S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/26/2019 - 19:50

ఎందుకంటే, ఎలాంటి ఆలంబన లేకుండా నకిలీ గుర్తింపు ఒంటరిగా ఉండలేదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. ఎందుకంటే, అనేక సంవత్సరాలుగా మీరు ఒక రకమైన గుర్తింపుతో అనేక గుంపుల్లో జీవించారు. అందువల్ల ఒంటరిగా ఉన్న మరుక్షణం మీ గుర్తింపు మీరుకాదని మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మీరు చాలా భయపడతారు. ఇంతకీ మీరెవరు? అనేక సంవత్సరాల అణచివేతకు మీరు గురయ్యారు.

04/25/2019 - 22:52

మీరు ఎవరినైనా ద్వేషించినప్పుడు మీ అహానికి ఏదో సంతృప్తిలభిస్తుంది. కాబట్టి, కేవలం ద్వేషంలో మాత్రమే అహం జీవిస్తుంది. ఎందుకంటే, ద్వేషించడం ద్వారా మీరు చాలాగొప్పగా, ప్రత్యేకమైన వారుగా గుర్తింపుతెచ్చుకుంటారు. కానీ, ప్రేమలో అహం మరణించక తప్పదు. ఎందుకంటే, ప్రేమలో మీరు ఎప్పుడూ విడిగా ఉండకుండా ఇతరులలో లీనమైపోతారు. అది ఎంతో చక్కని కలయిక. అందుకు ప్రేమ మీకు చాలా సహాయపడుతుంది.

04/24/2019 - 22:54

ఇతర దేశాలను, మతాలను ద్వేషించడం ద్వారా మాత్రమే మీ దేశంపై, మీ చర్చిపై మీకున్న ప్రేమను మీరు తెలుపగలరు. అలా మీరందరూ చాలా గొప్పగా భావిస్తున్న ఈ ప్రపంచంలోని మతాలన్నీ ఒకపక్క చాలా ద్వేషాన్ని రగిలిస్తూనే, ప్రేమ గురించి ఉపన్యాసాలు చెప్తున్నాయి. అందుకే మీరు చాలా గందరగోళంలో పడ్డారు.

04/23/2019 - 19:28

మనిషి ఎవరూ ఒంటరిగా వదలలేదు. శిశువు జన్మించిన వెంటనే పీడించే అణచివేతదారులు రంగంలోకి దిగివాడిని పూర్తిగా నలిపేసి, చాలా వక్రంగా తయారుచేస్తారు. దానితో చాలా కృత్రిమంగా, నకిలీగా జీవిస్తున్న ఆ పసివాడు తానెందుకు జన్మించాడో అందుకు తగినట్లుగా జీవించట్లేదని, తన ఆత్మస్థాయి అది కాదని ఎప్పటికీ తెలుసుకోలేడు. అందుకే అనేక లక్షలమంది ప్రజలు చాలా దీనాతిదీనంగా జీవిస్తున్నారు.

04/22/2019 - 22:35

ఎందుకంటే, మీ ఆత్మను శాసించేందుకు మతాచార్యుడు, మీ శరీరాన్ని శాసించేందుకు రాజకీయ నాయకుడు ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటారు. మీ ప్రేమను నాశనం చెయ్యడమే వారి కుట్రల ఆంతర్యం. అపుడే మనుషులు తిరుగుబాటు తత్వాన్ని కోల్పోయి, స్వతంత్ర వ్యక్తిత్వాన్నిప్రదర్శించే ధైర్యం లేక ఎందుకూ పనికిరాకుండా తయారవుతారు. అప్పుడే మానవాళిపై మతాచార్యులు, రాజకీయ నాయకులు తమ పెత్తనాన్ని, అధికారాన్ని కొనసాగించగలరు.

04/22/2019 - 22:33

కాబట్టి, మనిషి ఉన్నతంగా ఎదిగేందుకు ప్రేమకన్నా సహకరించేది ఏదీలేదు. ప్రేమలోకంలో ఉండేందుకు భయపడేవారు పరిణతి చెందని, పరిపక్వత లేని పసివారిలా ఏమాత్రం ఎదగకుండా అలాగే మిగిలిపోతారు.
ప్రేమ సహజమైనది:

04/19/2019 - 19:39

అలా, అలా మీ మనసు మీకు రోజూ దూరమవుతూ, ఏదో ఒకరోజు పూర్తిగా అదృశ్యమవుతుంది. అప్పుడు మీరు మీ శరీరానికో, మరేదానికో పరిమితమై పోకుండా, నిర్మలమైన సువిశాల విశ్వంగా మారతారు. అలా మారడమే దివ్యత్వాన్ని సంతరించుకోవడమంటే. దానికి మార్గం, మాధ్యమం కేవలం ప్రేమ ఒక్కటే. ఆ దారి చివరిలో దేవుడుంటాడు. నిర్మలమైన, అనంతమైన, సువిశాల విశ్వతత్వమే దేవుడంటే.

04/17/2019 - 20:04

మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే, వారికి మీతోపాటు మీ ఉనికిలో ఎదిగేందుకు అంతులేని స్థానమిస్తారు. వెంటనే మీ మనసు జోక్యం చేసుకుని వారిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రేమ పూర్తిగా నాశనమవుతుంది. ఎందుకంటే, మనసుకు ఆశ చాలా ఎక్కువ. అందుకే అది అత్యంత విష పూరితమైనది.

04/16/2019 - 22:55

ఒకవేళ మీ గురించి అందరికీ పూర్తిగా తెలిసినా మీకొచ్చిన నష్టమేముంది? ఎందుకు మీరు అంతగా భయపడుతున్నారు? అసలు మీకున్న భయమేమిటి? కేవలం సమాజ మందించిన అనేక నిబద్ధీకరణలు, తప్పుడు భావనలవల్ల అందరూ మిమ్మల్ని వ్యతిరేకించే శత్రువులని భావించే మీరు ఎప్పుడూ పోరాడే మనస్తత్వంతో ఉంటూ, మిమ్మల్ని మీరు రక్షించుకునే పనిలో దాక్కోవలసి వస్తోంది.

04/16/2019 - 22:53

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

Pages