S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/13/2019 - 23:14

అటులనే ముక్తపురుషుల చేతినుండి ధనము నిరాటంకముగా నడచిపోవునే కాని వారు ధనమునెన్నడును నిలువజేసికొనరు.
98. ధనమునకు ఎవ్వడు దాసుగాడో, ధనమెవ్వనికి దాస్యము చేయునో, వాడే నిజమైన మానవుడు. ధనమును సరిగా వినియోగించుకొను టెరుగని వానిని మానవుడనదగదు.
అహంకారరూపమగు మాయ

01/11/2019 - 19:17

సాధకుడు భ్రమించి అట్టువైపునకు వెళితే కనబడదు. నిలిస్తే తానే కనబడుతుందది. ఇదీ మాయ- ఇదీ పరీక్ష.
ఎందుకూ ఉంటే- ఆ తల్లి నదసద్రూపధారిణి. కనుక అసత్తును సత్తుగా చూపిస్తూ ఉంటుంది. అసత్తునందు సత్తు అనే భ్రాంతి కలగడానికొంత కారణం ఊహింపబడుతూ ఉంటుంది. కాని అది అసత్యం అని తెలియడానికి కొంతకాలం పడుతుంది. ఈలోపు ఈ జీవి చాలా చేష్టల్ని చేస్తుంది. అంతేకాదు. ఆమె సర్వమోహిని.

01/10/2019 - 19:44

స్వామి చూస్తున్నాడు.
ఆ మంచంపై- కారుమేఘం వంటి శరీరం
అతి ప్రకాశ కల కర్ణ కుండలాలు
ఎఱ్ఱని కళ్ళు రజిత వస్త్రం.
శరీరానికంతకు రక్తచందనపు మైపూత- వీటితో సంధ్యాకాలాన మెరుపుతో కూడిన మేఘంలా ఉందా శరీరం. ఇదీ- నిద్రారావణ స్వరూపం. ఇటువంటి స్వరూపాన్ని స్వామి చూస్తున్నాడు.
నిశ్వసంతం యధానాగం రావణం వానరర్షభః
ఆసాద్య పరమోద్విగ్నః సో‚పాసర్పత్సు భీతవత్.

01/09/2019 - 19:09

ఇదంతా మదస్నేహమట. అందుకనే తెలివి రాగానే ఈ ఏకత భిన్నమవుతుంది.
నతత్రకాచిప్రమదా ప్రసహ్య వీర్యోపపనే్నన గుణేనలబ్ధా
నచాన్య కామాపి నచా న్యపూర్వా వినా
వరార్హం జనకాత్మజాం తాం
ఈ స్ర్తిలలో ఎవరూ-
రావణ వీర్యంచేత బలాత్కారంగా తీసికొని రాబడినవారు కాదు. మరి!
అతని గుణాన్ని వలచి వచ్చిన వారే కాని. రావడానికి ముందు-

01/08/2019 - 19:47

ఇంద్రియాణీంద్రియార్తెస్తు పంచపంచభిరుత్తమైః
తర్పయామాస మాతేవ తదా రావణ పాలితా
స్వర్గో యం దేవలో కోయం ఇంద్రస్యేయం పురీభవేత్
సిద్ధి ర్వేయం వరాహిస్యాదిత్య మన్యత మారుతిః
అన్ని ఇంద్రియాలు ఇంద్రియార్థములన్నిటిచేత ఏక కాలంలో తృప్తిని పొందుతున్నాయట. తల్లి తన సంతానమునకు తృప్తిని కలిగించినట్లు తృప్తిని కలిగిస్తున్నదట.
ఇదీ అనుభవంలో స్వామికి రావణునికి ఉన్న భేదం.

01/07/2019 - 19:40

తత్త్వజ్ఞానము, బ్రహ్మానంద ప్రాప్తి మొదలగునవి మనకు సాధ్యమగుట మాయవలననే. అటులు కానియెడల వీనినన్నిటిని ఎవ్వరు కలనైనను తెలపగలరు? ద్వైతభావమును ఈ దృశ్య ప్రపంచమును మాయనుండియే పుట్టుచున్నవి. మాయకవ్వల భోక్త, భోగ్యము అనునవి లేనే లేవు.

01/06/2019 - 22:25

ఇక ఆతల్లి సొగసెట్లా ఉన్నది-

01/03/2019 - 19:35

45.సరిగా అవసాన కాలమున నరుడేమి చింతించుచుండునో దానిననుసరించియే వానికి ముందు జన్మము గలగుచుండును. కావున భక్తిసాధనలు అత్యావశ్యకమైయున్నవి. నిరంతర సాధనవలన సాంసారిక చింతలు పూర్తిగా పోయి భగవచ్ఛింత మనస్సు నాక్రమించును. అపుడు మరణకాలమున సైతము అది మనస్సును విడువదు.

01/02/2019 - 19:37

36.మూడు బొమ్మలున్నవి- ఓకటి ఉప్పుతో జేసినది, రెండవది గుడ్డతో జేసినది, మూవడది రాతితో జేసినది, ఈ బొమ్మలను నీటిలో ముంచినయెడల మొదటిది కరిగిపోయి రూపనాశనము నొందును;రెండవది చాలనీటిని పీల్చుకొనును, కాని ఆకృతి పోగొట్టుకొనదు;మూడవది నీటడిని తనలో చొరనీయదు. ఆత్మను పరమాత్మలో లయించి ఐక్యమొందిన జీవుడే ఇందు మొదటిబొమ్మ. బ్రహ్మజ్ఞానానందమయుడగుభక్తుడే ఇందలి రెండవ బొమ్మ.

01/01/2019 - 19:55

నీతో యుద్ధము చేయనోపఁ; గవితానిర్మాణశక్తి నిన్నున్
బ్రీతుం చేయగలేను; నీ కొరకుఁ తండ్రిన్ చంపగాఁజాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్తవెరతున్; చీకాకు నాభక్తి, యే
రీతిన్నాకికనిన్నుఁ చూడగలుగున్? శ్రీ కాళహస్తీశ్వరా!

Pages