S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/26/2019 - 19:32

భవిష్యత్తు బీజం లాంటిది. అందుకే అది ఎప్పుడూ వర్తమానాన్ని కలుసుకునేందుకు ముందుకు వస్తూనే ఉంటుంది. కాబట్టి, మీరు ఎప్పుడూ కదలుతూనే ఉంటారు. భవిష్యత్తులోకి అడుగుపెట్టడమే వర్తమానమంటే. మీరు ఎప్పుడో వర్తమానంలోకి అడుగుపెట్టారు. అది ఎప్పుడూ భవిష్యత్తులోకి వెళ్తూనే ఉంటుంది. ప్రపంచంలో అందరూ నిజాయితీగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే, అది చక్కని ఆనందాన్ని, పరమానందాన్ని ఇస్తుంది.

02/25/2019 - 19:34

నిర్భయత్వం ఉన్న మనిషి తనను చూసి ఇతరులు భయపడేలా ప్రవర్తించడు. ఎందుకంటే, అతని దగ్గర భయం అనేది ఏమాత్రం ఉండదు.
హృదయ మార్గం:

02/24/2019 - 19:45

చక్రవర్తి ఆజ్ఞానుసారం అనే్వషిస్తున్న సైనికులకు నదీ తీరంలో దిగంబరంగా కనిపించాడు. ‘డేండమిస్’. వెంటనే సైనికులు ఆయనతో ‘‘మాతోపాటు మా దేశానికి రమ్మని మిమ్మల్ని అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఆహ్వానిస్తున్నారు. మీకు కావలసిన సదుపాయాలన్నీ మేము ఏర్పాటుచేస్తాము. మీరు మా రాజ అతిధి’’ అన్నారు.

02/22/2019 - 20:30

మహా అయితే, ఆ గడ్డి మొక్కలకు అంటుకుని ఉన్న మురికిని తుఫాను చక్కగా కడుగుతుంది. తుఫాను ముగిసిన వెంటనే ఆ గడ్డి మొక్కలు మళ్ళీ తలలు పైకెత్తి గాలిలో నాట్యంచేస్తాయి.

02/21/2019 - 19:18

కేవలం భయం లేనంతమాత్రాన ధైర్యమున్నట్లు కాదు. ఎన్ని భయాలున్నప్పటికీ తెలియని దానిలోకి చొచ్చుకుపోవడమే ధైర్యమంటే. మీరు మరింత ధైర్యవంతులవుతున్నకొద్దీ నిర్భయత్వం మీలో చోటుచేసుకుంటుంది. అదే ధైర్యంయొక్క అంతిమ అనుభవం. అదే దాని సుగంధం. ధైర్యమున్న వ్యక్తికి, పిరికివాడికి మధ్య పెద్ద తేడా ఏమీలేదు. ఇద్దరికీ భయాలుంటాయి. కానీ, పిరికివాడు తన భయాలకు తగినట్లు ప్రవర్తిస్తాడు.

02/20/2019 - 19:25

తండ్రివలన గలుగునది మొదటి జన్మము. ఉపనయనముచే నేర్పడునది ద్వితీయ జన్మము. సన్న్యాసమో మూడవ జన్మము.

02/19/2019 - 19:18

ఒకసారి నారదునికి శివపార్వతు లను చూడాలనిపించింది. కైలాసం బయలుదేరి చేతిలో ఏదైనా పండు ఉంటే బాగుంటుందనుకొని ఓ జ్ఞాన ఫలాన్ని తీసుకొని వెళ్లి కైలాసంలో శివపార్వతులను దర్శనం చేసుకొని శివుని చేతిలో ఆ జ్ఞాన ఫలాన్ని నారదుడు పెట్టాడు. నారదుడు ఇచ్చిన పండును బంగారు వనె్నతో మెరిసిపోతుంటే చూసి శివుడు తన అర్ధ్భాగమైన పార్వతీదేవికి ఎంతో ప్రీతిపాత్రంగా ఇచ్చాడు.

02/18/2019 - 18:21

అడుగడుగునా ఆలయాలకు ఆలవాలమై ఆధ్యాత్మికత వెల్లివిరిసే పుణ్యభూమి, ధన్యభూమి భరతభూమి. ఈ గడ్డపై వెలసిన హిమాలయాలు మహిమాలయాలు, మానస సరోవరాలు, కైలాసగిరులు, వేదాల సిరులు జనజీవనాన్ని ముక్తిమార్గంవైపు నడిపించే అరుదైన ఇంధనాలు, సాధనాలు. కనిపించని దేవతలు దేవుళ్లు లోకహితం, పారమార్థిక చింతనకోసం అవసరమైన దిశానిర్దేశం చేస్తారని భక్తజనం ప్రగాఢ నమ్మకం. దైవం మానుష రూపేణా అన్నది ఎంత నిజమో..

02/17/2019 - 22:02

దాగుడుమూతలాట యందు ఆటకాడు తల్లిని తాకిన యెడల, తఱుముకొని వచ్చువాడు వీనిని దొంగను జేయజాలడు. అట్లే మనము ఒక్కసారి భగవంతుని సాక్షాత్కారమును బొందితిమా, సంసార బంధములు ఇక మనలను బంధింపజాలవు. తల్లిని తాకిన ఆటకాడు ఇతరులు తనను తఱిమి దొంగనుజేయుదురను భయము లేశమును లేకుండ తన యిచ్చ వచ్చినటుల తిరుగాడు చందమున ఒక్కసారి భగవంతుని పాదపద్మములను స్పృశించినవాడు ఈ లోకమను క్రీడారంగమున నిర్భయుడై సంచరింపగలడు.

02/14/2019 - 19:38

జనక చక్రవర్తి యటువంటివాడు. ఆతడు రాజర్షి. కాని ఆకస్మికముగా జనకుని వంటివారగుట పొసగదు. జనక మహారాజు లోక వ్యవహార కల్లోలమునకు దూరముగా, ఏకాంతవాసము చేయుచు, భక్తిసాధనలను ఎన్నో సంవత్సరములు సాగించియుండెను. కావున గృహస్థులు అప్పుడప్పుడు ఏకాంతవాసము చేయుచు, ఒక్కొక్కసారి మూడేసి దినములైనను అటులుండుచు, భగవత్సాక్షాత్కారమును పొందునిమిత్తము సాధనలుచేయుట మిగుల శ్రేయస్కరము.

Pages