనుంచిన తరువాతనే తలుపులు తీస్తారు. అంటే భగవంతునికే భగవత్స్వరూపం గోమాత.

Pages