S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/09/2019 - 19:38

979. శ్రీగురుదేవుని పరిశుద్ధమానసమే యాతనికి ప్రథమ గురువై, ప్రధాన గురువై యొప్పెను. ఇన్విషయమునుగూర్చి శ్రీగురుదేవుడిట్లు వచించియున్నాడు; అవసరమైనప్పుడెల్ల నా శరీరములోపలి నుండి సరిగా నావలెనే కాన్పించునొక బాలసన్న్యాసి వెలువడి నాకు సర్వము బోధించువాడు. ఈ విధముగా నాతడు వెలువడ నొక్కొక్కప్పుడు కొంచెము బాహ్యస్ఫురణ గలిగియుండెడివాడను. మఱియొక్కొక్కప్పుడు ఆతని సాన్నిధ్యమును చేష్టలను కనిపట్టుట తప్ప.

07/08/2019 - 18:37

ఒక్కొక్కప్పుడు తీవ్ర భగవద్విరహవేదనచే మొగము నేలనుబెట్టి రాచుకొన, గాయములై రక్తము వచ్చెడిది. ధ్యానముతో, ప్రార్థనలతో, భక్తిసాధనలతో, దినములు అట్టె నిముషములవలె గడచిపోవ, నాకపుడు వానిని గూర్చిన యెఱుకయే లేకుండెడిది. సంధ్యాసమయమును ఆలయమునుండి శంఖ ఘంటారవములు ఘోషింప పగలు గడచి రాత్రియగుచున్నదని నాకపుడు స్మరణకు వచ్చెడిది.

07/07/2019 - 23:01

తన దివ్యానుభవమును శ్రీగురుదేవుడిట్లు వర్ణించెను: తలుపులతో, కిటికీలతోగూడ ఆ గదియు ఆలయమును నాచుట్టునున్న సమస్తము క్షణములో అదృశ్యమయ్యెను. ఇక నేమియు లేనట్లు తోచెను. దేదీప్యమానమగు ననంత చైతన్యసాగరము మాత్రమే నాకు గోచరింపసాగెను. ఏ వైపు జూచినను- అన్ని దిశలనుండియు- ఆ దివ్యసాగర మహోత్తుంగ తరంగములు నావైపు ఉవ్వెత్తుగ వచ్చుచుండెను. అచిరకాలముననే యవి నాపైబ్రసరించి నన్ను ముంచివేసెను.

07/05/2019 - 19:02

ఇకనాతడు కేవలము భగవంతుని సేవించుటలో- వాని యాజ్ఞను బరిపాలించుటలో- ఆనందము గాంచుచుండును. ఇతర వ్యాపారములు ఆతనికిక నెంతమాత్రము రుచింపవు. ఆతడిక దైవసంసర్గమునవలన గలుగు నానందపారవశ్యమును బోగొట్టుకొన నొల్లడు.

07/04/2019 - 18:40

ఒక సాధువు జనాకీర్ణమైన వీధినుండి పోవుచు, పొరపాటున ఒక దుష్టుని కాలి వ్రేలిని త్రొక్కెను. ఆ దుష్టుడు కోపావేశపరవశుడై సాధువును స్మృతి తప్పి పడిపోవునటుల నిర్దయుడై మోదెను. ఆ సాధువు శిష్యులు అనేకోపచారములు సలిపి యాతనికి స్మృతిగలిగించుటకై చాల శ్రమపడిరి.

07/03/2019 - 19:28

ఈ వింత చెలికానితో ఇట్లు భోజనమైన పిమ్మట ఆ సాధువు కాళీదేవాలయమును జొచ్చి, ఆలయములోనివారికెల్ల గగుర్పాటొదవునటుల మహాభక్త్యావేశముతో దేవిని ప్రార్థింపసాగాను. కొంతసేపటికి ప్రార్థనను ముగించి యాతడు వెడలిపోవుచుండుట గాంచి, శ్రీగురుదేవుడు తన శిష్యుడగు హృదయుని అతని వెంట బోయి యాతనితో సంభాషించి రమ్మని పంపెను.

07/02/2019 - 19:24

అపుడాతడు భగవంతునియందును సంసారమునందును కూడా సమానముగనే నెలకొనియుండగలడు.
957.గాలి మంచిగంధపు వాసనను, క్రుళ్లి కంపుగొట్టు శవము యొక్క దుర్గంధమును కూడా సమానముగనే వహించును, కాని యది వానితో మిళితము కాదు. ఇటులనే ముక్త పురుషుడు సంసారమున జీవించుచుండియు దానితో మిళితము కాడు- బద్ధుడు కాడు.

07/01/2019 - 19:46

952. యూదులు శిలువపై ఏసుక్రీస్తును మేకులు గొట్టి బంధించినపుడు అతడు అంతటి బాధకు గురియైనను, ‘‘వారు క్షమింపబడుదురుగాక!’’ అని యెట్లు ప్రార్థింపగలిగెను? గునపముతో కొబ్బెర బోండమును ఒలుచునపుడు గునపము లోపలి ముక్కలోనికి గూడా దిగవచ్చును. కాని కురిడీకాయ సంగతి వేరు. కురిడీ చిప్పనుండి వేరుపడి లొటలొటలాడుచుండును. అపుడు గునపముతో డొక్కలను ఒలిచినను కురిడీని అది తాకజాలదు. ఏసుక్రీస్తు కురిడీ కాయవంటివాడు.

06/30/2019 - 22:27

946. నీట ముంచిన కడవకు లోపలను వెలుపలను గూడ జలముండును. అట్లే భగవంతుని యందు లయ మొందిన జీవునకు బాహ్యాభ్యంతరములందు అఖండాత్మయే గోచరించును.
947.భగవత్ సాక్షాత్కారము నొందిన పిమ్మట భగవంతుడు సర్వత్ర, సర్వమునందును గోచరించును. కాని మరి ఏ ఇతర వస్తువునందు కంటెను నరునందు భగవంతుడు విశేషముగా ప్రకాశించుచుండును;

06/28/2019 - 19:50

5) నిత్యసిద్ధులు- జన్మతః ముక్తులై యుండువారు, సొర, గుమ్మడి మున్నగు తీగలందు మొగ్గలు విచ్చుటకు పూర్వమే పిందెలు కానవచ్చును, అటులనే నిత్యసిద్ధులు జన్మముతోడనే సిద్ధులై యుందురు. సిద్ధిపొందుటకు వారు చేయుచున్నట్లు కాన్పించు యత్నమంతయు- సాధనలన్నియు- లోక సంగ్రహార్థమే- లోకమునకు మార్గదర్శకములుగా నుండుటకే.

Pages