S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/30/2018 - 23:12

మఱల మఱల మునిగి వెదకులాడినచో తుదకు కష్టము ఫలించును. విశ్వమున దేవుడు కలడు. ఆ దేవుని కనుగొనుటలో నీ తొలి ప్రయత్నము సఫలము కాని యెడల నిరుత్సాహివి కావలదు. దీక్షతో సాధన చేయుము, తుదకు నీకు భగవద్దర్శనము లభించును.

12/27/2018 - 19:55

ఎలుకలను బట్టుటకై పెద్దపెద్ద ధాన్యపుగొట్ల ద్వారములకడ పేలాలతో గూడిన బోనులను బెట్టుదురు. ఎలుకలు పేలాల వాసనచే ఆకర్షింపబడి అంతకంటె తృప్తికరమగు లోపలనున్న ధాన్యమును దినమఱచును. అంతనవి పట్టుపడి వచ్చును. జీవుని విషయము కూడ నిట్టిదే. మహాలౌకిక సుఖములన్నిటికంటెను కోటిరెట్లు ఘనతరమగు బ్రహ్మానందము జీవునకు మిక్కిలి దాపుననే యున్నది.

12/26/2018 - 19:28

మానవుడు తన భావములకును ఆశయములకును అనుగుణమగు ఫలమును బొందుచుండును. భగవంతుడు కల్పతరువు వంటివాడు, ప్రతివాడును తాను కోరునది భగవంతుని వలన బొందగలడు. పేదవాని కుమారుడు కష్టపడి చదువుకొని యెట్లో ఉన్నత న్యాయస్థానమున న్యాయాధిపతియై యిట్లు భావింపవచ్చును.

12/25/2018 - 19:23

వానిని దాటి యవి పోజాలవు. విశిష్టాద్వైతముయొక్క సంపూర్ణావస్థయం దఖండ సచ్చిదానంద వస్తువును తద్బాహ్య రూపమును సమముగా సత్యములని కనుగొనవచ్చును.

12/24/2018 - 19:44

కాని యిందు గూర్పబడిన విషయములు వివిధ సందర్భములో జెప్పబడినవగుటచే సామరస్యమును -ఏకవాక్యతను గూర్చుట కెన్నియుపాముల మేమెంత బ్రయత్నించియున్నను, అదుకులు గాన్పింపక మానవు- కొంతవరకైనను విషయము ఖండ ఖండములుగా దోపకమానదు. బోధనలను క్రమ వికాస మార్గమున బొందుపరచుటకై శ్రద్ధ వహించియున్నను, అందలి ప్రధాన తత్త్వములను ఇట సంగ్రహముగా దెల్లినచో, పాఠక జన సామాన్యమునకు విశేష ప్రయోజనకరమగునని మా ఆశయము.

12/23/2018 - 22:47

1884వ సంవత్సరము నాటికే యాతని యన్వర్థనామము కలకలత్తా నగరమందందంటను వ్యాపింప, నాతనియునికి జన సమూహముల నాకర్షింపసాగెను. ప్రాణాపాయకరమగు స్థితిలోనున్నను, వైద్యులును శిష్యులు నెంత వలదనినను, అఖండ విశ్వమానవ ప్రేమచే నాతడు తన యంత్యదిన పర్యంతము జన సమూహములకు బోధించుచునే యుండెను. ‘‘ఈ శరీర మేమైననేమి? ఒక్క జీవికి సాయమొనర్పగలిగినచో, వేయి పర్యాయములు కుక్కనై పుట్టుటకైన సంసిద్ధుడను’’ అని యాతడు ప్రకటించెను.

12/20/2018 - 19:07

ఐనను కఠిన పరీక్షలకు దాళనిదే శిష్యులనాతడు స్వీకరించు వాడు కాడు. తన శిష్యులు లోకాదర్శపురుషులై వెలయుటమే శ్రీరామకృష్ణుని ప్రధానాశయము. శిష్యుల శారీర లక్షణములను ప్రవర్తనమును బరీక్షించుటలో నాతడఖండ నిపుణుడు. అజాగరూకులైయున్న తఱి వారల జీవిత చర్యలను అతిజాగరూకతతో బరిశీలించును; ప్రశ్నలు వైచి వారిమనోభావములను గమనించును; తన బోధలచే, వర్తనముచే, ఆదర్శములచే, వారియందు గలుగు మార్పులెట్టివో గుర్తించును.

12/19/2018 - 19:06

ఒకవేళ నాతడు తన వాగ్దానమును మఱచినను తద్వ్యతిరిక్తముగా వర్తింపనాతని మనశ్శరీరములే నిరాకరించి విషయమును జ్ఞప్తికిదెచ్చెడివి. జగజ్జననికి సర్వము తానర్పించినను సత్యమును మాత్రమర్పింప జాలనైతివనియు, సత్యము నర్పించినచో తనయాత్మార్పణమే అసత్యమైపోవుననియు నాతడు వచించెను. నిజముగా ఆతని గంభీర వ్యక్తిత్వమును బరిశీలించినచో అందు సుగుణరత్న రాసులనంతముగా గాన్పించును.
జగద్గురువు

12/18/2018 - 19:37

వైష్ణవ చరణుడు, పద్మలోచనుడు, నారాయణశాస్ర్తీ మున్నగు సుప్రసిద్ధ పండితులు-ఉత్తమ సాధకులు- ఆ యమృతాస్వాదనభాగ్యమును బడసి తన్మయులై శ్రీరామకృష్ణుడు సాక్షాద్భగవదవతారమూర్తియని భావింపసాగిరి.*
శ్రీరామకృష్ణుడు పరమహంసయని- దివ్యపురుషుడని - లోకము గ్రహింపసాగెను. ఆజన్మాంతము మహోత్తమ సమాధిస్థితు లాతనికి తఱచు కలుగుచునేయుండినను ఆతని నిరంతర బ్రహ్మానుభూతి సమాధివంటి ప్రత్యేక మనఃస్థితిపై నాధారపడినది కాదు.

12/17/2018 - 18:56

ఈ నలుగురినే ఎందుకు ధ్యానించినట్లు!కొంత కాలమునకు బిమ్మట క్రీస్తును క్రైస్తవాదర్శమును ధ్యానించి తద్గమ్యమును నితర మతముల గమ్యమునొక్కటియేయని గ్రహించెను.

Pages