S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/24/2018 - 18:27

ఈ భూమి మీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట మరియు తుప్పును తినివేయును. దొంగలు కన్నమువేసి దొంగిలించుదురు. పరలోకమునందు ధనమును మీకొరకు కూర్చుకొనుడు. అచ్చట మీ ధనమును చిమ్మెటయు, తుప్పును ఏమీ చేయజాలవు.దొంగలు కూడా దొంగిలించజాలరు.

07/22/2018 - 21:13

ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా, ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే ‘శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని ‘శయన ఏకాదశి’ అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని అనుసరణ సంకేతంగా చెప్పుకోవచ్చు.

07/20/2018 - 18:46

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘మహా ఏకాదశి’’యని, ‘‘ప్రథమైకాదాశి’’యని వ్రతోత్సవ చంద్రిక పేర్కొంటున్నది. చాతుర్మస్య దీక్షా దినాల ఏకాదశులలో మొదటిది కావడం చేత ‘‘తొలి ఏకాదశి’’గా నామాంతరం గలదియైనది. ఉత్తరాయణం కంటె దక్షిణాయనంలో పండువలు, పబ్బాలు అధికం. దక్షిణాయనంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉన్నందు వల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు అధికంగా పాటించాలని నిర్దేశించారు.

07/18/2018 - 19:27

లక్ష్మణునికి శ్రీరాముడు అనే్న కాదు, ఆదర్శమూర్తి కూడాను. అసలు రాముడు వేరు లక్ష్మణుడు వేరుకాదు. ఎవరైనా అన్నదమ్ములు కలసి ఉంటే రామలక్ష్మణులుగా ఉన్నారు అంటే అంటే వారిద్దరే అన్నదమ్ములకు ప్రేమకు మారు పేర్లు. ఉదాత్తమైన అనుబంధం రామలక్ష్మణులది. వీరిద్దరి లాగే భారతీయ సోదరులం తా కలసి ఉండాలని కోరుకోవాలి. అసలు భారతదేశమే కాదు సర్వ ప్రపంచంలోని సోదరులంతా కలసే ఉండాలి. అందరికీ ఆదర్శం రామాయణమే.

07/17/2018 - 18:56

భారతీయ సమాజ ఆధ్యాత్మిక సంస్కృతికి ఆలయాలు పట్టుకొమ్మలు. సనాతన ధర్మ ఔన్నత్యాన్ని, హిందూ సమాజ ధర్మాన్ని జీవన గమ్యాన్ని తెలియే ప్రతీకలే ఆలయాలు.జీవి దేహమే దేవాలయం. భౌతికమైన శరీరంలోని ఆత్మ ఆలయంలో ప్రతిష్టించే పరామాత్మ కు ప్రతిరూపం అనుకుంటే ప్రతి జీవి సంచార దేవాలయం. మానవుడు తన లోని శక్తితో పరమాత్మకోసం అనే్వషిస్తుంటాడు. ఆ అనే్వషణలో భగవంతుని సాక్షాత్కారం కోసం అనేక మార్గాలను తెలుసుకొన్నాడు.

07/15/2018 - 22:17

అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శిరిడీ సాయినాధుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించి తరించిన ఎందరో స్ర్తిమూర్తులున్నారు. వారంతా సాయి పాద పద్మాలపై అచంచలమైన భక్తితో స్వామిని నిరంతరమూ సేవిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ తరించిన స్ర్తిల గురించి ఒక్కసారి మనం స్మరించుకుందాము.

07/08/2018 - 21:21

నిత్యజీవితంలో తమ పిల్లల పెంపకం గురించి ఎంత అపురూపంగా చెప్పుకున్నా పడటం తెలియకనే తమ చిన్నారి నడవగలిగిందన్నా, అంతకన్నా ఉత్సాహంగా పరుగులు పెట్టిందన్నా అంతకుమించిన అసత్యం మరొకటి ఉండదు.
సత్యానికి, అసత్యానికి తేడా ఒకే ఒక్క అక్షరమే ఐనా వాటి తాలూకూ ప్రభావాలైనా ఫలితానైనా పరస్పర విరుద్ధాలు.

07/05/2018 - 21:47

ఆత్మ అను శబ్దము వినగానే మనకు యోగశాస్త్రం ప్రకారం 8 రూపాలు గుర్తుకొస్తాయి. అవి జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, నిర్మలాత్మ, సిద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ.
గుణ భేదాదాత్మమూర్తి రష్ట్ధాపరికీర్తితః
జీవాత్మా చాంతరాత్మాచ పరమాత్మాచ నిర్మలః
శుద్ధాత్మా జ్ఞానరూపాత్మ మహాత్మా సప్తమస్మృతః
అష్టమస్తేషు భూతాత్మా మిత్యష్టాత్మనః ప్రకీర్తితః

06/25/2018 - 21:39

జస్టిస్ కోదండరామయ్య
*
జస్టిస్ కోదండరామయ్యగారి నివాసంలో ఎందరో న్యాయవాదులు తయారయ్యారు. అలాగే మన పురాణాలపై అవగాహన పెంచడం గురించి, సనాతన ధర్మం కొరకు కృషిచేసే వీరాభిమానులూ తయారయ్యారు. నేడు ఆధ్యాత్మిక సైన్యంలా మన ధర్మాన్ని ఆచరింపచేయగల యువతరం ఏర్పడాలని కాంక్షిస్తూ ఉంటారు ఇటీవల అస్తమించిన న్యాయమూర్తి.

06/18/2018 - 21:35

మంత్రాలతో అద్భుతాలను సాధించవచ్చా? ఇదంతా ఒట్టిమాట అనే వారు కలియుగంలో ఎక్కువగా ఉన్నారు. కాని పూర్వకాలంలో మంత్రాలతోనే ఎన్నో అద్భుతాలను సృష్టించిన వారున్నారు.

Pages