S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/04/2019 - 18:40

ఒక సాధువు జనాకీర్ణమైన వీధినుండి పోవుచు, పొరపాటున ఒక దుష్టుని కాలి వ్రేలిని త్రొక్కెను. ఆ దుష్టుడు కోపావేశపరవశుడై సాధువును స్మృతి తప్పి పడిపోవునటుల నిర్దయుడై మోదెను. ఆ సాధువు శిష్యులు అనేకోపచారములు సలిపి యాతనికి స్మృతిగలిగించుటకై చాల శ్రమపడిరి.

07/03/2019 - 19:28

ఈ వింత చెలికానితో ఇట్లు భోజనమైన పిమ్మట ఆ సాధువు కాళీదేవాలయమును జొచ్చి, ఆలయములోనివారికెల్ల గగుర్పాటొదవునటుల మహాభక్త్యావేశముతో దేవిని ప్రార్థింపసాగాను. కొంతసేపటికి ప్రార్థనను ముగించి యాతడు వెడలిపోవుచుండుట గాంచి, శ్రీగురుదేవుడు తన శిష్యుడగు హృదయుని అతని వెంట బోయి యాతనితో సంభాషించి రమ్మని పంపెను.

07/02/2019 - 19:24

అపుడాతడు భగవంతునియందును సంసారమునందును కూడా సమానముగనే నెలకొనియుండగలడు.
957.గాలి మంచిగంధపు వాసనను, క్రుళ్లి కంపుగొట్టు శవము యొక్క దుర్గంధమును కూడా సమానముగనే వహించును, కాని యది వానితో మిళితము కాదు. ఇటులనే ముక్త పురుషుడు సంసారమున జీవించుచుండియు దానితో మిళితము కాడు- బద్ధుడు కాడు.

07/01/2019 - 19:46

952. యూదులు శిలువపై ఏసుక్రీస్తును మేకులు గొట్టి బంధించినపుడు అతడు అంతటి బాధకు గురియైనను, ‘‘వారు క్షమింపబడుదురుగాక!’’ అని యెట్లు ప్రార్థింపగలిగెను? గునపముతో కొబ్బెర బోండమును ఒలుచునపుడు గునపము లోపలి ముక్కలోనికి గూడా దిగవచ్చును. కాని కురిడీకాయ సంగతి వేరు. కురిడీ చిప్పనుండి వేరుపడి లొటలొటలాడుచుండును. అపుడు గునపముతో డొక్కలను ఒలిచినను కురిడీని అది తాకజాలదు. ఏసుక్రీస్తు కురిడీ కాయవంటివాడు.

06/30/2019 - 22:27

946. నీట ముంచిన కడవకు లోపలను వెలుపలను గూడ జలముండును. అట్లే భగవంతుని యందు లయ మొందిన జీవునకు బాహ్యాభ్యంతరములందు అఖండాత్మయే గోచరించును.
947.భగవత్ సాక్షాత్కారము నొందిన పిమ్మట భగవంతుడు సర్వత్ర, సర్వమునందును గోచరించును. కాని మరి ఏ ఇతర వస్తువునందు కంటెను నరునందు భగవంతుడు విశేషముగా ప్రకాశించుచుండును;

06/28/2019 - 19:50

5) నిత్యసిద్ధులు- జన్మతః ముక్తులై యుండువారు, సొర, గుమ్మడి మున్నగు తీగలందు మొగ్గలు విచ్చుటకు పూర్వమే పిందెలు కానవచ్చును, అటులనే నిత్యసిద్ధులు జన్మముతోడనే సిద్ధులై యుందురు. సిద్ధిపొందుటకు వారు చేయుచున్నట్లు కాన్పించు యత్నమంతయు- సాధనలన్నియు- లోక సంగ్రహార్థమే- లోకమునకు మార్గదర్శకములుగా నుండుటకే.

06/27/2019 - 22:11

బ్రహ్మజ్ఞాని
వివిధ ముక్త పురుషులు
932. ప్రకృతి శాస్తమ్రు పరిమిత జ్ఞానమును మాత్రమే ఒసగగలదని జనులు గ్రహింపజాలకున్నారు. అఖండమగు నాత్మ సామ్రాజ్యమును గూర్చి యది మనకెట్టి సందేశము నీయజాలదు. అట్టి సందేశమును పురాణ ఋషిసత్తముల వంటి బ్రహ్మద్రష్టలు మాత్రమే మనకు దెలిపియున్నారు. ‘‘బ్రహ్మతత్త్వ మిట్టిది’’ అని చెప్పుటకు వారికి మాత్రమే అధికారముకలదు.

06/26/2019 - 22:11

928. సంగీతమున స్వరములు ఆరోహణక్రమమున ఉచ్చస్థాయిని బొంది, అవరోహణక్రమమున మఱల నీచస్థాయిని బొందునట్లు సమాధి స్థితిలో అద్వైతానుభవమును బొందిన పిమ్మట బాహ్య లోకమునకు దిగివచ్చి, ‘అహంస్ఫురణ’తో నుండవచ్చును. ఒకదాని తర్వాత నొకటిగా దొప్పలనన్నిటిని ఒలిచివేసి, అరటి దూటను గైకొని, దానినే యందలి ముఖ్య భాగముగా భావింతుము. కాని తరువాత మఱల దొప్పలు అరటి చెట్టువే యని గణింతుము.

06/25/2019 - 22:12

అపుడు చైతన్య స్వరూపుడగు భగవంతుడు చైతన్యమునకే సాక్షాత్కరించును.
సమాధి సంజనితమైన విజ్ఞానము
927. సమస్త ప్రకృతినుండియు వేఱుపఱిచి ఆత్మను దెలిసికొనుటయే జ్ఞానము. విచారముచే ప్రకృతిని తొలగించుటచే సమాధిస్థితి లభించును; అపుడు ఆత్మసాక్షాత్కారమగును.

06/25/2019 - 21:52

సమాధి తత్త్వము
921. పిట్ట తన గూడు ధ్వస్తమైనప్పుడు ఆకాశమున కెగిరిపోవును. అట్లే శరీర స్ఫురణము బాహ్య ప్రపంచ స్ఫురణము నశించినంతనే జీవాత్మ పరమాత్మాకాశమున కెగిరిపోయి సమాధి స్థితియందు లయముగాంచును.

Pages