S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/14/2019 - 22:46

ఓషో నవజీవన మార్గదర్శకాలు
*
అందుకు మీరు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇచ్చే పట్టాల చీటీలను తగిలించుకున్న తెలివైనవారు కానక్కరలేదు. ఆ చీటీల కళలన్నీ కేవలం ప్రతి దానినీ వర్గీకరించేందుకు మాత్రమే.
అందరినీ కలవండి, అందరిలో కలవండి. ఎందుకంటే, అందరూ ఏదో ఒక రకమైన దివ్యత్వాన్ని ప్రతిబింబించేవారే. దేనికీ భయపడకుండా, అందరి నుంచి అన్ని విషయాలు తెలుసుకోండి.

04/10/2019 - 19:19

అలాగే, ప్రేమ మీలో చోటుచేసుకున్న వెంటనే మీ జీవితానికి పూర్తిస్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు మీరు చాలా హాయిగా, సౌకర్యంగా ఉంటారు. దానితో మీ మానసిక భయాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే, ప్రార్థన దానంతటదే మీలో చోటుచేసుకున్నప్పుడు మీరు విశ్వంతో ఏకమైపోతారు. అప్పుడు అన్ని రకాల భయాలు మీ నుంచి పూర్తిగా అదృశ్యమవుతాయి. చివరికి మీకు మృత్యుభయం కూడా ఉండదు.

04/09/2019 - 19:38

అంతేకానీ, మీరు జీవం లేని ఒక శిలువతో మాట్లాడడం శుద్ధ దండగ. ఎందుకంటే, శిలువకు విశ్వంతో అనుసంధానమున్న వేళ్ళులేవు. అందుకే అది చంపుతుంది. కాబట్టి, సహజమైన భావోద్వేగంతో అప్రయత్నంగా మాట్లాడడాన్ని పిచ్చి అనుకునే సమాజం సంప్రదాయ మర్యాదలు పాటించడాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంది. నిజానికి, మీరు చాలా గుర్తుపెట్టుకుని గుడిలో వల్లించే ప్రార్థన చాలా మూర్ఖమైన పని.

04/08/2019 - 22:33

అందుకే అది సరిగా గుర్తుండట్లేదు. మళ్ళీ చెప్పండి’’ అన్నారు. ఆర్చిబిషప్ మళ్ళీ ప్రార్థన చెప్పాడు. అయినా ఆ ముగ్గురూ ‘‘ప్రార్థన చాలా పెద్దది కదా! దయచేసి మరొకసారి చెప్పండి. ఈసారి దానిని గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తాం’’ అన్నారు.

04/08/2019 - 22:31

ఓషో బోధ
*
ఓషో నవజీవన మార్గదర్శకాలు
*

04/05/2019 - 18:51

‘ఉగాది’ చాంద్రమానం అనుసరించేవారి తొలి పండుగ. దీని తొలిరూపం ‘యుగాది’. కాలగమనంలో ‘ఉగాది’గా మారింది. ఉగాది పర్వాన్ని గురించి భిన్న భిన్న కథనాలున్నాయి. ఆ కథనాలన్నిటా ఒకే ఒక సారూప్యముంది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించినరోజు ‘ఉగాది’ అని నిర్ణయసింధువు అంటే, సృష్టి పూర్తిచేసినరోజు ఉగాది అని ధర్మసింధువు అంటున్నది.

04/04/2019 - 19:38

అలా మీ ప్రేమను నాశనం చెయ్యడం ద్వారా మీరు కుటుంబానికే పరిమితమైపోయి మీ జీవితాన్ని కుటుంబానికి అంకితం చేస్తారు. అప్పుడే ఉమ్మడి కుటుంబాలకు మనుగడ. కాబట్టి, పెళ్ళి సంబంధాలను పెద్దలు నిర్ణయిస్తున్నంత కాలం కుటుంబ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. అయితే పిల్లలు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటే మాత్రం కుటుంబ వ్యవస్థ పూర్తిగా అదృశ్యమవుతుంది. పాశ్చాత్య దేశాలలో ఇదే జరుగుతోంది.

04/03/2019 - 19:35

నా దగ్గరకు వచ్చిన వారందరూ ‘‘నన్ను ప్రేమించట్లేదు’’అన్నవారే కాని, ‘‘నేను ప్రేమించట్లేదు’’అన్నవారు వారిలో ఒక్కరూ లేరు. నిజానికి, ప్రేమ చాలా అందమైనది. అది ఎప్పుడూ ఆనందానే్న ఇస్తుంది. కాబట్టి, మీరు ఇతరుల ప్రేమ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. అప్పుడు మీకు ఆనందం తప్పకుండా దక్కుతుంది.

04/02/2019 - 18:35

ధైర్యమంటే భయంలేనట్లు కాదు. ధైర్యమనేది కేవలం భయాన్ని చక్కగా రక్షించే కవచం మాత్రమే. భయం పోయినప్పుడే మీరు నిర్భయులవుతారు. నిర్భయులు ఎప్పుడూ ఎవరినీ భయపెట్టరు, తమని భయపెట్టేందుకు ఎవరినీ అనుమతించరు.
పరాకాష్టకు చేరుకున్న అత్యంత సన్నిహిత లైంగిక భావప్రాప్తిని పొందిన శరీరం సంపూర్ణత్వాన్ని సంతరించుకుని చక్కని ఆరోగ్యంతో చాలా సుఖంగా, సౌకర్యంగా ఉంటుంది.

04/01/2019 - 19:41

వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు. కావాలంటే, దీపాన్ని ఆర్పి చూడండి, వెంటనే చీకటి వస్తుంది. అంటే, వెలుగుకు ఉనికి ఉన్నట్లు, చీకటికి ఉనికి లేనట్లే కదా! కాబట్టి ఎంత ప్రయత్నించినా మీరు చీకటిని ఉనికిలోకి తీసుకురాలేరు. అందువల్ల దానిని శాశ్వతంగా తొలగించలేరు. చీకటిని ఏం చెయ్యాలన్నా మీకు కచ్చితంగా వెలుగు అవసరమవుతుంది. ఎందుకంటే, అస్తిత్వమున్ను దానితో మాత్రమే మీరు ఏదైనా చెయ్యగలరు.

Pages