S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/23/2018 - 22:44

ముఖంపై చేదుగా మాట్లాడేవారు , అంతగా ఎపుడూ మోసం చేయరు. బయటపడవల్సింది తియ్యగా మాట్లాడేవారితోనే మనసులో అసూయను పెంచుకొంటారు. సమయం వచ్చినపుడు మారిపోతారు. అద్దం చాలా పెళుసైనది. పలుచనైనది. చేయిజారితే ముక్కలైపోతుంది. కానీ ఎప్పుడూ నిజాన్ని చెప్పడానికి జంకదు. మనిషి కూడా ఏ ఆలోచనలనైనా అద్దం లాగా చూడాలి. ఇతరులతో వ్యవహరించేటపుడు అద్దం వలె ఉండాలి. కర్ణుడికి దాన కర్ణుడని పేరు.

10/23/2018 - 19:03

కొండలు, నదులు ఈ భూమోకంలో ఉన్నంతవరకు రామాయణ కథ లోకములో ప్రచారమును పొందగలదు అని రామాయణ కావ్యాన్ని అందించిన వాల్మీకి ఆదికవిగా ప్రసిద్ధి నొందాడు. మొట్టమొదటి కాలంలో వాల్మీకి కిరాతక జాతికి చెందిన ఋక్షుడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో అరణ్యంలో తిరుగుతూ దారిదోపిడీలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అడవి మార్గంలో సప్త ఋషులు వెళ్తున్నారు. వారిని ఈ బోయవాడు అడ్డగించాడు. ధనం ఇవ్వమని పీడించసాగాడు.

10/19/2018 - 22:52

తే.గీ ఇలను లలనల కుసుమకోమలకరముల
కనన శోకమా! రసిక నికరము నీదు
ముగ్థపల్లవంబులతోడ పోల్చుచుండ
ఆకసంబును తాకగా, ఆశ ఏల?

10/16/2018 - 23:57

ఆ.వె ప్రియుని కలలనైన ప్రియమారగాంచెడు
ఇంతి భాగ్య గరిమ నెంచదరమె
చెంత వాడు లేక చేరదే నను నిద్ర
కలలవెట్లు, వాని గాంచు టెట్లు!
విరహవేదన పడుతున్న ఒక కాంత తన సఖితో ఇలా అంటోంది. ‘నిద్రలోనైనా కలల్లో ప్రియుని చూడగలిగిన తరుణలదే భాగ్యం. కానీ వాడు నాకు చెంతలేనిదే కన్నులు మూతపడవు. నిద్రా రాదు. ఇంక వాణ్ణి కలలోనైనా చూచేదెట్లాగే సఖీ!’ అని బాధపడిందా నాయిక.

10/15/2018 - 22:40

మీలో విత్తనముంది. కానీ, అది మొలకెత్తేందుకు కావలసిన నేల, సరియైన ఋతువు, అనుకూల వాతావరణం, అనువైన సమయాలకోసం మీరు అనే్వషించక తప్పదు. కాబట్టి, జంతువులా సమాంతరంగా సంచరించడంవల్ల మీరు ఆత్మరహితంగా మిగిలిపోతారు. అదే మీలోకి నిలువుగా ఏదైనా చొచ్చుకుపోయినప్పుడు, మీరు ఒక ఆత్మగా పరిణమిస్తారు. ఆత్మ అంటే సమాంతరంలోకి నిలువుగా చొచ్చుకుపోవడమన్నమాట. ఉదాహరణకు, మీరొక గొంగళిపురుగు, సీతాకోక చిలుకలా ఊహించుకోండి.

10/14/2018 - 22:39

దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగానికి దేవతలనందరిని ఆహ్వానించి శంకరుడిని విస్మరించడంతో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞస్థలాన్ని చేరి తండ్రి దక్షప్రజాపతిని పరుషమైన మాటలతో నిందించి చివరకు తాను కూడా అవమానించబడగా, ఆమె ఆవేశాగ్నికి అక్కడ వున్న ఒక నెమలిపిల్ల భయపడి సచీదేవి ఒడిలో దాగింది. అది గమనించని సచీదేవి అవమానంతో అగ్నిప్రవేశం చేసింది. అప్పుడు ఆమెతోపాటు నెమిలి కూడా దహనమైంది.

10/11/2018 - 18:37

అష్టాదశ శక్తిపీఠంలో ఏకవీరాదేవి ఒకరు. శ్రీనాథ మహాకవి కృతక్రీడాభిరామంలో ఏకవీరాదేవిని గురించి వర్ణిస్తూ, కాకతమ్మకు సైదోడుగా మండపాక మున్నగు గ్రామాల్లో నివసించేదని వర్ణించారు. పూర్వం పరిమి వెంకప్ప పసుపుతోటలో ఒక నౌకరు నాగలి దున్నుతుండగా నాగలి సాలు భూమిలో దిగబడి కదలలేదు. అతడు బలవంతంగా తోలగా, ఎడ్ల గిట్టలనుండి రక్తం కారసాగింది. అది చూసి నౌకరు రక్తం కక్కి మరణించాడట.

10/10/2018 - 18:40

స్వేచ్ఛ నాకు మంచి మిత్రుడు.. ఇవన్నీ కలలు, కోరికలే. కచ్చితత్వమే మీ పంజరం. అదే దానికి రక్షణ. కానీ, ఆడంబరాల తళుకు బెళుకులతో నిండిన మది గదిని తుడిచే హృదయం నాకు లేదు.. ఇవన్నీ మీ మనసులోని అందమైన భావాలే.

10/09/2018 - 19:11

ప్రతి పండుగనూ పరంపరానుగతంగా ప్రత్యేక శైలిలో, విశిష్ట పద్ధతిలో జరుపుకునే ధార్మిక కార్యాచరణాసక్తుల నిలయమైన తెలంగాణలో అపురూప సోదరీమణులైన జేష్ఠాదేవి, లక్ష్మీదేవిలను కొలుస్తూ, బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను భక్తి శ్రద్ధలతో, పిల్లా పాపలతో కలిసి మహిళలు జంట పండుగలుగా పక్షం రోజుల తేడాతో నిర్వహించడం అనాదిగా ఆచరిస్తున్న సనాతన సాంప్రదాయం.

10/08/2018 - 19:00

పంజరంలో సమయానికి ఆహారం, శత్రువుల నుంచి రక్షణ లభించడంతోపాటు బయట జరిగే అనవసర విషయాల తలనొప్పులు లేకపోవడం పంజరంలోని చిలుకకు హాయిగానే ఉంటుంది. పైగా, అది బంగారు పంజరం కూడా. ఏ చిలుకకు దక్కుతుంది అలాంటి వైభోగం. అందుకే ఆ చిలుకను బయటకు వదిలినా, అది మళ్లీ పంజరంలోకే చేరింది. అధికారులు, సంపదలు, పరువు ప్రతిష్ఠలు- ఇలాంటివన్నీ పంజరాలే. మీ ఆత్మ స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంది. కానీ స్వేచ్ఛ చాలా ప్రమాదకరమైనది.

Pages