S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/28/2019 - 19:10

167. చైతన్య దేవుడు దక్షిణ దేశమున తీర్థయాత్రలు చేయుచు; గీతను జదువునొక పండితుని మ్రోల కన్నీరు గార్చుచు గూరుచుండిన యొక భక్తుని గాంచెను. ఈ భక్తునికి ఓనమాలైనను రావు. గీతలోని ఒక్క శ్లోకముకైనను పండితుడు చేయుచున్న అర్థమేమో గ్రహంచునట్టి స్థితిలో లేడు. కన్నీళ్లు గార్చుచుండుటకు కారణమేమని చైతన్యదేవుడు ప్రశ్నింపగా నాతడిట్లు పలికెను: ‘‘గీతలోని ఒక్క మాట కూడ నాకు తెలియదనుమాట నిజము.

01/28/2019 - 21:59

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము -
అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి
*

01/24/2019 - 19:48

నేడు త్యాగరాజస్వామి వర్థంతి సందర్భంగా....

01/23/2019 - 19:43

153. సమారాధనకు పలువురు ఆహ్వానింపబడినపుడు వారు చేయు గోల విశేషముగా వినవచ్చును. కాని యా గందరగోళము అంతయు వారు భోజనము ఆరంభించునంతవరకే. వడ్డన అయిన భోజనము ప్రారంభించుసరికి శబ్దము ముప్పాతిక పాలు అణిగిపోవును. ఇక బూరెలు వచ్చును- వడ్డన సాగిన కొలది శబ్దము క్షీణించుచుండును. మజ్జిగ దగ్గరకు జర్రుకొను శబ్దముదక్క మరేదియు వినబడదు. భోజనములు అయినంతనే ఇక వారు చేయు పని నిద్రపోవుటయే.

01/22/2019 - 18:51

143.్భగవద్భక్తి పుస్తకములను జదువుటవలన లభించునా? పంచాంగములో ఒకానొక దినమున ఇరువది దుక్కుల వాన కురి1యునని వ్రాయబడియున్నది. కాని యా పంచాంగమును మెలిపెట్టి పిండుటచే ఒక చుక్కయైనను వచ్చునా? అదేవిధమున శాస్తమ్రులలో అనేక సద్వాక్యములు ఉండవచ్చును. కాని వానిని పఠించిన మాత్రమున నెవ్వడును పారమార్థికుడు గాజాలడు. భగవద్భక్తి కలుగవలుయుననిన, నీవా శాస్తమ్రులలో చెప్పబడిన ధర్మములను అనుష్ఠింపవలయును.

01/21/2019 - 18:55

136.శ్రీగురుదేవుడొకప్పుడు తన శిష్యులలో నొకనిని విలాసముగానిట్లు ప్రశ్నించెను. సరే కాని నాకేమైనా శరీరాభిమానమున్నట్లు నీకు తోచుచున్నదా? నాకు అభిమానమేమైనా గలదా?

01/20/2019 - 22:22

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము -
అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి
*

01/17/2019 - 19:11

దాని నుండి దాని వరకూ వృద్ధి క్షయాలుంటాయి. అమ్మవారి స్వరూపమూ అట్టిదే. సాధకుడు అసాధ్య సిద్ధి అయ్యే వరకు అట్టి శ్రద్ధను పొంది ఉండాలి. ఇక్కడ ‘ధ్రువం హి సీతా’ అనే మాటకు ‘ధ్రువా హి సీతా’ అనే అర్థం. కాని ఇంతలో-
దృష్టమంతఃపురం సర్వం దృష్టా రావణ యోషితః
న సీతా దృశ్యతే సాధ్వీ వృధాజాతో మమశ్రమః

01/16/2019 - 18:20

బ్రహ్మ చిరునవ్వుతో పుట్టిన వారు గిట్టక మానరు కదా అన్నాడు.

01/14/2019 - 18:31

అహంకారం చాలా చెడ్డది. అది నిర్మూలము కానిదే ముక్తి లేదు. ఆ లేగదూడను జూడుడు, అహంకారముచే దానికెన్ని యిక్కట్లు వాటిల్లుచున్నవో కనుడు. అది పుట్టిన తోడనే ‘‘హంహై’’ నేనున్నాను’’ అనియరచును. ఫలితమేమి? అది పెద్దదై (ఎద్దై)న యెడల దానిని నాగలికి గట్టుదురు. లేదా బరువులతో నిండినబండ్లకు గట్టుదురు. అవైన యెడల గుంజకు కట్టివేయుదురు. ఒక్కొక్కప్పుడు చంపియు తిందురు.

Pages