S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/15/2019 - 22:21

ఇదే విధమున భగవంతుని యొకానొక రూపమును మాత్రమే లేదా యొకానొక కళను మాత్రమే దర్శించినవారు (భగవంతుని స్వభావమును గూర్చి) తమలోదాము వాదులాడుకొనుచుందురు.
నూతిలోని కప్ప

08/14/2019 - 19:14

అంత నామూఢభక్తుడు సగము సంతోషమును సగమువెగటును బొందెను. ఆతడు తానర్పించు నైవేద్యములను శివరూపముననున్న వైపున నుంచెనుగాని విష్ణురూపమున నున్న వైపున నేమియు బెట్టడయ్యెను. తన యిష్టదైవతమగు శివునకు ధూపమునర్పించి యాదురభిమాని విష్ణువు దాని ననుభవించిపోవునేమోయని వాని ముక్కు పుటములను గట్టిగా నదిమిపట్టినాడు.

08/13/2019 - 19:50

కొంత కాలమున కదృష్టవశమున యోగి తిరిగి యా మార్గముననే వచ్చి గాయములచే కృశించియున్న పాము దుర్దశనుగాంచెను; చాల జాలిచెంది హేతువేమని యడిచెను. అందులకా పామిట్లు సమాధానించెను: ‘‘స్వామీ! మీరు బోధించిన నాటినుండియు నేనెవ్వరిని హింసించుట లేదు. అదియే నా రుూ దుర్దశకు కారణము. అయ్యో! నాయెడ వారెంతయో నిర్దయులై- క్రూరులై- వర్తించుచున్నారు. ఏమని చెప్పుదును నా దురవస్థ!’’ యోగి చిఱునవ్వు నవ్వి యిట్లు పలికెను: ‘‘మిత్రమా!

08/12/2019 - 18:50

చేతి కధిష్ఠాన దేవత యింద్రుడు; కాబట్టి గోహత్యా పాతక మింద్రునిది కాని నాది కాదు.’’ స్వర్గమందలి యింద్రుడీ పలుకులను వినినాడు; విని యాతడొక వృద్ధ బ్రాహ్మణ వేషమును ధరించి తోట యజమానునియొద్దకు వచ్చి యిట్లు ప్రశ్నించెను: ‘‘అయ్యా, ఈ తోట యెవరిది?’’
బ్రాహ్మణుడు: నాది.

08/11/2019 - 19:31

ఐనను, ఈమె హృదయము పవిత్రమైనది కావున పుణ్యలోకమునకు బోవుచున్నది. నీ హృదయము సదా యామె పాపకార్యములనే మననము చేయుచుండెనుగాకన సపవిత్రమైనది. అందుచే నీ సపవిత్రులుండు లోకమునకే పోవుచున్నావు. నిజముగా వ్యభిచరించినది నీవుకాని యామె కాదు.’’
మిట్ట వేదాంతమువలన గలుగు ప్రమాదములు
మిట్ట వేదాంతియగు రాజు

08/09/2019 - 19:31

‘‘సరి, దీని జీవిత కాలమున నిటుపై దీని యింటి కెందఱు విటులు వత్తురో చూచెదనుగాక,’’ నాటినుండి కొన్ని బొమ్మరాళ్లను బ్రోగుచేసికొని, యా సాని యింట విటుడు ప్రవేశించినపుడెల్ల సన్న్యాసి యొక బొమ్మఱాతిని దీసి యొకచోట వేయుచుండువాడు. రానురాను ఆ ఱాళ్లొక పెద్ద కుప్పగా బెరిగినవి.

08/08/2019 - 20:00

ఇద్దఱు స్నేహితులు భాగవత కాలక్షేపము జరుగు తావునకు సమీపమునుండి పోవుచుండిరి. అందొకడు, ‘‘అదిగో, అచటికిబోయి కొంచెముసేపు పురాణమును విందము’’ అనెను.

08/07/2019 - 19:53

పాపమా నిర్భాగ్యుడేమి చేయగలడు? గురువుగారా, ఏవో మాయ మాటలతో- కల్లబొల్లి వాగ్దానములతో బంపివేయుటకు, ఆమె తన శయ్యామందిరపు గురవయ్యెను! ఇక నేమి చేయుట! ఈమె యాజ్ఞ అప్పటికప్పుడే చెలామణియై తీరవలయును. లేనిచో, ‘ఇంటిలోని పోరు ఇంతంత గాదయా!’ యనునట్లగును. తుదకా వర్తకుడు విధిలేక అర్థరాత్రి వేళ బోయి, కొట్టు తీసి భార్య కోసము బట్టలు తెచ్చినాడు.

08/06/2019 - 20:51

ఆ బ్రాహ్మణుని దైన్యముచూచి యామె, ‘‘అయ్యో, పాపము! ఈ బ్రాహ్మణుడు చాలా దురవస్థలో నున్నాడు’’ అని జాలిపడెను. ఆ బ్రాహ్మణుడు వెంటనే యిట్లనెను: ‘‘నీవు బాబుగారితో నొక్కమాట చెప్పితివా నాకుద్యోగము దొరకును’’. ‘‘గోపమ్మ యా రాత్రియే ‘బాబుగారితో’ జెప్పెదనని వాగ్దానము చేసెను’’. విచిత్రము!

08/05/2019 - 18:09

ఒకసారి రాజు తనకడకు రండని వారికి గబురుచేయగా, ‘‘రాజునే యిక్కడకు రమ్మనుడు’’అని జవాబు చెప్పిరి. కాని తరువాత వారు పెండ్లిండ్లు చేసికొనసాగిరి. అంత నిక రాజునకు వారిని బిలువనంపవలసిన యగత్యమే లేకుండబోయినది! వారు తమంతతామేపోయి, ‘‘మహారాజా! ప్రభూ! మిమ్ము దీవింపవచ్చితిమి. మీకొఱకై దేవాలయమునుండి ప్రసాదమును దెచ్చితిమి; స్వీకరింపుడు’’అని వేడుకొనువారు. వారటుల జేయక తప్పినది కాదు. పాపము. ఆ నిర్భాగ్యులేమి చేయగలరు?

Pages