S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/25/2019 - 22:12

అపుడు చైతన్య స్వరూపుడగు భగవంతుడు చైతన్యమునకే సాక్షాత్కరించును.
సమాధి సంజనితమైన విజ్ఞానము
927. సమస్త ప్రకృతినుండియు వేఱుపఱిచి ఆత్మను దెలిసికొనుటయే జ్ఞానము. విచారముచే ప్రకృతిని తొలగించుటచే సమాధిస్థితి లభించును; అపుడు ఆత్మసాక్షాత్కారమగును.

06/25/2019 - 21:52

సమాధి తత్త్వము
921. పిట్ట తన గూడు ధ్వస్తమైనప్పుడు ఆకాశమున కెగిరిపోవును. అట్లే శరీర స్ఫురణము బాహ్య ప్రపంచ స్ఫురణము నశించినంతనే జీవాత్మ పరమాత్మాకాశమున కెగిరిపోయి సమాధి స్థితియందు లయముగాంచును.

06/23/2019 - 22:15

920. జ్ఞానాజ్ఞానములకు అతీతుడవుకమ్ము. అనేకత్వము యొక్క స్ఫురణయే అజ్ఞానము,- అనగా ఏకత్వమును గ్రహింపక- అద్వితీయ బ్రహ్మము నెఱుగక- భిన్నత్వమును జూచుటయే అజ్ఞానము. ‘నేను విద్యావంతుడ’నను నహంకారము అజ్ఞానమువలన గలుగును. భగవంతుడు సర్వాంతర్యామియను ఎఱుక, అట్టి నిశ్చయము,- అనేకత్వమునం దేకత్వము కలదను వాస్తవదృష్టి- ఐక్యజ్ఞానమనబడును. భగవంతుని చక్కగా దెలిపికొనుటయే విజ్ఞానము.

06/21/2019 - 19:41

911. సగుణబ్రహ్మసాక్షాత్కారము తఱచు దివ్యరూపమున గలుగును. ఆ దివ్యరూపము వినిర్మల హృదయులకు మాత్రమే గోచరించును. అనగా ఆ రూపములు ఈశ్వరుడు ప్రసాదించు భాగవత తనువునకు సంబంధించిన దివ్యేంద్రియులకు మాత్రమే గోచరించును. కావున ఈ దివ్యరూపములను సిద్ధపురుషుడే చూడగల్గును.

06/20/2019 - 19:18

అందుచే మనస్సు ఆహార నిద్రాదికములగు సామాన్య పశుధర్మములతో సంతుష్టినొందుచుండును. కాని యది హృదయమున కెదురుగా నుండు ననాహతమును జేరినంతనే మానవునకు దివ్యజ్యోతి యొక్క దర్శనము గలుగును. ఐనను ఈ స్థితినుండి సాధకుడు తఱచు పతనము చెంది దిగువ (మూడు) చక్రముల వ్యాపారములలో బడుచుండును. కాని హృదయమున కెదురుగా నుండు విశుద్ధచక్రమును జేరునపుడిక సాధకుడు భగవదన్య విషయములను గూర్చి మాటలాడజాలడు.

06/19/2019 - 18:24

ఇక నా స్వాధీనత తప్పిపోవును. కుండలిని కంఠమును దాటి వెడలునప్పుడు నాకుగలుగు ననుభవమును మీకు దెలుపవలయునని నిశ్చయించుకొందునుగనే చెంగువ మనస్సు (శిరస్సువైపునకు) పైకి పోవును- ఇక నంతటితోసరి!’’ గురదేవుడనేక పర్యాయములు ఈ స్థితిని వర్ణింపబ్రయత్నించెను, కాని యెన్నడును కృతార్థుడు కాలేదు.

06/18/2019 - 18:27

దేవుడే దొంగను పోయి దొంగతనము చేయుమని ప్రేరేపించును; మరియు దొంగనుగూర్చి జాగ్రతపడుమని గృహస్థుని ఆతడే హెచ్చరించును. సర్వమునకు ఆతడే కర్త.
పదునెనిమిదవ ప్రకరణము
బ్రహ్మసాక్షాత్కారము
మనస్తత్త్వము: బ్రహ్మసాక్షాత్కారము

06/17/2019 - 22:37

సర్వవస్తువులును నారాయణుని వివిధ రూపములు, వాని యనంత విభూతులు.
892. భగవానుడిట్లనును: ‘‘కాటువేయు పాము నేనే. విషము తొలగించు మాంత్రికుడను నేనే; శిక్షల విధించు దండనాధికారిని నేనే, ఆ శిక్షలను నెఱపు కింకరుడను నేనే.’’.

06/17/2019 - 22:36

సాకారదైవము ఘనీభవించిన సచ్చిదానంద రసమని చెప్పవచ్చును. జలాంతర్భూతమగు మంచుగడ్డ జలమున నిలిచియుండి పిమ్మట దానిలో కరగిపోవునటుల నిర్గుణ బ్రహ్మాంతర్భూతమగు సాకారదైవము బ్రహ్మమునుండియే వెలువడి, అందు నెలకొని యుండి, మఱల అందే లీనమై, అదృశ్యమైపోవును.

06/13/2019 - 18:34

ఇదియంతయు గనిపట్టుచుండిన యొకడు రంజకుని యొద్దకు వచ్చి యిట్లనెను: ‘‘మిత్రుడా, నాకేరంగునందును ప్రీతి లేదు. నీయభిరుచిని దెలిసికొని నాబట్టకు నీ యిచ్చవచ్చిన రంగు వేయించుకొనుటయే నాయభీష్టము’’. భక్తుని యభీష్టము నుసరించి సాకారుడుగా గాని, నిరాకారుడుగా గాని భగవానుడు వానికి సాక్షాత్కరించును.

Pages