S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/09/2019 - 19:25

పాపభారముచే క్రుంగియున్న జనసమూహములను వారు భగవత్సన్నిధానమునకు గొనిపోగల్గుదురు.
725. సాధారణ ఋతువులందు నూతి నీరు ఎంతయో కష్టముమీద గాని చేచిక్కదు; వానకాలమున వఱదలు వచ్చినప్పుడో, శ్రమలేకయే ఎక్కడ పట్టిన అక్కడ నీరు లభించును. అటులనే సాధారణముగా భగవంతుడు జనులెంతయో శ్రమపడి జపతపముల నొనర్చిన పిమ్మట కాని ప్రత్యక్షముకాడు. కాని లోకములోనికి అవతారమను వఱద వచ్చునపుడు భగవానుడెల్లడలను దర్శనీయుడగును.

05/08/2019 - 19:42

ధైర్యమున్న వ్యక్తులు ఏ మాత్రం ఆలోచించకుండా ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. వారి జీవిత పరమార్థం హిమాలయ పర్వతాలు ఎక్కడం, అంతరంగ శిఖరాలు అధిరోహించడం, గాలిపటంలా గాలిలో ఎగరడం, సముద్ర కెరటాలపై, అంతరంగ తరంగాలపై విహరించడం కోసమే కానీ, బీమా సంస్థల కోసం కాదు.

05/07/2019 - 19:32

సచ్చిదానందబ్రహ్మ శక్తివెలువడి (అవతారమూర్తియను) ఒక కాలువగుండా వ్యక్తమగుచున్నదని చెప్పవచ్చును. అవతారమూర్తుల నందఱును గ్రహింపజాలరు. అత్రి, కశ్యపుడు, భరద్వాజుడు మొదలగు సప్తర్షులు మాత్రమే శ్రీరామచంద్రమూర్తిని అవతార పురుషుడని గ్రహింపగల్గిరి. నిజమైన భక్తిజ్ఞానములను మానవకోటికి బోధించుటకై నర రూపమున భగవంతుడవతరించుచుండును. ముక్తులకును అవతార మూర్తులకును గల భేదము

05/06/2019 - 19:00

713. బూరుగచెట్టు విత్తనములు దానిక్రింద బడవు. అవి గాలిలో కొట్టుకొనిపోయి ఎక్కడనోపడి మొలచును. అటులనే మహాత్ముని బోధలు వాని స్వస్థానమునగాక, దూర దేశమున వ్యక్తమై ప్రకాశించును; దూర దేశీయులే వానిని కీర్తింతురు.

05/05/2019 - 23:17

అటులనే ప్రపంచముననే భాగముననైనను ధర్మహాని సంభవించునేని, ధర్మ రక్షణార్థము భగవంతుడు తన యవతారమును బంపును.

05/02/2019 - 19:27

పుస్తకములో గల జ్ఞానమునంతటినిమించు దివ్యజ్ఞానము- సాక్షాత్కార రూపమగు తత్త్వ జ్ఞాన సంపద వానికడ అపారముగా అనంతముగా వెలయుచుండును.
700. తన గురుని నడవడిని గూర్చి యొకడు తర్కించుచుండ శ్రీగురుదేవుడిట్లు పల్లెను: ‘‘ఓరుూ! నిరర్థక చర్చతో ఎందులకు కాలయాపన చేసెదవు? ముత్యమును గైకొని చిప్పల నావల బారవేయుము. గురునియోద్ద మానవ సహజములగు లోపముల నెంచబోక, అతడు నీకుపదేశించిన మంత్రమును జపింపుము, పొమ్ము!’’

05/01/2019 - 19:39

( గురుని ఆవశ్యకత)

04/30/2019 - 18:49

‘‘నేను కర్తను’’అని భావించువానికి భగవవంతుడు ప్రసన్నుడు కాడు.
687. తనకు ఎపుడు కృపగలుగునో అపుడే భగవంతుడు సాక్షాత్కరించును. ఆతడు పరంజ్యోతి, జ్ఞానభాస్కరుడు. వాని కిరణమొక్కటి ప్రసరించి లోకమునకంతకును ధీశక్తినొసగుచున్నది. తన్మూలముననే మనము ఒండొరులను దెలిసికొనగలుగుచున్నాము. బహువిధములైన జ్ఞానమును బొందగలుగుచున్నాము. తన దివ్య తేజమును తనపై బ్రసరింపజేసికొనునప్పుడే మనము వానిని గాంచగల్గుదుము.

04/29/2019 - 22:58

ధ్యానం చేస్తున్నప్పుడు మీలోని జీవం మెల్లమెల్లగా నూతన నాణ్యతతో కూడిన సౌందర్యాన్ని, తెలివితేటలను సంతరించుకుంటున్నట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది మీలో ఎదుగుతున్నదే తప్ప, ఇతరులనుంచి ఎరువుతెచ్చుకున్నది కాదు. ఎందుకంటే, దాని మూలాలు మీ ఉనికిలోనే ఉన్నాయి. మీరు పిరికివారు కాకపోతే కచ్చితంగా అది మీలో పుష్పించి, ఫలిస్తుంది.

04/29/2019 - 22:44

రెండురోజుల విశ్రాంతికోసం వారంలో అయిదు రోజులు చాలాకష్టపడి పనిచేస్తారు. కానీ, ఆ రెండురోజులంత దరిద్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అనేక రోడ్డుప్రమాదాలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలు ఆ రెండురోజుల్లోనే చాలా ఎక్కువగా జరుగుతాయి. కానీ, అయిదురోజుల పని దినాలలో ఇలాంటివి జరగకపోవడం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే, అందరూ ఏదోఒక పనిలో నిమగ్నమై ఉంటారు.

Pages