S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/07/2018 - 19:34

సద్గ్రంథపఠనం వల్లనో, ప్రవచన కారుల బోధ వల్లనో ఈనాడు సమాజంలోని వృద్ధులకు, అనాథలకు, దివ్యాంగులకు, రోగులకు, కుల, మత , ప్రాంత లింగభేదాన్ని పాటించక సేవ చేయడానికి ఎందరెందరో నడుము బిగిస్తున్నారు. ధనవంతులు విరాళాలిస్తున్నారు. ఊరూరా సేవా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

08/06/2018 - 19:33

కైలాసనాథుడైన పరమేశ్వరుడు పర్వతరాజు పుత్రిక పార్వతీదేవీ వధూవరులుగా శివకళ్యాణం త్రియుగీ నారాయణ్ అనే ఆలయంలో జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగకు పడమరగా 5 కి.మీ దూరంలో త్రియుగ్ నారాయణ్ అనే గ్రామంలో వున్నది. ఈ ప్రదేశం సత్యయుగంలో నిర్మాణమైందని పురాణాలు తెలుపుతున్నాయి.

08/05/2018 - 21:19

మనిషికి ఆశ ఉండాల్సిందే. ఆశతోనే జీవన ప్రగతి సాధించడానికి వీలుకలుగుతుంది. కాకపోతే ఈ ఆశ అత్యాశగా మారకూడదు. అత్యాశ ఎప్పుడైతే పొడ చూపుతుందో స్వార్థం బయలుదేరుతుంది. ఆ స్వార్థం వల్ల పక్కవాడిది దోచుకోవాలన్న బుద్ధి పుడుతుంది. ఉదాహరణకు కూర్చోవడానికి కుర్చీ ఉంటే బాగుంటుంది అనుకోవడం సహజం. ఆ కుర్చిలోకి దిండు ఉండాలనుకోవడమూ సమంజమే.

08/03/2018 - 19:11

ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రియైన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాప వచనమును బయలువెళ్లును. నా ప్రియులారా! ఇలాగుండకూడదు.

08/01/2018 - 18:58

కృష్ణుడు అతి లాఘవంగా కాళీయుని పైన చిందులు వేస్తున్నాడు. అతడు అడుగులకు కాళీయుని నరనరాలు తెగిపోతున్నాయా అన్నట్టుంది. ఆ సంగతి అంతా కాళీయుని భార్యలు చూశారు. ‘అయ్యో తమ నాథుడు ఇలా బాధపడుతున్నాడే. అయినా చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే కదా. మా పతిదేవుడు నిజంగా దేవుడే. అందుకే ఆ కృష్ణుని పాదస్పర్శ తగిలింది. ఇక ఆయనకు పాపమేమున్నది. ఎన్నో యేళ్లనుంచి ఇలా పుడుతూ గిడుతూ ఎనె్నన్నో జన్మలు పొంది ఉన్నాడు.

07/31/2018 - 19:36

గలగల పారుతున్న నీటిలో ఒకవైపు సూర్య నమస్కారాలు, పశువులను కడగటం, బట్టలు ఉతకటం, కర్మకాండలు చెయ్యటం, పూజలకు వాడినటువంటి పూలు, ఆకులు, దీక్షాపరులు (దీక్షలు తీసుకున్నవారు) భుజించిన విస్తర్లు లాంటివి అన్నీ ఆ నీటిలోనే వేస్తుంటాము. ఇన్ని పనుల్లో మైల ఉంది. మంచి ఉంది, మడి ఉంది. ఇవన్నీ ఏక కాలంలోనే జరుగుతున్నాయి.

07/30/2018 - 18:49

‘గోహత్య మహాపాతకం’ అని మన శాస్త్రాలు, ఇతిహాసం చెబుతున్నాయి. ఖురాన్‌లో కూడా గోమాంసం రోగకారమని, ఆవుపాలు, నెయ్యి, వెనె్న రోగాలను పోగొట్టేవని ఉన్నది. జపాన్ శాస్తవ్రేత్త డా.యోషినేరీకి ‘ఆటోఫిణీ’పై ఏకాదశి ఉపవాసాలు క్యాన్సర్‌ను నిర్మూలిస్తాయనే అంశంపై నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది.

07/27/2018 - 20:49

భగవంతుని ఆరాధించడంలో పూజ చేసే సమయంలో పుష్పాలకు ఒక ప్రత్యేక స్థానం వుంది. పుష్ప పూజకు మనం ఎంతో ప్రాధాన్యతనిస్తాము. ఎంతో ఇష్టంగా స్వామి పాదాలవద్ద పువ్వులను వుంచి భక్తిపూర్వకంగా నమస్కరిస్తాము. అంతేకాదు ఆయనను వివిధ రకాల రంగుల పువ్వుతో అలంకరించి ఆనందిస్తాము. ఎన్నో రకాల పువ్వులు ఈ జగత్తులో భగవాన్ మనకు ప్రసాదించాడు.

07/26/2018 - 18:58

గురుపూర్ణిమ రోజు గురువును స్మరించడం, ఆయన చెప్పిన మాటలను స్మరణకు తెచ్చుకోవడం ఆచారం. మీకు ఈరోజు గోరఖ్ నాధుడనే గురువు గురించి కొన్ని వివరాలు చెబుతాను.. ఆయన గురువు మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్రనాథుడు కూడా ఒక గొప్ప యోగి. ఈయనని అందరూ శివాంశగానే భావించేవారు. ప్రజలు ఆయనను సాక్షాత్తు శివుడే అని అనేవారు. ఆయన శిష్యుడు గోరఖ్‌నాథుడు, తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడు.

07/25/2018 - 18:35

సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్
సంభాషణం కోటితీర్థం వందనం మవోక్ష సాధనమ్

Pages