S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/06/2019 - 18:59

అంత వానికొక రాగి గని కాన్పించినది. తాను మోయగలిగినంత రాగిని దీసికొని పోయి యంగడిలో విక్రయించి చాల ధనము సంపాదించెను. సాధువు యొక్క ఉపదేశముననుసరించి యాతడంతటితో నాగక, మఱునాడు మఱింత దూరము వనములోనికి బోగా వానికొక వెండి గని గాన్పించినది. తాను మోయగలిగినంత వెండిని దీసికొనిపోయి విక్రయించి యాతడు మఱింత ధనము సంపాదించినాడు.

09/05/2019 - 19:43

మఱునాటి యుదయమున ఫలాని పెద్దమనుష్యుని తోటలోని కొక సాధుపుంగవుడు వచ్చియున్నాడని ఊరెల్ల జెప్పుకొనసాగెను. అందుచే వందల కొలది జనులు ఫలపుష్పాదులతో సాధువును బూజించుటకై యచటికి రాసాగిరి. జనులాతనికి సాష్టాంగ పడుచుండిరి. వెండి బంగారు నాణెము లాసాధువుమ్రోల ధారాపాతముగా బడుచుండెను. అప్పుడాపల్లెవాడిట్లనుకొనసాగెను: ‘‘ఆహా. ఏమి విచిత్రము! నిజముగా నేను సాధువును కాను. ఐనను వీరందఱును నన్నింతగా బూజించు చున్నారు!

09/04/2019 - 19:46

ఒక దేశములో నొకప్పుడు గొప్ప అనావృష్టి బాధ సంభవించినది. వ్యవసాయులందఱును దమ పొలములకు గాలువలు త్రవ్వి నీరు పెట్టుకొనుటకై తీవ్ర ప్రయత్నములు చేయుచుండిరి. వారిలో నొకడు, గట్టి పట్టుదలగలవాడు, తన కాలువ నేటితో గలుపువఱకు నాగకుండ ద్రవ్వనిశ్చయించుకొనెను. స్నానమునకును భోజనమునకును వేళయైనను నాతడు లక్ష్యపెట్టక యదేపనిగా ద్రవ్వుచుండెను. అంత వాని భార్య కొమార్తె చేతికిచ్చి స్నానమునకై నూనె పంపినది.

09/03/2019 - 20:00

ఒక యువతి భిక్ష పెట్టుటకై రాగా నామె స్తనయుగ్మమును జూచి ‘‘నీకేమైన ఱొమ్మున వ్రణములు లేచినవా’’యని ప్రశ్నించినాడు.

08/29/2019 - 19:34

రాజుగారి యుద్యోగులు వచ్చి రాజపుత్త్రికను వివాహము చేసికొనుమని యేసాధువును వేడినను నెవడును నొడంబడడయ్యె. తుదకు వారు సాధువేషముననున్న దొంగకడకు వచ్చి తమ యుద్దేశమును దెలిపిరి. ఈ దొంగ సాధువు వౌనము వహించి యూరకుండెను.

08/28/2019 - 19:07

ఆ సాలె తాను నేసిన వస్తమ్రుల నమ్ముకొనుటకై బజారునకు బోయి, కొనవచ్చిన వారితో నిట్లు పలుకువాడు: ‘రామేచ్ఛ వలన లాభము బేడ; రామేచ్ఛవలన ఈ బట్ట ఖరీదిప్పుడు రూపాయి ఆరణాలు.’’ జనులాతడేమి వెల చెప్పినను వెంటనే యిచ్చి కొనునంతటి విశ్వాస మాతనియందు గలిగి యుండిరి. నిజముగా నాతడు గొప్ప భక్తుడు.

08/27/2019 - 19:31

గడ్డిలోను ప్రాణముండుటవలన నాతడు పచ్చిగానుండు గడ్డినైనను దినసహింపక, యెండి నిర్జీవమైయున్న గడ్డిని మాత్రమే తిని ప్రాణముల నిలుపుకొనుచుండెను- ఐనను ఖడ్గ్ధారియై యున్నాడే! ఈ వైపరీత్యముగాంచి, యర్జునుడు వింతపడి, శ్రీకృష్ణునితో నిట్లు పలికెను: ‘‘ఇదేమి వింత!

08/26/2019 - 20:08

శిష్యులు: అటులైనచో జపతపములు మున్నగు సాధనల యవసరము లేదా? ఏలన, ‘అంతయు నీశ్వరేచ్ఛయే! ఏమి జరిగినను వాని సంకల్పమువలననే జరుగుచున్నది!’అని ప్రతి వ్యక్తియు గాళ్లుచాచుకొని కూర్చుడవచ్చును.

08/25/2019 - 22:17

కృష్ణుడొక చిన్న బాలుని రూపుదాల్చి వచ్చి, ‘‘తమ్ముడా! వచ్చితిని. నీకు నేనుండగా భయమెందుకు? నాతో రమ్ము! నేను నిన్ను బడికి దీసికొనిపోయెదను’’ అనెను. అటులాబాలుని బడిదగ్గఱ విడిచి, ‘‘నీవు నన్ను బిలిచినపుడెల్ల నేను వచ్చెదను, భయపడకుము’’అని కృష్ణుడు అభయమొసగెను.
నిజమైన నమ్మిక యొక్కయు భగవత్పరితాపము యొక్కయు మహిమ ఇట్టిది.
భక్తురాలగు గొల్లత: బ్రాహ్మణుడు

08/23/2019 - 19:33

బాలభక్తుని దేవతార్చన

Pages