S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/28/2018 - 18:34

నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి, తన సహజ నైజమైన సచ్చిదానం దాన్ని మరిచి తానే శరీరం అనుకుంటాడు. ఆ భావనతో తానే అంతా చేసేవాడినని, అనుభవించే వాడినని అనుకుంటూ లెక్కలేని బాధల్లో చిక్కుకుని విముక్తిని పొందలేకున్నాడు. విమోచనం పొందటానికి మార్గం ఒక్కటే. అది గురుని పాదాలపై ప్రేమమయమైన భక్తిని కలిగి ఉండటం.

11/27/2018 - 18:42

అదే వింత అనుకుంటే బాబా మరో వింత చేసేవారు. బాబా బల్ల నాలుగు మూలలా నాలుగు దీపపుప్రమిదలను ఉంచి రాత్రంతా దీపాలు వెలిగించి ఉంచేవారు. ఇది మరీ చిత్రంగా ఉండేది. అసలే బాబా ఆజానుబాహువు. బాబా సరిగాపడుకోవటానికే ఆ బల్లసరిపోదు. పైగా దానికి నాలుగు మూలలా నాలుగు దీపపుప్రమిదలు. మధ్యలో బాబా శయనించటం. నిజంగా బాబా ఆ బల్లపై పడుకునే తీరును దేవతలైనా చూసి తీరాల్సిందే.

11/26/2018 - 19:01

ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలో శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడతాయి. భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు ఆకారంగలవాడని నమ్మేవారిని ఖండించి అది వట్టిభ్రమ అంటారు. యోగీశ్వరులు కూడా మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరించటం ఎందుకు? అని ప్రశ్నిస్తారు. ఇతర శాఖలవారు కూడా ఆక్షేపణచేస్తూ వారి సద్గురువువారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవచేయనేల? అని అంటారు.

11/22/2018 - 20:57

పుట్టపర్తి పట్టణంలో సత్యసాయి ఏర్పాటు చేసిన ఆశ్రమం పేరే ప్రశాంతి నిలయం. సత్యసాయి ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్ని కులాలు, అన్ని మతాలు సమానమేనని ప్రకటించారు. సత్యం, ధర్మం, శాంతి, పేమ, అహింస అనే మానవతా విలువల ఆధారంగా అందరి మధ్య సత్సంబంధాలు నెలకొనేలా చేశారు.

11/21/2018 - 18:56

శిరిడీలో రోహిలా ఉండేవాడు. భారీ ఆకారుడైన అతను గట్టిగా మాట్లాడితే ఆంబోతు రంకె వేసినట్టుండేది. అతనికి అల్లా అంటే మహాభక్తి. కానీ, ఏం లాభం?. భగవంతునిపై దృష్టి పెడదామంటే క్షణమైనా ఏకాగ్ర కుదిరేది కాదు. బుద్ధి వక్రించి దెయ్యాల వంటి చెడు తలంపులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేవి. మనసును భగవంతునిపై నిరంతరం లగ్నం చేయటానికి మసీదులో కూర్చుని ఖురాన్‌లోని కల్మానును గట్టిగా చదివేవాడు.

11/20/2018 - 20:20

మీలాద్ - ఉన్ - నబీ.. అరబ్బుల మత, రాజకీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్ లేదా మహమ్మద్. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్ ప్రవక్తతో ప్రారంభమైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్ చివరివారు. ముస్లిమేతరులు సాధారణంగా మహమ్మద్‌ను ఇస్లాంమత స్థాపకునిగా భావిస్తారు.

11/19/2018 - 03:31

సాయితత్వంలో అద్భుతమైన కాంతి ఉంది. తేజోవంతమైన కాంతి ఉంది. అన్యోన్యమైన ప్రేమ ఉంది. బాబా పలుకుల్లో అమృతం ఉంది. సాయి బంధువులకు అవి అయాచితంగా లభించే వరాలు. బతికున్నంతకాలం చివరి శ్వాస వరకు ఏదో విధంగా ఎంత కొంత కూడబెట్టాలన్నదే మనిషి ఆశ. సంపాదించుకోవటం, ఆస్తులు పోగెయ్యటం తప్పుకాదు కానీ, తను సంపాదించినదంతా ‘తనదే’నని, ‘తానే అనుభవించాలని’ అనుకోవటం మాత్రం పచ్చి స్వార్థం అనిపించుకుంటుంది.

11/14/2018 - 18:48

శ్రీ సాయి సచ్చరిత్రలో గురువు ఆవశ్యకత గురించి బాబా ఏమన్నారో హేమాడ్ పంతు రాయలేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ అనే గొప్ప భక్తుడు ఈ విషయమై తాను రాసుకున్న అనుభవాన్ని ప్రచురించాడు. హేమాడ్‌పంతు శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకునేలా చేయటంలో నానాసాహెబు చాందోర్కర్‌తోపాటు కాకాసాహెబు దీక్షిత్ కూడా కారకుడే. హేమాడ్ పంతు శిరిడీ వెళ్లి బాబాను కలిసిన రెండో రోజు కాకాసాహెబు కూడా అక్కడికి వచ్చాడు.

11/13/2018 - 18:29

శిరిడీలో జరిగే ముఖ్య ఉత్సవాలు

11/12/2018 - 18:36

నానావలి సమాధి

Pages