S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/28/2019 - 19:54

జ్ఞాపకం ఎప్పటికీ సత్యం కాదు. అందువల్ల అది ఎప్పుడూ సజీవంగా ఉండదు. ఎప్పుడూ సజీవంగా ఉండేదే సత్యం. ఎందుకంటే, సత్యమే జీవం. జ్ఞాపకానికి ఉనికి లేదు. అందుకే అది ఎప్పుడూ దయ్యాల ప్రపంచంలో జీవిస్తుంది. మనం కూడా అందులోనే ఉన్నాం. అందుకే జ్ఞాపకం ఎప్పుడూ మనల్ని వెంటాడుతూ ఉంటుం ది. అదే మన చెరసాల. నిజానికి, మనకున్నది అదే.

03/27/2019 - 20:03

ఎందుకంటే, తప్పులు చెయ్యడం ద్వారా మాత్రమే ఎవరైనా ఒప్పులు తెలుసుకుంటారు. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడం ద్వారా మాత్రమే ఎవరైనా పైపైకి ఎదుగుతారు.

03/26/2019 - 20:22

దానినే మీరు మీ ఎదుగుదలగా భావిస్తూ ఉంటారు. అది నిజమైన ఎదుగుదల అనుకుంటున్నారా? ఏ మాత్రం కాదు. కానీ అలా భావిస్తూ మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. ఎందుకంటే, అలా లభించిన పేరు మీరు కాదు. అలాగే బ్యాంకులో వున్న మీ నగదు నిల్వల ద్వారా మీకు లభించిన ప్రతిష్ఠ మీరు కాదు. ఇలా ఆలోచించిన మరుక్షణం మీలో వణుకు పుడుతుంది. ఎందుకంటే, నిజంగా మీరు ఎదగాలనుకుంటే మీ పిరికితనాన్ని మీరు వదులుకోక తప్పదు.

03/25/2019 - 19:34

వచ్చినది ఎవరో, ఏమిటో తెలియాలంటే తలుపు తియ్యక తప్పదు. కొత్తది ఏదీ మీ నుంచి ఉద్భవించదు. ఎందుకంటే, అది మీలోని భాగం కాదు. ఎక్కడో ఆవలి తీరంనుంచి అది వస్తుంది. మీ గతమంతా పణంగా పెట్టబడినదే. ఎప్పుడూ మీ దగ్గర లేనిదే కొత్తది. అందుకే అదంటే మీరు భయపడతారు. మీరు ఒక రకంగా ఆలోచిస్తూ జీవించారు. అలా మీరు మీ నమ్మకాల నుంచి సౌకర్యవంతమైన జీవితాన్ని ఏర్పరచుకున్నారు. ఎప్పుడో ఏదో కొత్తది మీ తలుపు తడుతుంది.

03/24/2019 - 22:11

జబ్బుపడిన తన బిడ్డలలో తల్లి యొకనికి అన్నము కూరయును, మఱియొకనికి సగ్గుజావను, వేఱొకనికి రొట్టెయు వెన్నయును బెట్టురీతిని భగవంతుడు వారి వారి స్వభావముల కనుకూలించునటుల జనులకు వేర్వేఱుమార్గముల ననుగ్రహించి యున్నాడు. (చూ.327.)
479. వేదాంతమునకు శంకరాచార్యులు చేసిన యర్థము సత్యమైనదే, రామానుజులు చెప్పునదియు- అనగా వారి విశిష్టాద్వైతమును- సత్యమే!

03/24/2019 - 22:07

వివాదపరులలో ఒకడు అతని గాంచి యిట్లనెను. ‘‘అయ్యా! ఆ చెట్టుమీది ఊసరవిల్లి ఎఱ్ఱగానుండును కాదండీ?’’- అందులకామనుష్యుడు, ‘‘ఔనయ్యా! అనెను. అంత రెండవవాడు ఇట్లు ప్రతిఘటించెను. ‘‘ఏమి చెప్పెదరు? అదెట్లు పొసగును? అది ఎఱ్ఱనిది కాదు, నీలిది’’ అందులకా పెద్దమనుష్యుడు సవినయముగా ‘‘ఔనండీ’’ అనెను. అతనికి ఊసరవిల్లి రంగులు తరచు మారుచుండునని తెలియును. అందుచే నాతడిరువురి వాదములకును ‘ఔ’ననియెను.

03/24/2019 - 22:21

అది సహజం. విజయం మీకు మనశ్శాంతి లేకుండా చెయ్యడమేకాక, జీవితంలో అత్యంత విలువైన నిశ్శబ్దము, ప్రశాంతత, ప్రేమ, ఆనందాలు వంటి అన్నింటిని దోచుకుంటుంది. కాబట్టి, వెంటనే మీకు మనశ్శాంతి అవసరమవుతుంది. అది ఎలా సాధించాలో చెప్పేందుకు మనసు గురించి ఏమీతెలియని అనేకమంది సిద్ధంగా ఉంటారు.

03/20/2019 - 22:17

వివిధ మతములు భగవత్ప్రాప్తి కనువగు వివిధ మార్గములు

03/19/2019 - 22:29

‘‘జగత్తునంతయు సమ్మోహిత మొనర్చు నీమాయచే నానా కృష్ణుడను గాకుండునట్లు కటాక్షింపుము.’’ రామచంద్రుడు, ‘‘తథాస్తు!’’ అని మఱలనిట్లు ప్రశ్నించెను. ‘‘నారదా! ఇంకేమియు వలదా?’’ ‘‘ప్రభూ! అదియే నా ప్రార్థన, ఇంకేమియువలదు’’ అని నారదుడు బదులుచెప్పెను.

03/18/2019 - 19:08

చక్రవర్తిగా మరణించిన వ్యక్తికి మాత్రమే ఆ బంగారు పర్వతంపై స్వయంగా సంతకంచేసే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశం లభించినందుకు సంబరపడుతున్న ఆ చక్రవర్తి ‘‘తనతోపాటు తన వాళ్ళనుకూడా లోపలకు అనుమతించమని, వారందరూ చూస్తుండగా ఆ పర్వతంపై సంతకం చేస్తానని ’’సుమేరు పర్వత ద్వారపాలకుడిని అడిగాడు. వెంటనే ఆ ద్వారపాలకుడు చక్రవర్తిని ఒక పక్కకు తీసుకెళ్ళి ‘‘మీ మంచికోరి చెప్తున్నాను.

Pages